Begin typing your search above and press return to search.

పుకార్లే పుకార్లు... సూపర్‌ స్టార్ ఫ్యాన్స్‌ ఆందోళన

సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'జైలర్‌ 2' సినిమా వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది.

By:  Ramesh Palla   |   13 May 2026 11:59 AM IST
పుకార్లే పుకార్లు... సూపర్‌ స్టార్ ఫ్యాన్స్‌ ఆందోళన
X

సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'జైలర్‌ 2' సినిమా వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది ఆరంభంలోనే సినిమా విడుదల చేయాలని భావించారు. కానీ ఇప్పటి వరకు షూటింగ్‌ పూర్తి కాలేదు. 2026 సమ్మర్‌ ఆరంభంలో సినిమా విడుదల చేస్తామని దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అది సాధ్యం కాలేదు, దాంతో జూన్‌ 2026 కి వాయిదా పడింది. తాజా పరిణామాలు చూస్తుంటే సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2026 జూన్‌ కి జైలర్ 2 విడుదల అసాధ్యం అని తేలిపోయింది. ఇప్పటికే సినిమా షూటింగ్‌ చాలా పెండింగ్‌ ఉంది, అంతే కాకుండా ఇప్పటికే షూట్‌ చేసిన కొన్ని సీన్స్‌ విషయంలో మేకర్స్ అసంతృప్తితో ఉన్నారట. ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్‌ విషయంలో రజనీకాంత్‌ నిరుత్సాహంగా ఉన్నాడనే పుకార్లు వినిపిస్తున్నాయి.

జైలర్‌ 2 సినిమా విడుదల తేదీ...

జైలర్‌ సినిమా బ్లాక్‌ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో దర్శకుడు నెల్సన్ దిలీప్ పై నమ్మకంతో రజనీకాంత్‌ పూర్తి స్థాయిలో స్క్రిప్ట్‌ సైతం చూడకుండానే కమిట్‌ అయ్యాడట. షూటింగ్‌ సైతం కొంత మేరకు పూర్తి అయిన తర్వాత రజనీకాంత్‌కి కాస్త తేడా అనిపించడంతో స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు మొదలు పెట్టారని తెలుస్తోంది. ఇప్పటికే తీసిన సీన్స్‌ ను సైతం మార్చే అవకాశాలు ఉన్నాయి. కొంత ఫుటేజ్ ను పూర్తిగా డంప్‌ చేయాల్సిందే అని కూడా ప్రచారం జరుగుతోంది. అదే కనుక నిజం అయితే షూటింగ్‌ డేస్ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో రజనీకాంత్‌ సినిమాలు వరుసగా నిరాశ పరుస్తూ వస్తున్నాయి. అందుకే ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జైలర్‌ కి ఏమాత్రం తగ్గకుండా జైలర్‌ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించాలనే లక్ష్యంతో రజనీకాంత్ ఆచితూచి వ్యవహరిస్తున్నారట.

రజనీకాంత్‌, నెల్సన్ దిలీప్‌...

ఒక వైపు జైలర్‌ 2 షూటింగ్‌ బ్యాలన్స్‌ ఉండగానే రజనీకాంత్‌ భారీ మల్టీస్టారర్‌ సినిమాను చేసేందుకు రెడీ అవుతున్న విషయం తెల్సిందే. యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌తో రజనీకాంత్‌ నటించబోతున్నాడు. అందుకు సంబంధించిన చర్చలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఈ సినిమాకు నెల్సన్‌ దిలీప్ దర్శకత్వం వహించబోతున్నాడు. జైలర్ 2 ఇంకా పూర్తి కాకుండానే ఈ మల్టీస్టారర్‌ సినిమాకు నెల్సన్‌ దిలీప్ ను ఎలా తీసుకున్నారు అనే చర్చలు సైతం కోలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో తమిళనాట ఈ మల్టీస్టారర్ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. సుదీర్ఘ కాలం తర్వాత రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో దేశ వ్యాప్తంగా కూడా బజ్‌ క్రియేట్‌ అయ్యే అవకాశం ఉంది. అందుకు ఏమాత్రం తగ్గకుండా నెల్సన్‌ దిలీప్‌ మల్టీస్టారర్‌ ను రూపొందిస్తాడా అనేది చూడాలి.

కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌ మల్టీస్టారర్ మూవీ...

ఇప్పటికే జైలర్‌ 2 విషయంలో రజనీకాంత్‌ ఫ్యాన్స్ ఆందోళనతో ఉన్నారు. షూటింగ్‌ ఆలస్యం అవుతోంది, కొంత ఫుటేజ్‌ను పూర్తిగా తీసి వేయాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. పైగా స్క్రిప్ట్‌ లో మార్పులు అవసరం అంటున్నారు. ఇలాంటి సమయంలో జైలర్ 2 సినిమా విడుదల కావాలంటే కనీసం ఆరు నెలల సమయం అవసరం అవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంటే 2026 చివరికి సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వరుస వాయిదాల కారణంగా ఇప్పటికే ఫ్యాన్స్ ఆందోళనతో ఉన్నారు. ఇప్పుడు రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ మల్టీస్టారర్ బాధ్యతను నెల్సన్ దిలీప్‌ కి అప్పగించడంతో ఫ్యాన్స్‌ లో మరింతగా కలవర పాటు కనిపిస్తోంది. దర్శకుడు జైలర్‌ 2 తో తన సత్తా చాటి అప్పుడు మల్టీస్టారర్‌ ను మొదలు పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. జైలర్‌ 2 ఫలితం తేలిన తర్వాత రజనీ, కమల్‌ మల్టీస్టారర్ మూవీ పట్టాలెక్కాలని, అప్పుడు దర్శకుడి విషయమై తుది నిర్ణయం తీసుకోవాలని కొందరు అభిమానులు కోరుకుంటున్నారు. మొత్తానికి సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ లో ఆందోళన క్లీయర్‌గా కనిపిస్తోంది.