సూపర్ స్టార్ సినిమాలో నేచురల్ స్టార్!
సూపర్ స్టార్ రజనీకాంత్ జెట్ స్పీడ్ తో కమిట్ మెంట్లు పూర్తి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే `కూలీ` పూర్తి చేసి రిలీజ్ కు రెడీగా ఉన్నారు.
By: Srikanth Kontham | 9 Aug 2025 8:00 PM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ జెట్ స్పీడ్ తో కమిట్ మెంట్లు పూర్తి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే `కూలీ` పూర్తి చేసి రిలీజ్ కు రెడీగా ఉన్నారు. మరో నాలుగైదు రోజుల్లో `కూలీ`తో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాతో రజనీకాంత్ కోలీవుడ్ కి 1000 కోట్ల వసూళ్ల సినిమా అందిస్తారని పరిశ్రమ ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. మరోవైపు పట్టాలెక్కించిన `జైలర్ 2` పై కూడా ఇదే రేంజ్ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈసినిమా ఆ న్ సెట్స్ లో ఉంది. నెల్సన్ దిలీప్ ప్రతిష్టాత్మకంగా చిత్రాన్ని తెరకెక్కి స్తున్నాడు.
`జైలర్` తరహాలో టాప్ స్టార్లను రంగంలోకి దించి పని చేస్తున్నాడు. భారీ కాన్వాస్ పై తెరకెక్కుతోన్న సినిమా కావడంతో వచ్చే ఏడాది రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అలాగని రజనీ ఈ ప్రాజెక్ట్ మీదనే కూర్చోలేదు. కమిట్ అయిన చిత్రాలు అంతే వేగంగా పట్టాలెక్కించాలని బ్యాకెండ్ లో పని చేస్తున్నారు. `కాఖీ` దర్శ కుడు హెచ్. వినోధ్ తో కూడా రజనీకాంత్ కు ఓ సినిమా కమిట్ మెంట్ ఉంది. `జైలర్ 2` కంటే ముందే ఒప్పందం జరిగింది. కానీ `జైలర్` అనూహ్య విజయం సాధించడంతో? రజనీ జైలర్ 2న ముందుగా పూర్తి చేయాలని భావించి పట్టాలెక్కించడం జరిగింది.
దీంతో వినోద్ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. ఇదే క్రమంలో దళపతి విజయ్ `జననాయగన్` డైరెక్ట్ చేయాలని కోరడంతో? వినోద్ ఆ సినిమాతో బిజీ అయ్యాడు. అలా రజనీ-వినోద్ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. అయితే ఈ చిత్రాన్ని ఇదే ఏడాది ప్రారంభించాలని ఆ ద్వయం ప్లాన్ చేస్తోందిట. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొద లు పెట్టారుట. ఈ నేపథ్యంలో నేచురల్ స్టార్ నాని పేరు కోలీవుడ్ మీడియాలో తెరపైకి వచ్చింది. సిని మాలో ఓ కీలక పాత్రకు నానిని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారుట. ఈ ఐడియా ఇచ్చింది కూడా రజనీకాంత్ అని సమాచారం.
వినోద్ రాసిన ఆ ఓ సెన్సిబుల్ రో ల్ కు నాని పర్పెక్ట్ గా సూటవుతాడని భావించి అతడి పేరు సూచించి నట్లు కోలీవుడ్ మీడియాలో ఓ వార్త తెరపైకి వచ్చింది. నాని ని వినోద్ కలిసి మాట్లాడినట్లు ప్రచారం జరు గుతోంది. నాని కూడా పాజిటివ్ గానే స్పందించాడని సమాచారం. రజనీకాంత్ సినిమాలో అవకాశం అంటే ఏ నటుడు వదులుకోడు. ఓ గొప్ప అవకాశంగా భావించి అంగీకరిస్తారు. మరి నాని ఆలోచన ఎలా ఉంది? మొత్తం ఈ ప్రచారంలో నిజమెంత? అన్నది తెలియాలి. ప్రస్తుతం నాని చేతిలో కొన్ని సినిమాలున్న సంగతి తెలిసిందే.
