Begin typing your search above and press return to search.

రజినీ నిజంగా యాడ్స్ లో నటించలేదా? ఆ వైరల్ క్లిప్ సంగతేంటి?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ రీసెంట్ గా తన నట ప్రస్థానంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   24 Aug 2025 1:20 PM IST
రజినీ నిజంగా యాడ్స్ లో నటించలేదా? ఆ వైరల్ క్లిప్ సంగతేంటి?
X

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ రీసెంట్ గా తన నట ప్రస్థానంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అనేక మంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, నెటిజన్లు.. అలా పెద్ద ఎత్తున అంతా విషెస్ తెలిపారు. అదే సమయంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జానార్ పోస్ట్ ఫుల్ వైరల్ గా మారింది.

కాసులకు కక్కుర్తి పడుతూ బెట్టింగ్ యాప్స్, మోసపూరిత కంపెనీలతో పాటు సమాజానికి తీవ్రంగా హాని చేసే అనేక సంస్థలను ప్రమోట్ చేస్తున్నారని, కానీ 50 ఏళ్ల సినీ జీవితంలో రజినీ ఎలాంటి వాణిజ్య ప్రకటనలు చేయకపోవడం గొప్ప విషయమన్నారు. రజినీని స్ఫూర్తిగా తీసుకోవాలంటూ ఓ పేపర్ కటింగ్ ను కూడా షేర్ చేశారు.

అందులో మన దేశంలో ఏ వాణిజ్య ప్రకటనల్లో కూడా నటించని ఏకైక స్టార్ హీరో రజినీకాంతే! ఎవరు ఎన్ని కోట్లు కుమ్మరిస్తామన్నా సరే తనకొద్దు అంటారని రాసి ఉంది. తమిళనాడు ప్రభుత్వం 1980ల్లో ప్రారంభించిన పల్స్ పోలియో చుక్కల మందు వ్యాప్తితోపాటు నేత్రదానం కోసం యాడ్స్ లో ఉచితంగానే నటించారని ఉంది.

కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ విషయం వైరల్ గా మారింది. ఐదు దశాబ్దాలకు పైగా బ్రాండ్ ఎండార్స్ మెంట్ లకు దూరంగా ఉన్నారనే అంటూనే ఒక పాత వీడియోను షేర్ చేస్తున్నారు నెటిజన్లు. అందులో రజినీకాంత్.. సీనియర్ నటి వై. విజయతో కలిసి ఓ డ్రింక్ ప్రకటనలో కనిపించారు. దీంతో ఇప్పుడు ఆ వీడియో ఫుల్ వైరల్ గా మారింది.

అయితే ఇప్పుడు ఆ వీడియోపై నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. కమర్షియల్ యాడ్స్ లో రజినీ నటించను.. నటించలేదు అన్నారుగా.. మరి ఇదేంటని కొందరు క్వశ్చన్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం అది కమర్షియల్ యాడ్ కాదని చెబుతున్నారు. అది పామ్ కోలా అని, దాన్ని ఎంకరేజ్ చేయడానికి యాడ్ చేశారని కామెంట్లు పెడుతున్నారు.

1980ల్లో తమిళనాడు సహకార సంఘం కోసం తాటి చెట్టు ఎక్కేవారి జీవనోపాధికి మద్దతు ఇవ్వడానికి, స్థిరమైన తాటి ఉత్పత్తులను ప్రోత్సహించడానికి రజినీకాంత్ పామ్ కోలా కోసం యాడ్ చేశారని చెప్పుకొస్తున్నారు. తాటి ఉత్పత్తుల ప్రయోజనాలు, తాటి చెట్టు ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం ఆ ప్రకటన లక్ష్యమని అంటున్నారు. అంతే గానీ కమర్షియల్ యాడ్ కాదని చెబుతున్నారు. మొత్తానికి వీడియో స్పష్టంగా చూస్తే అదే నిజంలానే ఉంది.