Begin typing your search above and press return to search.

తెలుగులో 5వ చిత్రంగా రికార్డ్‌ల్లో 'జైలర్‌ 2'

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ మరోసారి తన స్టామినాను జైలర్‌ 2 తో చూపించాడు. ప్రపంచ వ్యాప్తంగా జైలర్‌ 2 సినిమా మొదటి పది రోజుల్లో దాదాపుగా రూ.675 కోట్లకు మించి రాబట్టినట్లు బాక్సాఫీస్ రిపోర్ట్‌లు వస్తున్నాయి.

By:  Ramesh Palla   |   25 Oct 2026 4:07 PM IST
తెలుగులో 5వ చిత్రంగా రికార్డ్‌ల్లో జైలర్‌ 2
X

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ మరోసారి తన స్టామినాను జైలర్‌ 2 తో చూపించాడు. ప్రపంచ వ్యాప్తంగా జైలర్‌ 2 సినిమా మొదటి పది రోజుల్లో దాదాపుగా రూ.675 కోట్లకు మించి రాబట్టినట్లు బాక్సాఫీస్ రిపోర్ట్‌లు వస్తున్నాయి. తమిళ్‌లో రూపొందిన జైలర్‌ 2 సినిమాను తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. భారీ అంచనాలు పెట్టుకున్న హిందీ వర్షన్ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. వంద కోట్ల టార్గెట్‌తో హిందీలో విడుదలైన జైలర్‌ 2 దాదాపుగా రూ.40 కోట్ల వద్ద ఆగినట్లు తెలుస్తోంది. కన్నడంలో కూడా జైలర్ 2 కి ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు కాలేదు. కనీసం రూ.10 కోట్ల మార్క్‌ క్రాస్‌ చేసేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ జైలర్‌ 2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్‌ బ్రేకింగ్‌ వసూళ్లు సాధించి దూసుకు పోతుంది. విడుదలైన 10 రోజుల్లోనే సినిమా ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

కేజీఎఫ్‌, కాంతార చాప్టర్‌ 1 సినిమాలతో....

తెలుగు ప్రేక్షకులు తమిళ డబ్బింగ్‌ సినిమాలను ఆధరించడం మనం కామన్‌గానే చూస్తూ ఉంటాం. అయితే వంద కోట్లు, అంతకు మించి వసూళ్లు ఇవ్వడం మాత్రం చాలా అరుదుగా జరిగింది. ఇప్పటి వరకు తమిళ్‌ సినిమాలు తెలుగులో డబ్‌ అయ్యి వంద కోట్లు, అంతకు మించి వసూళ్లు సాధించిన దాఖలాలు లేవు. కానీ కన్నడ సినిమాలు కేజీఎఫ్‌ 2, కాంతార సినిమాలు వంద కోట్లకు మించి వసూళ్లు సాధించాయి. కేజీఎఫ్‌ 2 తెలుగు వర్షన్‌ ప్రపంచ వ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా రాబట్టింది. ఇక కాంతార చాప్టర్‌ 1 సినిమా తెలుగు వర్షన్‌ రూ.110 కోట్లకు మించి రాబట్టింది. ఇవే కాకుండా అవతార్‌ : ది వే ఆఫ్‌ వాటర్‌ తెలుగు వర్షన్‌ సైతం వంద కోట్లకు మించి రాబట్టింది. బాక్సాఫీస్ రిపోర్ట్‌ ప్రకారం అవతార్ 2 సినిమా రూ.115 కోట్లు రాబట్టింది. ఇక హిందీ సినిమా ధురంధర్‌ 2 తెలుగు వర్షన్‌ ప్రపంచ వ్యాప్తంగా రూ.105 కోట్లు రాబట్టింది.

జైలర్‌ 2 సినిమా బాక్సాఫీస్‌ రిపోర్ట్‌...

ఇప్పటి వరకు ఇతర భాషలకు చెందిన సినిమాలు డబ్బింగ్‌ చేసుకుని తెలుగు బాక్సాఫీస్ వద్ద, తెలుగు వర్షన్‌తో వరల్డ్‌ బాక్సాఫీస్‌ వద్ద వంద కోట్లు, అంతకు మించి సాధించిన సినిమాలు ఈ నాలుగు మాత్రమే. ఇందులో ఇప్పటి వరకు తమిళ్‌ సినిమాలే లేవు. ఇప్పుడు ఆ లోటు భర్తీ అయింది. రెండు కన్నడ సినిమాల సరసన ఇప్పుడు తమిళ్‌ మూవీ జైలర్‌ 2 నిలవబోతుంది. గతంలో వచ్చిన జైలర్‌ సినిమా దాదాపుగా రూ.85 కోట్లు వసూళ్లు సాధించింది. వంద కోట్లకు కొద్ది తేడాతో నిలిచింది. ఇప్పుడు జైలర్‌ 2 తో రజనీకాంత్‌ ఆ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. తెలుగు ప్రేక్షకులు కంటెంట్‌ నచ్చితే భాష ఏదైనా పర్వాలేదు అన్నట్లుగా చూస్తారు. అయితే ఈ అయిదు సినిమాలను మాత్రం ఇంకాస్త ఎక్కువ చూశారు. అందుకే ఈ అయిదు సినిమాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు, అంతకు మించి రాబట్టాయి.

టాలీవుడ్‌ సినిమాలతో పోల్చితే...

జైలర్‌ 2 సినిమా తెలుగు వర్షన్‌ వరల్డ్‌ బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్‌ పూర్తి చేసుకునే వరకు రూ.125 కోట్లు చేరే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీకెండ్‌ మొత్తం జైలర్‌ 2 హంగామా నడుస్తోంది. రెండో వారంలో కూడా జైలర్ 2 కి పోటీ లేదు. కారణం ఏంటంటే తెలుగులో పెద్దగా సినిమాలు విడుదల కాలేదు. అంతకు ముందు విడుదలైన రణబాలి సినిమా క్రేజ్ కూడా తగ్గుతూ వచ్చింది. దాంతో జైలర్‌ 2 వసూళ్లు తగ్గక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జైలర్‌ 2 కనుక రూ.125 కోట్ల మార్క్‌ ను చేరుకోగలిగితే కేజీఎఫ్‌ 2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటి వరకు వంద కోట్లు, అంతకు మించి వసూళ్లు సాధించిన తెలుగు డబ్బింగ్ సినిమాలన్నీ కూడా పార్ట్‌ 2 లు కావడం విశేషం. మొదటి పార్ట్ హిట్‌తో వచ్చిన బజ్‌తో తెలుగు రాష్ట్రాల్లో రెండో పార్ట్‌కి బ్రహ్మరథం పట్టి వంద కోట్లు, అంతకు మించి కట్టబెట్టారు. వంద కోట్లు సాధించిన డబ్బింగ్‌ సినిమాల జాబితాలో నెం.5గా జైలర్‌ 2 నిలిచింది. మరి నెం.6 స్థానంను ఏ డబ్బింగ్‌ సినిమా దక్కించుకుంటుంది అనేది చూడాలి.