కరోనాకి ముందే వేసిన ప్లాన్ ఇప్పుడిలా!
నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ సూపర్ స్టార్ రజనీకాంత్-విశ్వనటుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ కు రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 10 Sept 2025 8:15 AM ISTనాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ సూపర్ స్టార్ రజనీకాంత్-విశ్వనటుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ కు రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. ఇద్దరు స్టార్లు విషయాన్ని అధికారికంగా వెల్ల ప్రకటించారు. దీంతో సరిగ్గా 46 ఏళ్ల తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మరో సంచలన చిత్రంగా కనిపిస్తుంది. ఈ కాంబినేషన్ ని కలిపింది కూడా కోలీవుడ్ సంచలనం లోకేష్ కనగరాజ్ గా తెలుస్తోంది. ఆయన దర్శక త్వంలో ఇద్దరు స్టార్లు మల్టీస్టారర్ చేయబోతున్నారన్నది ఇప్పటి వరకూ ఉన్న సమాచారం.
ఒకేసారి ఇద్దరు స్టార్లకు స్టోరీ:
కానీ అసలు సంగతేంటి? అంటే వీళ్లిద్దరితో లోకేష్ సినిమా ఇప్పుడు కాదు..ఐదారేళ్ల క్రితమే చేయాల్సిం దన్నది తాజా సమాచారం. సరిగ్గా కరోనాకి ముందు ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా అప్పుడే ప్లాన్ చేసా రుట. ఇద్దర్నీ ఒకే వేదికపై కి తీసుకొచ్చి పక్క పక్కనే కూర్చోబెట్టి లోకేష్ స్టోరీ నేరేట్ చేసాడని ఎంత మందికి తెలుసు? అవును దీనికి సంబంధించి కోలీవుడ్ మీడియాలో ఓ వార్త వైరల్ అవ్వడంతో విషయం బయటకు వచ్చింది. కమల్ , రజనీకాంత్ లకు కరోనాకి ముందే ఓ గ్యాంగ్ స్టర్ స్టోరీ చెప్పాడు.
కమల్ సూచనతో వెనక్కి:
నచ్చడంతో ఇద్దరు అంగీకరించారు. కానీ కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో తాత్కాలికంగా ఆ ప్రాజెక్ట్ ను వాయిదా వేసారు. అటుపై వివిధ వేరియేంట్ల రూపంలో కరోనా రూపం దాల్చడంతో ఇది సరైన సమ యం కాదని కమల్ సజ్జెస్ట్ చేయడంతో లోకేష్ ఆగిపోయినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. ఈ చిత్రం షూటిం గ్ కూడా కేవలం స్వదేశానికే పరిమితం కాకుండా అంతర్జాతీయంగా వివిధ లోకేషన్లలోనూ చేయాల్సి ఉందని సదరు కథనం పేర్కొంది. చైనా, రష్యా, జపాన్ లాంటి దేశాల్లోనూ కొంత భాగం చిత్రీకరణ చేయాల్సి ఉందిట.
గ్లోబల్ స్థాయిలో ప్లానింగ్:
ఇదే ప్రధాన కారణంగా ప్రాజెక్ట్ ను వాయిదా వేసినట్లు కథనంలో పేర్కొన్నారు. ఇదే నిజమైతే? లోకేష్ ఈ చిత్రాన్ని ఏకంగా గ్లోబల్ స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నట్లే. రజనీకాంత్ , కమల్ హాసన్ సినిమాలంటే? అంతర్జా తీయంగా మార్కెట్ కు అవకాశం ఉంటుంది. చైనా, జసాన్ లో సూపర్ స్టార్ పేరిట ప్రత్యేకమైన బాక్సాఫీస్ రికార్డులే ఉన్నాయి. `విశ్వరూపం` సినిమాతో కమల్ హాసన్ మార్కెట్ ఫరిది కూడా విస్తరించింది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే లోకేష్ ఈ రేంజ్ లో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారన్నది తాజా సమాచారంగా కనిపస్తోంది.
