74 ఏళ్ల వయసులో కష్టపడుతున్న రజినీకాంత్.. అవసరమంటారా గురూ!
ఏడు పదుల వయసు దాటినా ఏమాత్రం తగ్గకుండా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు రజినీకాంత్.
By: Madhu Reddy | 17 Aug 2025 7:00 PM ISTఎక్కడో బస్ కండక్టర్ గా కెరియర్ మొదలుపెట్టిన రజనీకాంత్.. ఒక అమ్మాయి సలహా మేరకు నటుడిగా మారి నేడు దేశం గర్వించదగ్గ నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు. సూపర్ స్టార్ గా చలామణి అవుతూ.. ఇటీవలే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు రజినీకాంత్. ఈ వయసులో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ.. ఆ సినిమాలలో యాక్షన్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన.. 74 సంవత్సరాల వయసులో కూడా కష్టపడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏడు పదుల వయసు దాటినా ఏమాత్రం తగ్గకుండా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు రజినీకాంత్. తమిళ సినీ దిగ్గజంగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. ఇప్పుడు ఈ వయసులో కూడా ఫిట్నెస్ పట్ల చూపిస్తున్న అంకితభావం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వయసులో కూడా ఆయన జిమ్లో వర్కౌట్ చేస్తుంటే అటు యంగ్ స్టర్స్ కూడా నోరెళ్ళబెడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి.
ఇదిలా ఉండగా తాజాగా రజనీకాంత్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో రజినీకాంత్ కష్టమైన వర్కౌట్స్ చేస్తూ కనిపించారు..వ్యక్తిగత ట్రైనర్ పర్యవేక్షణలో వర్కౌట్స్ చేస్తున్నారు. బరువులు ఎత్తుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఒక యూజర్ ఎక్స్ లో షేర్ చేయగా అందరూ ఆశ్చర్యపోయారు.. ఈ వీడియోలో మొదట రజనీకాంత్ ఇన్ క్లైన్ డంబెల్ ప్రెస్ చేస్తూ కనిపించారు.. సాధారణంగా ఛాతీ పై భాగాన్ని బలోపేతం చేయడానికి ఈ వ్యాయామం చాలా ఉపయోగపడుతుంది.
ఆ తర్వాత జిమ్ బెంచ్ పై కూర్చుని స్క్వాడ్స్ చేస్తూ కనిపించారు రజినీకాంత్. తన శరీరాన్ని మళ్లీమళ్లీ పైకెత్తుతూ ఈ వ్యాయామాన్ని పలుమార్లు చేశారు. దీనివల్ల కాలు కండరాల బలాన్ని పెంచడమే కాకుండా.. శరీరం ఫిట్ గా , నడకను బ్యాలెన్స్ చేయడానికి దోహదపడుతుంది. అంతేకాదు వీడియో చివర్లో తన కోచ్ తో కలిసి కండలు ప్రదర్శిస్తూ కనిపించారు రజినీకాంత్. మొత్తానికి అయితే వయసు పెరిగే కొద్దీ అటు శరీరాన్ని ఇటు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి తగిన వ్యాయామం చేస్తూనే అటు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ సినిమాల ద్వారా వచ్చే ఒత్తిడిని దూరం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న రజినీకాంత్.. ఇలా జిమ్ లో కష్టపడుతుండడం చూసి ఈ వయసులో ఇలాంటివి అవసరమా గురూ అంటూ కొంతమంది కామెంట్లు చేయగా.. మరి కొంతమంది వ్యాయామం చేయడానికి.. శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి వయసుతో సంబంధం ఏముంది అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా 74 ఏళ్ల వయసులో రజనీకాంత్ సినిమాల కోసం ఈ రేంజ్ లో కష్టపడడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేశారు. ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్లు బాగానే వచ్చినా.. రెండవ రోజు కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఇప్పుడు వీకెండ్ సంగతి అటు ఉంచితే.. ఆకస్మిక వర్షాల కారణంగా థియేటర్లకి వెళ్లడానికి ప్రేక్షకులు కూడా ఆసక్తి కనబరచడం లేదని సమాచారం.
