లోకేష్ కనగరాజ్‌కు షాక్ ఇచ్చిన రజనీ డాటర్!
భారీ బ్లాక్ బస్టర్ ఇస్తాడని నమ్మితే ఫ్లాప్ ఇచ్చాడని లోకేష్‌ని నిందించారు. అతనిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ నెట్టింట రజనీ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
By: Tupaki Entertainment Desk | 6 Feb 2026 4:00 PM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ `కూలీ`. లోకేష్ కనగరాజ్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని, రజనీ అభిమానుల్ని ఆకట్టుకోలేకపోయింది. మరీ మేఖ్యంగా రజనీ ఫ్యాన్స్‌ని తీవ్ర నిరాశకు గురి చేసింది. కమల్‌కు విక్రమ్‌తో భారీ బ్లాక్ బస్టర్‌ని అందించడమే కాకుండా కెరీర్ బెస్ట్ కలెక్షన్స్‌ని సాధించిన మూవీని అందించి ఆయన కెరీర్‌ని మళ్లీ ట్రాక్‌లోకి తీసుకొచ్చిన లోకేష్ కనగరాజ్ అంతకు మించి బ్లాక్ బస్టర్ హిట్‌ని రజనీకి అందిస్తాడని అంతా ఊహించారు.
కానీ అది జరగలేదు. నాగార్జున, సత్యారాజ్, శృతిహాసన్ వంటి వారు కీలక పాత్రల్లో నటించినా.. ఉపేంద్ర, ఆమీర్‌ఖాన్ కీలక అతిథి పాత్రల్లో మెరిసినా ఫలితం లేకుండా పోయింది. సినిమాలో ఇంత మంది ఉన్నా..రజనీ సినిమా అని చేసినా కానీ `కూలీ`ని కేవలం మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కన్నడ నటి రచితా రామ్‌ల కోసమే చేసినట్టుగా కనిపించింది. వీరి డామినేషన్ తప్ప ఎక్కడా రజనీ డామినేషన్ కనిపించలేదు. దీంతో అభిమానులు లోకేష్ కనగరాజ్‌పై ఫైర్ కావడం తెలిసిందే.
భారీ బ్లాక్ బస్టర్ ఇస్తాడని నమ్మితే ఫ్లాప్ ఇచ్చాడని లోకేష్‌ని నిందించారు. అతనిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ నెట్టింట రజనీ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఈ జాబితాలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ చేరింది. ఓ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ సౌందర్య రజనీకాంత్ `కూలీ` సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. గత ఏడాది విడుదలైన తమిళ సినిమాల్లో `కూలీ` అత్యధిక వసూళ్లని రాబట్టినా కానీ నాన్న నటించిన టాప్ టెన్ సినిమాల్లో మాత్రం చోటు దక్కించుకోలేదని తేల్చి చెప్పి లోకేష్ కనగరాజ్‌కు షాక్ ఇచ్చింది.
కూతురిగా కాకుండా ఓ ఫిల్మ్ మేకర్‌గా, ఆయన అభిమానిగా చెబుతున్నా నాన్న సినిమా అంటే ఎంతో ఊహిస్తాం. అవేవీ `కూలీ` మూవీలో కనిపించలేదు. వ్యక్తి గతంగా నాన్న నటించిన టాప్ టెన్ సినిమాల గురించి చెప్పమంటే అందులో `కూలీ`ని మాత్రం మెన్షన్ చేయను` అని చెప్పుకొచ్చింది. నాన్న స్క్రీన్ ప్రజెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే బాషా, పడయప్ప, శివాజీ, అన్నామలై, తిల్లు ముల్లు` నా దృష్టిలో ప్రత్యేకమైన సినిమాలు. నాన్న నుంచి సినిమా అంటే ప్రతి అభిమాని అదే స్థాయిలో ఊహిస్తాడు.
కూలీ సినిమాలో నాన్న పాత్రని గమనించిన అభిమానులు చాలా మంది ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. నాన్ని నటించి మిగతా సినిమాల్లోని పాత్రలకు ఇందులోని పాత్రకు చాలా వ్యత్యాసం ఉందని, ఎప్పుడూ దూకుడుగా ఉండే క్యారెక్టర్లకు భిన్నంగా ఇందులో చాలా సాదా సీదాగా చూపించారని కామెంట్ చేశారు. నేను కూడా అదే నోటీస్ చేశాను. అంతే కాకుండా మరో విషయాన్ని కూడా ప్రస్తావించారు. సినిమాలో అతిథి పాత్రలకు బదులు నాన్న క్యారెక్టర్‌కు మరింత స్కోప్ ఇచ్చి సీన్‌లు పెంచి ఉంటే సినిమా మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. నాకూ అదే అనిపించిందని చెప్పి దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు బిగ్ షాక్ ఇవ్వడం గమనార్హం.
