Begin typing your search above and press return to search.

అప్డేట్ లేకపోతేనేం? అంతా సైలెంట్ గానే!

సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేకపోతే అది ఆగిపోయినట్లేనా.. కొన్నిసార్లు బయట ఎలాంటి హడావుడి కనిపించకపోయినా లోపల పనులు జరుగుతూనే ఉంటాయి.

By:  M Prashanth   |   23 Oct 2026 10:30 AM IST
అప్డేట్ లేకపోతేనేం? అంతా సైలెంట్ గానే!
X

సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేకపోతే అది ఆగిపోయినట్లేనా.. కొన్నిసార్లు బయట ఎలాంటి హడావుడి కనిపించకపోయినా లోపల పనులు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు సూపర్‌ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కలిసి నటించనున్న భారీ మల్టీస్టారర్ ప్రాజెక్టు విషయంలోనూ ఇదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. సైలెంట్ గా వర్క్స్ జరుగుతుండడమే కాకుండా.. రిలీజ్ విండో కూడా ఫిక్స్ అయినట్లు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.

నిజానికి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లెజెండరీ నటులైన కమల్ హాసన్, రజినీకాంత్ కెరీర్ స్టార్టింగ్ లో కలిసి అనేక సినిమాల్లో నటించారు. వీరిద్దరూ కలిసి దాదాపు 21 చిత్రాల్లో అది కూడా.. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజెస్ లో స్క్రీన్‌ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు సుమారు 46-47 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ సెట్ అవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

అంతే కాదు.. చాలా కాలం తర్వాత ఇద్దరు దిగ్గజాలు ఒకే సినిమాలో కనిపించనుండటంతో మొదట్లో ఆ ప్రాజెక్టుపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ, అనౌన్స్మెంట్ తర్వాత ఎలాంటి కొత్త సమాచారం రాకపోవడంతో సినిమా పరిస్థితిపై రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ వీడియో విడుదలైంది. అప్పుట్లే ఆ వీడియో ఓ రేంజ్ లో అందరినీ మెప్పించింది.

అయితే, ఆ వీడియో విడుదలైన తర్వాత సినిమా గురించి పెద్దగా సమాచారం బయటకు రాలేదు. నార్మల్ గా ఇలాంటి భారీ సినిమాల నుంచి తరచూ ఏదో ఒక అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తుంటారు. ముఖ్యంగా ఇద్దరు సీనియర్ అండ్ స్టార్ హీరోలు కలిసి నటిస్తున్నప్పుడు సినిమా పనులు ఎక్కడి వరకు వచ్చాయనే ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ, ఆ సినిమా విషయంలో మాత్రం కొంతకాలంగా సైలెన్స్ కనిపిస్తోంది.

దీంతో సినిమా ఆగిపోయిందా, హీరోల డేట్స్ కుదరడం లేదా అనే డౌట్లు వచ్చాయి. కానీ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ మాత్రం బ్యాక్ గ్రౌండ్ లో సీరియస్ గా వర్క్స్ చేస్తున్నారట. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. నవంబర్‌ లోనే షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.. అయితే, ఆ వివరాలపై మూవీ టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.

ఇక రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ తమ తమ సినిమాలు, ఇతర వర్క్స్ తో బిజీగా ఉంటున్నారు. ఇలాంటి టైమ్ లో ఇద్దరి డేట్స్ ఒకేసారి సెట్ చేసుకోవడం, షూటింగ్ కు అవసరమైన ఏర్పాట్లు చేయడం అంత ఈజీ కాదు. అందుకే అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే షూటింగ్ స్టార్ట్ కాకపోయినా.. దానిని సినిమా ఆగిపోయిందన్నట్లుగా చూడకూడదని చెప్పాలి. అదే సమయంలో రజనీకాంత్- కమల్ హాసన్ సినిమాను 2028 సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఆ మూవీకి సరైన రిలీజ్ విండో. మరి రజనీ, కమల్ హాసన్ మూవీ నుంచి నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో.. ఏం వస్తుందో వేచి చూడాలి.