రజనీ X కమల్.. మరోసారి హారరా? ఆరుణాచాలమా?
ఇండియన్ సినిమా ఫ్యాన్స్ దశాబ్దాలుగా వెయిట్ చేస్తున్న ఒక మూమెంట్ ఇది. ఇండస్ట్రీని ఏలిన ఇద్దరు లెజెండ్స్.. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్.. మళ్లీ ఒకే సినిమా కోసం చేతులు కలిపారు.
By: M Prashanth | 9 Nov 2025 6:51 PM ISTఇండియన్ సినిమా ఫ్యాన్స్ దశాబ్దాలుగా వెయిట్ చేస్తున్న ఒక మూమెంట్ ఇది. ఇండస్ట్రీని ఏలిన ఇద్దరు లెజెండ్స్.. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్.. మళ్లీ ఒకే సినిమా కోసం చేతులు కలిపారు. అయితే, ఫ్యాన్స్ ఊహించినట్టుగా ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోవడం లేదు, దానికి మించిన ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్‌తో ఈ అనౌన్స్‌మెంట్ వచ్చింది. రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ ప్రొడ్యూసర్‌గా సినిమా రాబోతోంది.
ఈ హిస్టారిక్ కొలాబరేషన్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ, కమల్ హాసన్ ప్రొడక్షన్ బ్యానర్ 'రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్' (RKFI) ఒక స్పెషల్ వీడియోను డ్రాప్ చేసింది. "తలైవర్ 173" వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో రజనీకాంత్, కమల్ హాసన్, డైరెక్టర్ సుందర్ సి. ముగ్గురూ 'రాజ్ కమల్' ఆఫీస్‌లో చాలా హ్యాపీగా కనిపించారు.
ఈ కాంబోలో మూడో పేరు కూడా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు డైరెక్టర్ సుందర్ సి. ఫిక్స్ అయ్యారు. రజనీకాంత్, సుందర్ సి. కాంబినేషన్ అంటే ఫ్యాన్స్‌కు 'అరుణాచలం' లాంటి ఆల్-టైమ్ క్లాసిక్ ఎంటర్‌టైనర్ గుర్తొస్తుంది. సుమారు 28 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ కలుస్తుండటంతో, రజనీ మార్క్ కామెడీ టైమింగ్, స్టైల్‌ను సుందర్ సి. ఏ రేంజ్‌లో చూపిస్తాడో అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
అయితే సుందర్ ఇటీవల కాలంలో హారర్ కామెడీ కథలతోనే ఎక్కువగా క్లిక్కయ్యాడు. చంద్రకళ, కళావతి అంటూ ఒక సీరీస్ తో వరుసగా కమర్షియల్ హిట్స్ కొట్టాడు. అలాంటిది సూపర్ స్టార్ తో ఎలాంటి సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక రజినీకాంత్ చంద్రముఖి తరువాత మళ్ళీ హారర్ కథలను టచ్ చేయలేదు. కాబట్టి అలాంటి కాన్సెప్ట్ టచ్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఇక "తమిళ సినిమాకు బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి గోల్డెన్ ఎరా వరకు రెండు పిల్లర్స్‌లా నిలిచారు" అంటూ రాజ్ కమల్ ఫిల్మ్స్ వదిలిన ట్వీట్.. ఈ కాంబో రేంజ్ ఏంటో చెప్తోంది. ఒక లెజెండ్ (కమల్) తన సొంత బ్యానర్‌పై, మరో లెజెండ్ (రజనీ)తో సినిమా తీస్తుండటం ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇది ఫస్ట్ టైమ్. ఈ కలయికపై ఇద్దరు హీరోలు ఫుల్ ఎగ్జయిటింగ్‌గా ఉన్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను 2027 పొంగల్ కానుకగా రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు.
