Begin typing your search above and press return to search.

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

‘జైలర్’, ‘జైలర్ 2’ విజయాలతో క్రేజ్ పెంచుకున్న ఈ ఫ్రాంచైజ్ మూడో భాగం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ‘జైలర్ 3’ షూటింగ్ 2028 చివర్లో లేదా 2029లో ప్రారంభమయ్యే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. స్క్రిప్ట్‌ను పక్కాగా సిద్ధం చేసేందుకు నెల్సన్ మరింత సమయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఈసారి బడ్జెట్, క్యాస్టింగ్ విషయంలో సన్ పిక్చర్స్ ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు టాక్. రజినీకాంత్-కమల్ హాసన్ మల్టీస్టారర్, ఎన్టీఆర్‌తో చేయనున్నట్లు ప్రచారంలో ఉన్న సినిమా పూర్తయ్యాకే నెల్సన్ ‘జైలర్ 3’పై దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది.

By:  Srikanth Kontham   |   5 Nov 2026 3:31 PM IST
జైల‌ర్ 3పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?
X

సూపర్ స్టార్ రజినీకాంత్ - డాషింగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్ద‌రి కలయికలో తెర‌కెక్కిన‌ `జైలర్` బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి రజినీ కెరీర్‌కు ఊహించని బూస్ట్ అందించగా.. ఇటీవల విడుదలైన `జైల‌ర్2` కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో సంచలనం సృష్టించింది. ఈ గ్రాండ్ సక్సెస్‌తో ఫ్రాంచైజ్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ `జైలర్ 3`పై దృష్టి సారించడంతో నెట్టింట ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.

అయితే అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న `జైలర్ 3` సెట్స్ పైకి వెళ్లడానికి ఎక్కువ సమయమే పట్టేలా కనిపిస్తోంది. ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ 2028లో ప్రారంభమవుతుందనే ప్రచారం సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. సుదీర్ఘ సమయం తీసుకుని ఫ్రాంచైజ్ స్థాయిని మరింత పెంచేలా నెల్సన్ పక్కా ప్లానింగ్‌తో అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఈ కథకు సంబంధించి ఓ ఆసక్తికరమైన లైన్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

సాధారణంగా నెల్సన్ సినిమాల విషయంలో ఏమాత్రం తొందరపడరు. స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్ పనులకు తగినంత సమయం కేటాయించడం అలవాటు. పూర్తిస్థాయి స్క్రిప్ట్‌ను పర్‌ఫెక్ట్‌గా సిద్ధం చేయడానికి మరి కొన్ని నెలల సమయం వెచ్చించనున్నారు. ప్రతీ సన్నివేశం ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించేలా స్క్రీన్‌ప్లేను డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది.

`జైలర్ 3` విషయంలో నిర్మాతలు నెల్సన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. `జైలర్ 2` మేకింగ్ సమయంలో భారీ రెమ్యునరేషన్ ఇచ్చినా? బడ్జెట్ విషయంలో కొన్ని హద్దులు విధించిన నిర్మాతలు ఇప్పుడు మూడో భాగానికి మాత్రం పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా బడ్జెట్, క్యాస్టింగ్, నటీనటుల రెమ్యునరేషన్ల విషయంలో ఎలాంటి నిబంధనలు లేకుండా విజన్ తగ్గట్టుగా భారీ ఎత్తున తెరకెక్కించుకోవచ్చని సన్ పిక్చర్స్ సపోర్ట్ ఇచ్చింది.

మరోవైపు నెల్సన్ తదుపరి ప్రాజెక్ట్‌లతో బిజీగా అవుతున్నారు. రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినే షన్‌లో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రానికి దర్శకత్వం వ‌హించ‌నున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం చిత్రీకరణ వచ్చే ఏడాది మొదలుకానుంది. అలాగే టాలీవుడ్ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లీడ్ రోల్‌లో ఓ పాన్-ఇండియా మూవీ చేయడానికి కూడా నెల్సన్ కమిట్ అయిన‌ట్లు ప్ర‌చారంలో ఉంది. ఈ భారీ ప్రాజెక్ట్‌లన్నింటినీ పూర్తి చేసిన తర్వాతే నెల్సన్ `జైలర్ 3` పనిలో పడనున్నారు. అందుకే ఈ సిరీస్ మూడో భాగం 2028 చివ‌ర్లో గానీ.. మ‌రుస‌టి ఏడాది మాత్రమే పట్టాలెక్కే అవకాశముంది.