'జైలర్ 2' లో స్టార్ హీరో వారసుడా?
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా `జైలర్ 2` తెరకెక్కెతోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 3 Oct 2025 6:00 AM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా `జైలర్ 2` తెరకెక్కెతోన్న సంగతి తెలిసిందే. మొదటి భాగంలో నటించిన స్టార్ నటులంతా యధావిధిగా తమ పాత్రల్లో కొనసాగుతున్నారు. మోహన్ లాల్ , శివరాజ్ కుమార్ తో పాటు అదనంగా బాలయ్య, ఎస్. జె సూర్య, మిథున్ చక్రవర్తి లాంటి నటులు యాడ్ అవుతున్నారు. దీంతో సినిమాపై అంచనాలు అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి. జైలర్ అంటే మార్కెట్ లో ఓ వైబ్ క్రియేట్ అవుతుంది.
తొలి భాగం 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో `జైలర్ 2` కోలీవుడ్ 1000 కోట్ల క్లబ్ లో చేరుతోంది అన్న అంచనాలు బలంగా ఉన్నాయి. తాజాగా ఆ అంచనాలు సంచలనాలు అయ్యే దిశగా ఏకంగా ఓ స్టార్ హీరో వారసుడినే తెరంగేట్రం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ మనవడు, ధనుష్ చిన్న కుమారుడు లింగ మ్యాకప్ వేసుకుంటున్నాడుట. సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించనున్నాడుట. సినిమాలో ఓ గుడికి సంబంధించిన సన్నివేశంలో లింగ్ కనిపిస్తాడని కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
లింగ ఎంట్రీ విషయంలో రజనీకాంత్.. ధనుష్ తో మాట్లాడి ఒప్పించినట్లు వినిపిస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తేలాలి. ఇటీవల సోషల్ మీడియాలో లింగ వీడియో, ఫోటోలు నెట్టింట వైరల్ అయిన నేపథ్యంలో విషయం వెలుగులోకి రావడం ఇంట్రెస్టింగ్. ధనుష్ గొప్ప శివభక్తుడు. షూటింగ్ నుంచి విరామం దొరికితే శైవ క్షేత్రాలు చుట్టేస్తుంటాడు. అరుణాచలం, చిదంబరం వంటి ఆలయాలకు నిత్యం వెళ్తుంటాడు. చాలా సార్లు గిరిప్రదక్షణ కూడా చేశాడు.
తాను నటించిన సినిమా రిలీజ్ కు ముందు సొంతూరులోని (తేనీ జిల్లా – మల్లింగాపురం) ఉన్న కస్తూరీ మంగమ్మ ఆలయానికి వెళ్లడం అనవాయితీ. అక్కడ ప్రత్యేక పూజలు చేస్తాడు. ఇలా నిత్యం శివయ్య సేవలో ఉండటానికి ఇష్ట పడతాడు. ఈ నేపథ్యంలో చిన్న కుమారుడికి లింగ అని పేరు పెట్టాడు. మరి `జైలర్ 2` కథకి- శివయ్యకి ఏదైనా సంబంధం ఉందా? అన్నది తెలియాలి. ఎందుకంటే లింగ కనిపించేది టెంపుల్ సన్నివేశం అంటోన్న నేపథ్యంలో నెట్టింట డౌట్ రెయిజ్ అవుతోంది.
