Begin typing your search above and press return to search.

ఎంత ఎదిగినా కానీ... గుర్తు చేసుకుని మ‌రీ ర‌జ‌నీ ఎమోష‌న‌ల్!

ఈవెంట్‌లో రజనీకాంత్ మాట్లాడుతూ.. ఐదేళ్ల పాటు బెంగళూరులో చేసిన బస్సు కండక్టర్ ఉద్యోగాన్ని ఇప్పటికీ మిస్ అవుతున్నానని వెల్లడించారు.

By:  Sivaji Kontham   |   13 Oct 2026 12:45 PM IST
ఎంత ఎదిగినా కానీ... గుర్తు చేసుకుని మ‌రీ ర‌జ‌నీ ఎమోష‌న‌ల్!
X

స్కూల్ డేస్ అయినా, కెరీర్ తొలినాళ్లయినా.. ఆ రోజుల్లో ఉండే ఆనందం, తృప్తి జీవితంలో ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా మళ్లీ దొరకవు. సూపర్‌స్టార్ రజినీకాంత్ తాజా వ్యాఖ్య‌లు దీనిని ప్ర‌తి ఒక్క‌రికీ గుర్తు చేస్తాయి. ఇటీవల ఒక ఈవెంట్‌లో పాల్గొన్న రజనీకాంత్ మాట్లాడుతూ తన గతాన్ని త‌ల‌చుకుని ఎంతో భావోద్వేగానికి గుర‌య్యారు. బెంగళూరులో బస్సు కండక్టర్‌గా పనిచేసిన రోజులు తనకెంతో సంతోషాన్నిచ్చాయని.. ఎంత పెద్ద స్టార్‌డమ్ వచ్చినా ఆ రోజుల్లో దక్కిన ఆనంద‌మే వేరని ఆయన చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.

ఈవెంట్‌లో రజనీకాంత్ మాట్లాడుతూ.. ఐదేళ్ల పాటు బెంగళూరులో చేసిన బస్సు కండక్టర్ ఉద్యోగాన్ని ఇప్పటికీ మిస్ అవుతున్నానని వెల్లడించారు. సుమారు ఐదేళ్లపాటు ఆ ఉద్యోగం చేశానని.. ఆ సంతోషకరమైన రోజులను తాను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. అందుకే ఆ జ్ఞాపకాలను నెమరువేసుకునేందుకు ఇప్పటికీ తరచూ బెంగళూరుకు వెళ్తుంటానని తెలిపారు. అంతేకాకుండా.. తాను ఎంతటి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించినా... తనను తాను ఎప్పుడూ ఒక పెద్ద స్టార్‌గా భావించనని.. ఇప్పటికీ ఒక సాధారణ బస్సు కండక్టర్‌గానే అనుకుంటానని చెప్పుకొచ్చారు.

ప్రతి ఒక్కరూ జీవితంలో పరిగెత్తి చాలా సంపాదించి ఉండొచ్చు.. డబ్బు - అపారమైన కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించి ఉండొచ్చు. కానీ అవేవీ మనిషికి పూర్తి స్థాయి మానసిక ఆనందాన్ని, తృప్తిని అందించలేవనేది పచ్చి నిజం. మనిషి వయసుతో పాటు ఎదిగే క్రమంలో, పరిణతి చెందే క్రమంలో కొత్త బాధలు, కొత్త నష్టాలు- బాధ్యతల వల్ల కలిగే కష్టాలు కూడా పుట్టుకొస్తుంటాయి. ఇవి ఎంత డబ్బు ఉన్నా లొంగవు, అలాగే ఎంత కీర్తి ప్రతిష్ఠలు ఉన్నా ఆ మానసిక బాధలను నిలువరించలేవు.

కుటుంబ పరమైన ఈతి బాధలు .. సమాజం నుంచి వచ్చే ఒత్తిళ్లు మనిషిని నిరంతరం వెంబడిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక స్థాయికి వచ్చాక ప్రశాంతత కోసం మనిషిలో ఆధ్యాత్మిక చింతన కూడా మొదలవుతుంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రపంచమంతా గర్వించే స్థాయికి ఎదిగినా బస్సు కండక్టర్‌గా ఆనందంగా గడిపిన ఆ ఐదేళ్ల రోజులను మించిన సంతోషం ఇంకేదీ లేదని చెప్పడానికి ఇవే ప్రధాన కారణాలు కావచ్చు. అందుకే ఆయన ఎంతో నర్మగర్భంగా ఈ జీవిత సత్యాన్ని త‌న అభిమానుల కోసం షేర్ చేసుకున్నారు.

హోదా, డబ్బు, లగ్జరీ జీవితం పెరిగినా మనసుకు నచ్చిన చిన్న చిన్న పనులు ఇచ్చే ప్రశాంతత వేరు అని రజనీకాంత్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. సినీ ఇండస్ట్రీలో తిరుగులేని రాజాధిరాజుగా వెలుగుగొందుతున్న ఒక గ్లోబల్ ఐకాన్ తన మూలాలను మర్చిపోకుండా ఇలా సాధారణ కండక్టర్ రోజులను గుర్తుచేసుకోవడం ఆయన సంస్కారానికి అద్దం పడుతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూపర్‌స్టార్ ఆలోచనా విధానం ఆయన అభిమానులకే కాకుండా ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప లైఫ్ లెసన్‌గా నిలుస్తోంది. ర‌జ‌నీకాంత్ న‌టించిన జైల‌ర్ 2 త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.