జైలర్ 2 ఫస్ట్ సింగిల్ కి ముహూర్తం ఫిక్స్.. మాస్ జాతరే!
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లతో పోల్చుకుంటే హీరోలకు లైఫ్ టైం చాలా ఎక్కువ. అందులో భాగంగానే హీరోలు తమ సినిమాలతో వరుస ఫ్లాప్ లు చవిచూసిన ఏదో ఒక సినిమా పడితే మాత్రం గట్టి కంబ్యాక్ ఇస్తారు.
By: Madhu Reddy | 19 Aug 2026 9:59 AM ISTసాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లతో పోల్చుకుంటే హీరోలకు లైఫ్ టైం చాలా ఎక్కువ. అందులో భాగంగానే హీరోలు తమ సినిమాలతో వరుస ఫ్లాప్ లు చవిచూసిన ఏదో ఒక సినిమా పడితే మాత్రం గట్టి కంబ్యాక్ ఇస్తారు. అయితే అలా కం బ్యాక్ ఇచ్చేవరకు హీరోలు కూడా నిందలు మోయక తప్పదు. ఒక హీరో వరుసగా ఫ్లాప్ లు చవి చూశారు అంటే.. ఇక ఆ హీరో పనైపోయింది.. బుట్ట సర్దే టైం వచ్చేసింది అని కొంతమంది అంటే.. మరి కొంతమంది రిటైర్మెంట్ తీసుకోవాల్సింది.. ఇంకా ఎందుకు సినిమాల్లో చేస్తున్నారు అని అనే యాంటీ ఫ్యాన్స్ కూడా లేకపోలేదు. అలాంటి ఎన్నో విమర్శల నుంచి తనను తాను నిరూపించుకుంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు రజినీకాంత్.
ఒకప్పుడు అద్భుతమైన చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలతో సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న ఈయన గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బందులు పడ్డారు. కానీ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా చేసి మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు రజినీకాంత్. అప్పటినుంచి ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటూ దూసుకుపోతోంది. ఇకపోతే ఆయన కెరీర్ను మళ్ళీ నిలబెట్టిన జైలర్ సినిమా సీక్వెల్ ఇప్పుడు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే .ఒకవైపు షూటింగు వేగంగా జరుగుతుండగా మరొకవైపు చిత్ర బృందం సినిమా అప్డేట్స్ వదులుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా జైలర్ 2 నుంచి మేకర్స్ ఒక అదిరిపోయే అప్డేట్ విడుదల చేశారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ ను తాజాగా పంచుకుంది. ఆగస్టు 21వ తేదీన ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఈ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్ బ్యానర్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ రజినీకాంత్ లేటెస్ట్ పిక్ ని పంచుకుంది.
రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై అభిమానులలో విపరీతమైన క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. మొదటి భాగం మ్యూజిక్ తో ఏ విధంగా థియేటర్లను షేక్ చేసిందో.. ఇప్పుడు ఈ సీక్వెల్ మూవీతో అంతకుమించి మ్యూజిక్ అందించడానికి అనిరుద్ సిద్ధమయ్యారు. మరోవైపు ఈ సినిమాను అక్టోబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో చాలా గ్రాండ్గా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు రాబోయే ఫస్ట్ సింగిల్ యూట్యూబ్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం ఖాయమని , మాస్ జాతరకి సిద్ధం అవ్వాలి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ తో పాటు మొదటి భాగంలో నటించిన చాలామంది ఇందులో కొనసాగుతున్నారు. అలాగే విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నిర్మల్ ఎడిటింగ్ బాధ్యతలను తీసుకున్నారు. దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
