రజనీకాంత్ పెదరాయుడు ఎందుకు చేశాడంటే..?
సూపర్ స్టార్ రజనీకాంత్ తెలుగులో చేసింది చాలా తక్కువ సినిమాలే. అయినా కూడా ఆయన సినిమాలు తమిళ్ లో ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటాయో తెలుగులో కూడా అంతే పాపులారిటీ తెచ్చుకుంటాయి.
By: Ramesh Boddu | 14 Aug 2025 12:08 PM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ తెలుగులో చేసింది చాలా తక్కువ సినిమాలే. అయినా కూడా ఆయన సినిమాలు తమిళ్ లో ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటాయో తెలుగులో కూడా అంతే పాపులారిటీ తెచ్చుకుంటాయి. డబ్బింగ్ సినిమాలే కాదు రజనీ తెలుగులో చేసిన సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. సినిమా మొత్తం కాదు ఒక క్యామియో రోల్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు రజనీకాంత్. అదే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన పెదరాయుడు.
స్నేహితుడు మోహన్ బాబు కోసమే..
ఆ సినిమాలో రజనీకాంత్ నటించడం వల్లే సినిమాకు ఆ రేంజ్ హై వచ్చింది. పెదరాయుడు సినిమా మొత్తం ఒక ఎత్తైతే.. రజనీ పోర్షన్ మరో ఎత్తు. ఐతే రజనీకాంత్ పెదరాయుడు సినిమా కేవలం తన స్నేహితుడు మోహన్ బాబు కోసమే చేశారట. రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రయాణం తో పాటు కూలీ సినిమా రిలీజ్ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని చెబుతూ మంచు లక్ష్మి సోషల్ మీడియాలో మెసేజ్ చేశారు.
నాన్న, రజనీకాంత్ ప్రాణ స్నేహితులు.. చిన్నప్పటి నుంచి మా బర్త్ డేలకు ఆయన వచ్చారు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అన్నది పెద్దయ్యాక తెలిసిందని మంచు లక్ష్మి అన్నది. 50 ఏళ్ల వారి స్నేహం ఎప్పటికీ ఇలానే కొనసాగాలని కోరుతున్నా.. కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరి కోసం ఒకరు నిలబడ్డారు. పెదరాయుడు సినిమా నాన్న కోసం మాత్రమే రజనీ చేశారని చెప్పారు మంచు లక్ష్మి. అంతేకాదు నాన్న కోసం రాయలసీమ రామన్న చౌదరి కథ కూడా రాశారని వారిద్దరిది చాలా గొప్ప స్నేహమని అన్నారు మంచు లక్ష్మి.
గొప్ప వ్యక్తిగా రజనీకాంత్..
నటుడిగానే కాదు గొప్ప వ్యక్తిగా రజనీకాంత్ ఎంతోమందికి ఆదర్శమని .. పెద్ద స్టార్ అయినా ఆయన చాలా సామాన్యంగా ఉంటారని కూలీ కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నా అందుకే ఈరోజు ప్రోగ్రామ్స్ అన్నీ వాయిదా వేసుకుని సినిమా చూస్తున్నా అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు మంచు లక్ష్మి.
రజనీకాంత్ కూలీ సినిమా మాత్రమే కాదు రజనీ 50 ఏళ్ల సినిమా పండగలా ట్రీట్ చేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ కూడా ఉన్నారు. సినిమాలో శృతి హాసన్ ఫిమేల్ లీడ్ గా నటించగా మోనికా సాంగ్ లో తన డ్యాన్స్ తో అదరగొట్టింది పూజా హెగ్దే.
