Begin typing your search above and press return to search.

10ని.ల ఎంట్రీతో క‌మ‌ల్‌హాస‌న్‌కే షాకిచ్చాడు!

త‌మిళ సినీప‌రిశ్ర‌మ‌లో ద‌శాబ్ధ కాలంలోనే అసాధార‌ణ స్టార్ డ‌మ్ ని అందుకున్న మేటి స్టార్ గా ఎదిగాడు ర‌జ‌నీకాంత్.

By:  Sivaji Kontham   |   18 Dec 2025 10:12 AM IST
10ని.ల ఎంట్రీతో క‌మ‌ల్‌హాస‌న్‌కే షాకిచ్చాడు!
X

కోలీవుడ్ ని ఎంద‌రో దిగ్గ‌జ హీరోలు ఏలారు. లెజెండ‌రీ న‌టులు త‌మ ఉనికిని చాటుకోవ‌డ‌మే గాక స్టార్ డ‌మ్ ని పీక్స్‌లో ఆవిష్క‌రించారు. అయితే ఆ త‌ర్వాతి కాలంలో క‌మ‌ల్ హాస‌న్ లాంటి లెజెండ్ న‌టించిన సినిమాలో కేవ‌లం 10 ని.ల పాటు క‌నిపించే స‌హాయ‌క‌పాత్ర‌తో దూసుకొచ్చింది ఒక మెరుపు. ఆ మెరుపు క‌నిపిస్తే చాలు అయ‌స్కాంత ఆక‌ర్ష‌ణ దానంత‌ట అదే కెమెరా లెన్స్ ను లాగేసేది. అంత‌గా ప్ర‌భావితం చేసేవాడు అత‌డు. అనూహ్యంగా వెండితెర‌పైకి దూసుకొచ్చిన ఈ స్టార్ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. అత‌డు ద‌శాబ్ధాలుగా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ఒక వ‌ట‌వృక్షంలా ఎదిగాడు. అత‌డు మ‌రెవ‌రో కాదు.. ది గ్రేట్ శివాజీ రావ్ గైక్వాడ్ అలియాస్ ర‌జ‌నీకాంత్.

అయితే ర‌జ‌నీ.. కమల్ హాసన్ పక్కన పది నిమిషాల పాటు తెరపై కనిపించిన ఆ సినిమా ఏది? అంటే....1975లో వచ్చిన `అపూర్వ రాగంగల్`. ఆ సినిమా సెట్‌లోకి అప్పటికి తెలియని కొత్త వ్యక్తిగా అడుగుపెట్టినప్పుడు శివాజీరావ్ గైక్వాడ్‌ని చరిత్ర గుర్తుంచుకుంటుందని ఎవరూ ఊహించలేదు. ఆయనకు కేవలం పది నిమిషాల స్క్రీన్ టైమ్ లోనే చాలా మ్యాజిక్ చేసాడు. ఓ వైపు యంగ్ ట్యాలెంటెడ్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ పోటీలో ఉన్నా కానీ, లెన్స్ అత‌డి వైపే మొగ్గు చూపింది.

త‌మిళ సినీప‌రిశ్ర‌మ‌లో ద‌శాబ్ధ కాలంలోనే అసాధార‌ణ స్టార్ డ‌మ్ ని అందుకున్న మేటి స్టార్ గా ఎదిగాడు ర‌జ‌నీకాంత్. ఆయ‌న కెరీర్ లో సాధించిన అపూర్వ విజ‌యాలు అన్నీ ఇన్నీ కావు. ఆయన సాధించ‌లేని ఎత్తు లేదు. అత‌డి మాస్ స్టార్ డ‌మ్ కి ఎదురే లేదు. అయితే అతడు ఎంత సాధించినా ఇప్ప‌టికీ త‌న తొలి చిత్ర క‌థానాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ తో స్నేహాన్ని మాత్రం విడువ‌లేదు. ఆ ఇద్ద‌రి స్నేహం ఎంద‌రికో స్ఫూర్తి. ఆ ఇద్ద‌రి ఎదుగుద‌ల కాలంతో పాటే పోరాటం అంద‌రికీ గొప్ప ఆద‌ర్శం. అంతేకాదు క‌మ‌ల్ హాస‌న్ ఆధిప‌త్యం సాధిస్తాడ‌నుకున్న ప‌రిశ్ర‌మ‌లో ర‌జ‌నీకాంత్ అనూహ్యంగా ఎదిగిన ఆశాకిర‌ణం అయ్యాడు.

12 డిసెంబర్ 1950న శివాజీ రావు గైక్వాడ్ జన్మించాడు. అత‌డు సినిమాల్లోకి వ‌చ్చాక‌ రజనీకాంత్ గా మారాడు. బస్సు కండక్టర్ గా ఉద్యోగం చేసే రోజుల్లోనే అత‌డిలోని న‌ట‌న బ‌య‌ట‌పడింది. స్టేజీ డ్రామాల్లో ఆద‌ర‌గొట్టి నేరుగా వెండితెర ఆరంగేట్రం చేసారు ర‌జ‌నీ. మూండ్రు ముడిచ్చు , నేట్రిక్కన్ చిత్రాలలో అతను ఒకే ఫ్రేమ్‌లో విల‌నీని ప్ర‌ద‌ర్శిస్తూనే, వైవిధ్యాన్ని చూపించాడు. తలైవర్ అని ఆప్యాయంగా పిలువబడే ఆయన 170 కి పైగా చిత్రాలలో నటించారు. తమిళ సినిమాను మాత్రమే కాకుండా ప్రజాదరణ పొందిన సంస్కృతిని కూడా తీర్చిదిద్దిన గొప్ప న‌టుడిగా వెలిగిపోతున్నారు.

ముత్తుతో జపనీస్ ప్రేక్షకులలో గొప్ప అభిమానం సంపాదించుకున్న ర‌జ‌నీకాంత్ ... నల్లవనుక్కు నల్లవన్ .. మూండ్రు ముగంతో యాంటీ హీరోయిజాన్ని రీడిఫైన్ చేసారు. పెద‌రాయుడు చిత్రంలో ర‌జ‌నీకాంత్ అతిథి పాత్ర స‌హా ఆయ‌న న‌టించిన అన్ని డ‌బ్బింగ్ సినిమాల‌ను తెలుగు ప్ర‌జ‌లు ఆద‌రించారు. రాజ‌కీయాల్లో ప్ర‌వేశించాక కూడా ర‌జ‌నీ-క‌మ‌ల్ హాస‌న్ స్నేహం విరాజిల్లుతూనే ఉంది. మునుముందు ప‌లు సినిమాల‌కు క‌లిసి ప‌ని చేసేందుకు ఈ ఇద్ద‌రు స్నేహితులు చేతులు క‌లిపిన సంగ‌తి తెలిసిందే. ర‌జ‌నీకాంత్- క‌మ‌ల్ హాస‌న్ కాంబినేష‌న్ లో మ‌రో మాస్ట‌ర్ పీస్‌ని చూడాల‌ని త‌పిస్తున్న అభిమానుల కోరిక త్వ‌ర‌గా ఫ‌లించాల‌ని ఆకాంక్షిద్దాం.