Begin typing your search above and press return to search.

మాజీ ముఖ్య‌మంత్రితో సూప‌ర్ స్టార్ రాజ‌కీయం ఏంటో?

అనిరుధ్, కావ్య మారన్ వివాహం కోసం గ్రీస్‌కు బయల్దేరిన రజనీకాంత్, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ కుటుంబంతో కలిసి ప్రయాణించడం చర్చనీయాంశమైంది. ఈ వీడియోలు వైరల్ కావడంతో స్టాలిన్‌తో రజనీ సాన్నిహిత్యంపై, డీఎంకేకు ఆయన మద్దతుపై ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే రాజకీయ మద్దతుపై రజనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

By:  Srikanth Kontham   |   9 Nov 2026 4:13 PM IST
మాజీ ముఖ్య‌మంత్రితో సూప‌ర్ స్టార్ రాజ‌కీయం ఏంటో?
X

సెల‌బ్రిటీలు రాజ‌కీయ పార్టీల‌కు బాహాటంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం అన్న‌ది అరుదు. మ‌న‌సులో మెచ్చిన పార్టీ ఉన్నా? బ్యాకెండ్ రాజ‌కీయాలు మాత్ర‌మే చేస్తారు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కూడా ఆ కోవ‌కు చెందిన వారే. ర‌జ‌నీ సొంతంగా ర‌జ‌కీయ పార్టీ స్థాపించాల‌ను కున్నారు. కానీ చివ‌రి నిమిష‌యంలో వ‌య‌సు రీత్యా రాజ‌కీయాల‌కు దూరంగా ఉండ‌ట‌మే మంచిద‌ని వెనుదిరిగారు. కానీ ఆయ‌న మ‌ద్ద‌తిస్తున్న పార్టీ మాత్రం డీఎమ్ కే అన్న‌ది కొంత వ‌ర‌కూ నిజం. ఆపార్టీకి ప్ర‌త్య‌క్షంగా మ‌ద్ద‌తిస్తున్న‌ట్లు ఏనాడు ప్ర‌క‌టించ‌లేదు గానీ స్టాలిన్ మ‌ద్ద‌తుగా నిలిచిన సంద‌ర్బాలున్నాయి.

ద‌ళ‌ప‌తి విజ‌య్ పార్టీ పై ర‌జ‌నీ చేసిన వ్యాఖ్య‌లు స‌హా కొన్ని స‌మీక‌ర‌ణాల దృష్ట్యా డీఎంకే మ‌ద్ద‌తు దారుడిగానే ర‌జ‌నీకాంత్ ని మిగ‌తా పార్టీలు భావిస్తుంటాయి. తాజాగా అందుకు మ‌రో బ‌ల‌మైన సాక్ష్యం క‌నిపిస్తుంది. సంగీత సంచ‌ల‌నం అనిరుద్ - కావ్య మార‌న్ ల వివాహం ఈనెల 11న గ్రీస్ లో జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రెండు కుటుంబాలు గ్రీస్ కు చేరుకున్నాయి. వారితో పాటు ఇత‌ర సెల‌ బ్రిటీలు..స‌న్నిహితులు కూడా ప్లైట్ ఎక్కారు. ఈ నేప‌థ్యంలో ర‌జ‌నీకాంత్ కూడా గ్రీస్ బ‌య‌ల్దేరారు. అయితే ఈ ప్ర‌యాణం ఆయ‌న ఒక్క‌రే చేయ‌లేదు. ర‌జ‌నీకాంత్ మాజీ సీఎం స్టాలిన్ కుటుంబంతో పాటు క‌లిసి వెళ్తున్నారు.

దానికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ స‌న్నివేశంతో మ‌రోసారి స్టాలిన్ తో ర‌జ‌నీకాంత్ ఎంత స‌న్నిహితంగా ఉంటున్నారు? అన్న‌ది అర్ద‌మైంది. ఈ నేప‌థ్యంలో ర‌జ‌నీకాంత్ మ‌ద్ద‌తు పూర్తిగా స్టాలిన్ కు ద‌క్కుతుందా? అన్న‌ అనుమానాలు అంత‌కంత‌కు బ‌ల‌ప‌డుతున్నాయి. ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే?

గ్రీస్ లో వివాహం అనంత‌రం ర‌జ‌నీ తిరుగు ప్ర‌యాణం నేరుగా ఇండియాకు ఉంటుందా? అక్క‌డ నుంచి వెకేష‌న్ ప్లాన్ చేసారా? తెలియాలి. ఇటీవ‌లే ర‌జ‌నీకాంత్ న‌టించిన `జైల‌ర్ 2` రిలీజ్ అయి బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో ర‌జ‌నీ రెట్టించిన ఉత్సాహంలో ఉన్నారు. సాధార‌ణంగా కొత్త సినిమా రిలీజ్ అనంత‌రం వెకేష‌న్ కు వెళ్ల‌డం ర‌జ‌నీకి అల‌వాటు. ఈ నేప‌థ్యంలో గ్రీస్ నుంచి మ‌రో దేశానికి వెకేష‌న్ కు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక స‌మాచారం లేదు. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాత్ న‌టిస్తోన్న `ధ‌ర్మ‌న్` సెట్స్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొంత భాగం షూటింగ్ పూర్త‌యింది.పెండింగ్ షూటింగ్ స‌హా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేసి సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.