Begin typing your search above and press return to search.

విజ‌న‌రీ నిజంగా విల‌నైతే అధ్బుత‌మేనా?

దశాబ్దాల కాలం తర్వాత సూప‌ర్ స్టార్ రజనీకాంత్- విశ్వ‌న‌టుడు కమల్ హాసన్ ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడమే ఓ అద్భుతం అనుకుంటే?అందులో ఇప్పుడు మరో భారీ ట్విస్ట్ కు అవ‌కాశం క‌నిపిస్తోంది

By:  Srikanth Kontham   |   25 April 2026 12:29 PM IST
విజ‌న‌రీ నిజంగా విల‌నైతే అధ్బుత‌మేనా?
X

అసాధ్యం అనుకున్న కాంబినేషన్లు కూడా అప్పుడ‌ప్పుడు సాధ్య‌మ‌వుతుంటాయి. దశాబ్దాల కాలం తర్వాత సూప‌ర్ స్టార్ రజనీకాంత్- విశ్వ‌న‌టుడు కమల్ హాసన్ ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడమే ఓ అద్భుతం అనుకుంటే?అందులో ఇప్పుడు మరో భారీ ట్విస్ట్ కు అవ‌కాశం క‌నిపిస్తోంది. ర‌జ‌నీకాంత్ 173వ చిత్రాన్ని క‌మ‌ల్ హాస‌న్ ప‌ర‌తిష్టాత్మ‌కంగ‌తా త‌న సొంత నిర్మాణ సంస్థ రాజ్ క‌మ‌ల్ ఫిల్మ్స్ లో ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్న‌ సంగ‌తి తెలిసిందే.డైరెక్ట‌ర్ల విష‌యంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కూ త‌ర్జ‌న భ‌ర్జ‌న జ‌రిగినా? చివరిగా `డాన్` ఫేం శిబి చ‌క్ర‌వ‌ర్తే ఫైన‌ల్ అయ్యారు. ఈ నేప‌థ్యంలోనే సినిమాలో ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌పైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇప్ప‌టికే కోలీవుడ్ నుంచి ఓ పేరున్న న‌టుడు రంగంలోకి దిగుతున్నాడ‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ అత‌డు ఎవ‌రు? అన్న‌ది బ‌య‌ట‌కు రాలేదు. ఇంకా అధికారికంగానూ అత‌డే ఖ‌రారుడు అయ్యాడు? అన‌డానికి ఆధారాలు కూడా లేవు. ఈ నేప‌థ్యంలో ఏకంగా విజనరీ డైరెక్టర్ శంకర్‌ను రంగంలోకి దించుతున్నట్లు వార్తలువస్తున్నాయి. ర‌జనీకాంత్ కు `శివాజీ`, `రోబో` వంటి ఇండస్ట్రీ హిట్లను అందించిన శంక‌ర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ద‌ర్శ‌కుడిగా అత‌డు ఎలాంటి హైట్స్ కు చేరుకున్నారు? అన్న‌ది ప్ర‌స్తావించాల్సిన ప‌నిలేదు.

ఇండియ‌న్ గ్రేట్ డైరెక్ట‌ర్ గా నీరాజ‌నాలు అందుకున్న‌ లెజెండ్ ఆయ‌న‌. అయితే శంక‌ర్ కొంత కాలంగా ద‌ర్శ‌కుడిగా బ్యాడ్ ఫేజ్ లో ఉన్నారు? అన్న‌ది అంతే నిజం. ఆయ‌న తీస్తోన్న భారీ బ‌డ్జెట్ సినిమాలు అంచ‌నాలు అందు కోవ డంలో దారుణంగా వైఫ‌ల్యం చెందుతున్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ అవ్వాల్సిన ఇండియ‌న్ 2 కాలేదంటే అత‌డి ప‌రిస్థితి ఎలా ఉందో? అర్దం చేసుకోవ‌చ్చు. ఒక‌ప్పుడు స్టార్ హీరోలే అత‌డి వెంట ప‌డేవారు. శంక‌ర్ చూపు ప‌డితే చాలు అని హీరోలంతా అనుకునేవారు. కానీ నేడు స‌న్నివేశం అందుకు భిన్నంగా ఉంది.

హీరోల వైపు శంక‌ర్ రాక‌పోతే చాలు అన్న స‌న్నివేశం వ‌చ్చేసింది. ఈ నేప‌థ్యంలోనే శంక‌ర్ ర‌జ‌నీకాంత్ సినిమాతో న‌టుడిగా మ్యాక‌ప్ వేసుకోవ‌డానికి సిద్ద‌మ‌య్యాడా? అన్న చ‌ర్చ జోరుగా సాగుతోంది. శంకర్ తన సినిమాల్లో హీరోలకు ఎంతటి భారీ బ్యాక్‌డ్రాప్ ఇస్తారో? విలన్లకు కూడా అంతే వైవిధ్యమైన శైలిని ఇస్తారు. అలాంటి ఒక మైండ్ బ్లోయింగ్ క్యారెక్టర్‌ను సిబి చక్రవర్తి డిజైన్ చేయడంతో శంకర్ కూడా నటుడిగా మారడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే నిజ‌మైతే? అద్భుత‌మే. నటుడిగా రజనీకాంత్‌ను ఎదుర్కోవడం అంత సుల‌భం కాదు.కానీ ఓ డైరెక్ట‌ర్ గా శంక‌ర్ ర‌జ‌నీకాంత్ సామ‌ర్ధ్యం తెలిసిన వారు. బ్యాలెన్సింగ్ అన్న‌ది ప‌ర్పెక్ట్ గా చేయ‌గ‌ల‌రుకాబ‌ట్టి శంక‌ర్, ర‌జనీ ప‌ల్స్ ప‌ట్టుకుని ప‌నిచేయ‌గ‌ల‌రు. నిజంగా ర‌జ‌నీతో శంక‌ర్ త‌ల‌ప‌డితే అది వేరే లెవ‌ల్లోనూ ఉంటుంద‌ని గెస్సింగ్స్ వ‌స్తున్నాయి.