కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!
సూపర్‌స్టార్ రజినీకాంత్ వయస్సు అనేది కేవలం నెంబర్ మాత్రమే. అదే నెంబర్ తో బాక్సాఫీస్ వద్ద మరో అపూర్వ ఘనతను సాధించారు.
By: Srikanth Kontham | 2 Nov 2026 3:22 PM ISTసూపర్‌స్టార్ రజినీకాంత్ వయస్సు అనేది కేవలం నెంబర్ మాత్రమే. అదే నెంబర్ తో బాక్సాఫీస్ వద్ద మరో అపూర్వ ఘనతను సాధించారు. 75 ఏళ్ల వయసులోనూ సూపర్ స్టార్ బాక్సాఫీస్ స్టామినా కోలీవుడ్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ చేరుకోని ఓ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన `జైలర్ 2` ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను రాబడుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా సినిమా 800 కోట్ల గ్రాస్ మార్క్‌ను అధిగమించింది. ఇది తమిళ సినిమా చరిత్రలోనే తొలి 800 కోట్ల బ్లాక్ బస్టర్‌గా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది.
ఈ సినిమా సాధించిన రేర్ ఫీట్ వెనుక ఎంతో కష్టం, ప్రణాళిక ఉన్నాయి. నవరాత్రి .. దసరా సెలవుల సీజన్‌ను పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకున్న చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లోనే ఏకంగా 400 కోట్ల వసూళ్లతో కోలీవుడ్ చరిత్రలో అతిపెద్ద ఓపెనింగ్స్‌లో ఒకటిగా నిలిచింది. మొదటి వారం తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద దూకుడు తగ్గకుండా నిలకడైన వసూళ్లను సాధించింది. ముఖ్యంగా మూడో వారంలోనూ వీకెండ్స్‌లో అద్భుతమైన కలెక్షన్లతో ట్రెండ్ సృష్టించింది.
భారతీయ మార్కెట్లో 'జైలర్ 2' తమిళనాడుకే పరిమితం కాలేదు. అన్ని చోట్లా అసాధారణ విజయాన్ని నమోదు చేసింది. కేరళ, కర్ణాటక , ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి ప్రాంతంలోనూ 60 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఏకైక తమిళ చిత్రంగా రికార్డు కెక్కింది. దేశీయంగా నికర వసూళ్లు 450 కోట్లను దాటడంతో ఇండియా వైడ్‌గా ఈ రేంజ్‌లో కలెక్ట్ చేసిన తొలి కోలీవుడ్ సినిమాగా నిలిచింది. ఓవర్సీస్‌లోనూ రజినీకాంత్ ఉన్న క్రేజ్ కారణంగా మిడిల్ ఈస్ట్, ఉత్తర అమెరికా , ఆగ్నేయాసియా దేశాల్లో 29 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది.
ఈ భారీ వసూళ్ల జోరుతో `జైలర్ 2` బాలీవుడ్ ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్స్ అయిన అమీర్ ఖాన్ 'పీకే' ( 769 కోట్లు), విక్కీ కౌశల్ 'ఛావాస' ( 807 కోట్ల) లైఫ్‌టైమ్ వసూళ్లను సైతం వెనక్కి నెట్టడం విశేషం. ఈ సినిమాలో టైగర్ ముత్తువెల్ పాండియన్ పాత్రలో రజినీకాంత్ అప్పీల్.. నెల్సన్ టేకింగ్ ప్రేక్షకులను మరోసారి థియేటర్లకు క్యూ కట్టేలా చేశాయి. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, మిథున్ చక్రవర్తి వంటి నటులతో పాటు హృతిక్ రోషన్, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ చేసిన హై-ప్రొఫైల్ అతిథి పాత్రలు సినిమా స్థాయిని మరింత పెంచాయి.
త్వరలో విడుదల కానున్న ఇతర భారీ చిత్రాల విడుదల కారణంగా జైలర్ 2 కలెక్షన్లపై కొంత ప్రభావం పడే అవకాశం ఉన్నా? ఇప్పటివరకు సాధించిన రికార్డులు మాత్రం చారిత్రాత్మకమైనవి. సీక్వెల్‌గా వచ్చి అంచనాలను తలకిం దులు చేస్తూ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం రజినీకాంత్ తో మాత్రమే చెల్లుతుందని మరోసారి ప్రూవ్ అయింది. అయితే 1000 కోట్ల క్లబ్లో జైలర్ 2 చేరుతుందా? చేరదా? అన్నదే ఆసక్తికరంగా మారింది.
