రజని - కమల్.. మళ్ళీ ఏమైంది?
ఒక్క సినిమా ఫలితం కోలీవుడ్ లో అనేక సమీకరణాలను మార్చేస్తోందనే చెప్పాలి. 46 ఏళ్ల తర్వాత రజనీకాంత్- కమల్ హాసన్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారన్న వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది
By: M Prashanth | 17 Sept 2025 2:49 PM ISTఒక్క సినిమా ఫలితం కోలీవుడ్ లో అనేక సమీకరణాలను మార్చేస్తోందనే చెప్పాలి. 46 ఏళ్ల తర్వాత రజనీకాంత్- కమల్ హాసన్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారన్న వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ భారీ ప్రాజెక్ట్ కు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారని ఇప్పటివరకూ ప్రచారం సాగింది. కానీ తాజాగా రజనీకాంత్ ఇచ్చిన సమాధానం కొత్త చర్చలకు తావిస్తోంది.
ఇటీవల ప్రెస్ మీట్ లో మీడియా ప్రశ్నలకు స్పందించిన రజని.. కమల్ తో కలిసి నటించేందుకు నేను ఎదురుచూస్తున్నాను. స్టోరీ, దర్శకుడు ఫైనల్ అవగానే అన్ని వివరాలు మీకే తెలుస్తాయి. అని చెప్పి మాట మార్చేశారు. దీంతో, ఈ మల్టీస్టారర్ కు లోకేష్ డైరెక్టర్ గా ఖరారయ్యారనేది ఉత్తి ప్రచారమే అని అర్థం చేసుకోవాల్సి వస్తోంది. అవును, నేను- కమల్ హాసన్ కలిసి నటించబోతున్నాం. జైలర్ 2 తర్వాత ఈ సినిమా స్టార్ట్ అవుతుంది.
ఈ సినిమాను రాజ్ కమల్ ఇంటర్నేషనల్, రెడ్ జైంట్ ఫిలిమ్స్ తో కలిసి రూపొందిస్తాయి. అయితే స్టోరీతోపాటు డైరెక్టర్ ఇంకా ఫైనల్ అవ్వలేదు. అది ఇంకా చర్చల దశలోనే ఉంది. అని రజనీ మీడియాతో అన్నారు. అయితే సినిమా ప్రొడక్షన్ హౌస్ లో రాజ్ కమల్ అంటే కమల్ హాసన్ స్వంత బ్యానర్ కావడంతో, మల్టీస్టారర్‌పై ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు అంటున్నారు.
అయితే ఈ భారీ ప్రాజెక్ట్ ను లోకేష్ కాకుండా మరెవరు హ్యాండిల్ చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి ఉంది. కాగా, ఇటీవల రజనీ నటించిన కూలి ఫలితం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఆ సినిమాకు స్టోరీ ఎంపికలోనే లోపం ఉందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. స్ట్రాంగ్ స్టోరీ ఉంటే లోకేష్ తన సత్తా చాటేవాడని అభిమానులు అనుకుంటున్నారు. అయినప్పటికీ.. కమల్ - రజనీ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో హ్యాండిల్ చేయగల సత్తా లోకేష్ కు మాత్రమే ఉందని కోలీవుడ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
సీనియర్లు మణిరత్నం, శంకర్ లాంటి లెజెండ్స్ ఇప్పుడు ఫామ్‌లో లేరన్నది వాస్తవం. అందుకే ఈ బాధ్యతను కొత్త తరం డైరెక్టర్లలో ఎవరికైనా అప్పగించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. లోకేష్ కాకపోతే వినోద్, కార్తిక్ సుబ్బరాజు, ఆదిక్ రవిచందర్ ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఎవరి చేతికి వెళ్లినా, ఈ ప్రాజెక్ట్ మాత్రం కోలీవుడ్ లోనే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలోనే పెద్ద ఛాలెంజ్ గా నిలవనుంది. అందుకే సినిమా అఫీషియర్ గా కన్ఫార్మ్ అయ్యేదాకా.. రకరకాల ప్రచారాలు వినిపించడం మామూలే!
