డైరెక్టర్ ఎవరైనా అతిపెద్ద బాధ్యత ఇది!
గొప్ప సినిమా చేసారని ప్రేక్షకులు మాట్లాడుకునేలా ఉండాలి. అలాంటి డైరెక్టర్ కోసమే కమల్-రజనీ ద్వయం ఎదురు చూస్తోంది.
By: Srikanth Kontham | 27 Oct 2025 11:00 PM ISTసూపర్ స్టార్ రజనీకాంత్-విశ్వనటుడు కమల్ హాసన్ దశాబ్దాల తర్వాత మల్టీస్టారర్ చిత్రానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? అన్నది ఇండస్ట్రీలో వాడి వేడిగా జరుగుతోన్న చర్చ. లోకేష్ కనగరాజ్, ప్రదీప్ రంగనాధ్, తాజాగా నెల్సన్ దిలీప్ కుమార్ పేర్లు రేసులో ఉన్నాయి. వీళ్లతో పాటు డైరెక్టర్ గా ఛాన్స్ ఎవరైనా అందుకునే అవకాశం ఉంది. కేవలం ఆ ముగ్గురు పేర్లు ప్రధానంగా హైలైట్ అవుతున్నవి మాత్రమే. రజనీ-కమల్ ద్వయానికి ఎవరు స్టోరీ చెబుతున్నారు? ఎవరు దర్శకుడిగా ఫైనల్ అవుతారు? అన్నది ఆ ద్వయం వెల్లడించే వరకూ గానీ ఎలాంటి క్లారీటీ ఉండదు.
సమాన హోదాగల నటులు:
అంత వరకూ నెట్టింట జరిగేది కేవలం ప్రచారం మాత్రమే. అయితే ఇద్దరు లెజెండ్స్ ను ఎవరు డైరెక్ట్ చేసినా? అది చిన్న బాధ్యత కాదన్నది వాస్తవం. నటులుగా ఆ లెజెండ్స్ ఇద్దరి ప్రయాణం గురించి చెప్పాల్సిన పనిలేదు. నటనలో పోటీ పడి నటించగల దిగ్గజాలు. ఎలాంటి పాత్రలైనా అవలీలగా పోషించగలరు. ఆ పాత్రలకే వన్నె తేగల నటులు. ఇక్కడ నటులుగా ఒకరు ఎక్కువా? తక్కువ? అని చెప్పడానికి లేదు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇద్దరు సమాన హోదా గల నటులు. పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ లోనే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
పరిశ్రమ వారి గురించి మాట్లాడుకునేలా:
అలాంటి నటులతో సినిమా ఛాన్స్ అంటే? ఆ దర్శకుడు నిజంగా పెట్టి పుట్టాలి. ఆ ఛాన్స్ ఎవరు అందుకున్నా వారి జన్మ ధన్యం అయినట్లే. అయితే వారిపట్లే అంతే విధేతయతో, బాధ్యతోనూ పనిచేయాల్సి ఉంటుంది. దర్శకులుగా ఎవరు బాద్యత తీసుకున్నా వాళ్ల తలకు మించిన భారమే. ఎంతో బాధ్యతతో చేయాల్సిన చిత్రమిది. కంటెంట్ సహా పాత్రలను తీర్చి దిద్దడంలో వాళ్ల గొప్పతనం కనిపించాలి. వారి స్థాయిని పెంచే సినిమా అవ్వాలి. అంతకు మించి తగ్గడానికి వీలు లేదు. ఇప్పుడున్న పోటీలో కథ, కథనాల్లో ఎంతో వైవిథ్యత ఉండాలి.
డాడీలు కోసం డాటర్స్ బరిలోకి:
గొప్ప సినిమా చేసారని ప్రేక్షకులు మాట్లాడుకునేలా ఉండాలి. అలాంటి డైరెక్టర్ కోసమే కమల్-రజనీ ద్వయం ఎదురు చూస్తోంది. ఇప్పటికే ఆ డైరెక్టర్ ఎవరు? అన్నది ఫైనల్ చేసే ఉంటుందన్నది మరో సమాచారం. ఆ పేరు రివీల్ చేయడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారని పరిశ్రమలో మాట్లాడుకుంటున్నారు. అలాగే ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించడానికి రజనీకాంత్-కమల్ హాసన్ కుమార్తెలే రంగంలోకి దిగుతున్నారన్నది మరో సమాచారం. సౌందర్య రజనీకాంత్-శ్రుతిహాసన్ నిర్మాతలుగా బరిలో ఉన్నారు? అన్నది తాజా అప్ డేట్.
