Begin typing your search above and press return to search.

75 ఏళ్ల వయసులో రజ‌నీకాంత్ 25 స్పీడ్!

హీరో వయసు యాభై దాటితేనే బాడీ లాంగ్వేజ్ మారుతుంది. అరవై వస్తే వేగం తగ్గుతుంది. కానీ ఆ లెక్కలన్నీ ఒకే ఒక్కరి విషయంలో తలకిందులవుతాయి.

By:  Srikanth Kontham   |   25 Jun 2026 9:00 PM IST
75 ఏళ్ల వయసులో రజ‌నీకాంత్ 25 స్పీడ్!
X

హీరో వయసు యాభై దాటితేనే బాడీ లాంగ్వేజ్ మారుతుంది. అరవై వస్తే వేగం తగ్గుతుంది. కానీ ఆ లెక్కలన్నీ ఒకే ఒక్కరి విషయంలో తలకిందులవుతాయి. ఆయనే సినీ లోకానికి ఒకే ఒక్కడు సూపర్ స్టార్ రజినీకాంత్. ప్రస్తుతం 75 ఏళ్ల వయసులో ఉన్న రజినీకాంత్ నేటి తరం 25 ఏళ్ల యువ హీరోలకు సైతం అసూయ కలిగేలా బుల్లెట్ వేగంతో దూసుకుపోతున్నారు. వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలు చేయడం.. అంతే వేగంగా షూటింగ్‌లు పూర్తి చేయడం.. సినిమా విడుదల కాకముందే మరో కొత్త ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టడం అనేది ఈ సీనియర్ లెజెండ్‌కే చెల్లింది.

సాధారణంగా 70 ఏళ్ల వ‌య‌సులో ఏ నటుడైనా రెస్ట్ తీసుకోవడానికో లేదా ఏడాదికి ఒక సినిమా చేయడానికో మొగ్గు చూపుతారు. కానీ రజినీకాంత్ మాత్రం బాక్సాఫీస్ వద్ద నిరంతరం సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నారు.

రజినీకాంత్ చూపిస్తున్న ఈ 25 స్పీడ్ వెనుక ఆయనకున్న క్రమశిక్షణ, సినిమాపై ఉన్న అపారమైన ప్యాషన్ ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. సెట్స్‌లోకి అడుగుపెడితే వయసుతో ప‌ని లేకుండా సాధారణ నటుడిలా మారిపోవడం, దర్శకుడు చెప్పినదానికి వంద శాతం న్యాయం చేయడం ఆయన శైలి.

షూటింగ్ షెడ్యూల్స్ ఎంత కఠినంగా ఉన్నా? భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నా? వెనకడుగు వేయకుండా డూప్ లేకుండా నటించడానికి ర‌జ‌నీ చూపే ఉత్సాహం తోటి నటీనటులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ ఎనర్జీ లెవెల్స్ వల్లే మేకర్స్ అనుకున్న సమయం కంటే ముందే షూటింగ్‌లు పూర్తవుతున్నాయి. ఒక సినిమా షూటింగ్ ముగింపు దశకు రాగానే ఆ తర్వాత ఏ దర్శకుడితో చేయాలనే ప్రణాళికను రజినీకాంత్ ముందే సిద్ధం చేసుకుంటున్నారు. నేటి తరం టాప్ డైరెక్టర్ల ఐడియాలను, వారి మేకింగ్ స్టైల్‌ను వెంటనే అందిపుచ్చుకుంటూ తన ఇమేజ్‌కు తగినట్లుగా కథ‌నాలు ఓకే చేస్తున్నారు.

కథల ఎంపికలో ర‌జ‌నీకాంత్ చూపిస్తున్న వేగం కారణంగానే నిర్మాతలు కూడా ఎలాంటి జాప్యం లేకుండా భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. రజినీకాంత్ బ్రాండ్ వాల్యూ , ఆయన వర్కింగ్ స్పీడ్.. కోలీవుడ్ ట్రేడ్ మార్కెట్‌కు పెద్ద బూస్ట్‌లా పని చేస్తున్నాయి. పక్క పరిశ్రమల్లోని సీనియర్ హీరోలు సైతం సినిమాలు చేస్తున్నప్పటికీ రజినీకాంత్ రేంజ్ స్పీడ్ మరియు కమర్షియల్ మార్కెట్ రీచ్ అందుకోవడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. 75 ఏళ్ల వయసులోనూ దేశవ్యాప్తంగా థియేటర్లను ఊపేసే మాస్ అప్పీల్, బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు రాబట్టే సత్తా ఆయనకు మాత్రమే సొంతం. వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమేనని, మనసులో సంకల్పం మరియు బాడీలో ఎనర్జీ ఉంటే ఎంతటి రికార్డులనైనా తిరగరాయవచ్చని ఆయన తన ప్రతి సినిమాతో నిరూపిస్తూనే ఉన్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ చూపిస్తున్న ఈ అసాధారణ వేగం నేటి తరం యంగ్ హీరోలకు గొప్ప రోల్ మోడల్. అవ కాశాలు ఉండి కూడా ఏళ్లకు ఏళ్లు సమయం తీసుకునే యువ నటులు రజినీకాంత్ వర్కింగ్ స్టైల్‌ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. 75 ఏళ్ల ప్రాయంలో 25 ఏళ్ల కుర్రాడి వేగంతో దూసుకుపోతున్న ఈ లెజెండ్, రాబోయే రోజుల్లో ఇంకెలాంటి సరికొత్త రికార్డులను సృష్టిస్తారో? త‌న‌ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఎలా అలరిస్తారో చూడాలి.