Begin typing your search above and press return to search.

రజినీ కోసం 83 లుక్స్… ఎగ్జైట్‌మెంట్ లో ఫ్యాన్స్!

తమిళ సినీ పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్‌ను సెట్ చేస్తూ ముందుకు సాగే స్టార్‌గా ర‌జినీకాంత్ పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   24 March 2026 12:00 AM IST
రజినీ కోసం 83 లుక్స్… ఎగ్జైట్‌మెంట్ లో ఫ్యాన్స్!
X

తమిళ సినీ పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్‌ను సెట్ చేస్తూ ముందుకు సాగే స్టార్‌గా ర‌జినీకాంత్ పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. అయితే గత కొన్నేళ్లుగా ఆయన సినిమాల్లో లుక్ పరంగా పెద్ద మార్పులు కనిపించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయన 173వ సినిమా కోసం పూర్తిగా కొత్త అవతారంలో కనిపించొచ్చన్న వార్తలు ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.

ర‌జినీ కోసం 83 డిఫ‌రెంట్ లుక్స్

సిబి చ‌క్ర‌వ‌ర్తి దర్శకత్వంలో ర‌జినీకాంత్ హీరోగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం స్పెష‌ల్ లుక్ డిజైన్‌పై భారీ స్థాయిలో వర్క్ జరిగినట్టు సమాచారం. దాదాపు 83 వేర్వేరు లుక్స్ ను రూపొందించగా, వాటిలో మూడు ఫైనల్ ఆప్షన్లు మాత్రమే షార్ట్‌లిస్ట్ చేసినట్టు టాక్. ఈ మూడు లుక్స్‌ను రజినీకాంత్‌కు ప్రెజెంట్ చేసి, ఫైన‌ల్ డెసిష‌న్ కు ఆయ‌న‌కే వ‌దిలేసిన‌ట్టు తెలుస్తోంది. ఒక స్టార్ కోసం ఇంత విస్తృత స్థాయిలో లుక్ ఎక్స్‌పెరిమెంటేషన్ జరగడం ఇండస్ట్రీలోనే అరుదైన విషయం.

ఫ్యాన్స్ నుంచి మిక్డ్స్ రెస్పాన్స్

ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రియాక్షన్ మిక్డ్స్ గా కనిపిస్తోంది. కొంతమంది అభిమానులు ఈ మార్పును ఆహ్వానిస్తూ కొత్త‌ లుక్ అంటే కొత్త ఎనర్జీ అంటూ, రజినీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు ఇది కొత్త డైమెన్షన్ తీసుకురాగలదని భావిస్తున్నారు. మరోవైపు, కొందరు మాత్రం కాస్త జాగ్రత్తగా స్పందిస్తున్నారు. గతంలో ఆయ‌న‌కు సెట్ అయిన ఆయన స్టైల్‌నే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారని, పెద్ద మార్పు చేస్తే అది రిస్క్ కావచ్చని అభిప్రాయపడుతున్నారు.

ఇక్కడే రిస్క్ vs రివార్డ్ అంశం ముఖ్యంగా మారుతోంది. ఒక లెజెండరీ స్టార్ ఇమేజ్‌ను మార్చడం అనేది సాధారణ నిర్ణయం కాదు. సక్సెస్ అయితే అది ట్రెండ్‌సెట్టర్ ఎలా అవుతుందో, విఫలమైతే విమర్శలకు కూడా దారితీస్తుంది. ముఖ్యంగా రజినీకాంత్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో విషయంలో ఈ బ్యాలెన్స్ మరింత సున్నితంగా ఉంటుంది. లుక్ ఛేంజ్.. కథతో, పాత్రతో సింక్ అయితేనే అది పనిచేస్తుంది.

ఇండస్ట్రీ పరంగా చూస్తే, ఇటీవల స్టార్ హీరోలు తమ లుక్స్‌పై ఎక్కువగా ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్న ట్రెండ్ కనిపిస్తోంది. పాన్-ఇండియా మార్కెట్ పెరగడంతో, ప్రేక్షకుల అంచనాలు కూడా మారాయి. ప్రతి సినిమాతో కొత్తదనం చూపించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో రజినీకాంత్ కూడా కొత్త లుక్‌తో వస్తే, అది ట్రెండ్‌ను మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఇవన్నీ ఊహాగానాలే. అధికారికంగా ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. చివరికి ఎలాంటి లుక్ ఫైనల్ అవుతుంది? అది ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది? అన్నది సినిమా రిలీజ్ అయ్యే వరకు సస్పెన్స్‌గానే ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది, ఈ ప్రాజెక్ట్‌పై ఇప్ప‌టికే భారీ ఆస‌క్తి నెల‌కొంది.