Begin typing your search above and press return to search.

రజినీ 'కూలీ' ట్రైలర్.. మాస్, సస్పెన్స్ తో వేరే లెవెల్!

అదే సమయంలో ఇప్పుడు మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రైలర్ దూసుకుపోతూ.. అందరినీ ఆకట్టుకుని సందడి చేస్తోంది.

By:  M Prashanth   |   2 Aug 2025 7:59 PM IST
Coolie Trailer Out Now
X

గత ఏడాది వేట్టయాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజినీ.. కూలీ మూవీతో ఇప్పుడు రానున్నారు. యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామాలో రజినీకాంత్ దేవా రోల్ లో కనిపించనున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథతో తెరకెక్కుతున్న ఆ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆగస్టు 14వ తేదీ వరల్డ్ వైడ్ గా పెద్ద ఎత్తున విడుదల చేయనున్నారు.

సినిమాలో అగ్రతారలంతా సందడి చేయనున్నారు. రజినీతో పాటు అన్ని ఇండస్ట్రీస్ కు చెందిన ప్రముఖ నటులు కనిపించనున్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటిస్తున్నారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో చిందులేయనున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

శ్రుతి హాసన్, ఉపేంద్ర, కిషోర్ కుమార్, రెబా మోనికా జాన్, సత్యరాజ్, సాబిన్ సాహిర్, మహేంద్రన్, మోనిషా బ్లెస్సీ వంటి పలువురు నటీనటులు యాక్ట్ చేస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న కూలీ మూవీ.. సెన్సార్ బోర్డు అధికారుల నుంచి A సర్టిఫికెట్ అందుకుంది.

ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ తో సినిమా పక్కాగా హిట్ అవుతుందని అంతా ఫిక్స్ అయ్యారు. అదే సమయంలో ఇప్పుడు మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రైలర్ దూసుకుపోతూ.. అందరినీ ఆకట్టుకుని సందడి చేస్తోంది.

ఒకడు పుట్టగా.. ఎవడి చేతిలో చావాలనేది తలపై రాసి పెట్టి ఉంటది అంటూ నాగార్జున వాయిస్ ఓవర్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత శ్రుతి హాసన్, నాగార్జున, సాబిన్ సాహిర్, సత్యరాజ్ ను మేకర్స్ పరిచయం చేశారు. అప్పుడు తన మార్క్ నవ్వుతో రజినీ పవర్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత క్రేజీ డైలాగ్స్ తో అదరగొట్టారు సూపర్ స్టార్.

అయితే ట్రైలర్ ఇప్పుడు ఓ రేంజ్ లో ఉన్న అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసింది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ మార్క్ క్లియర్ గా కనిపించింది. తనదైన శైలిలో ఆయన.. మాస్ గా కూలీ ప్రపంచాన్ని ఆవిష్కరించినట్లు ఉన్నారు. ప్రతి ఒక పాత్రను అద్భుతంగా డిజైన్ చేశారని క్లియర్ గా కనిపిస్తుంది. రజినీని వేరే లెవెల్ లో చూపించనున్నట్లు అర్ధమవుతోంది.

యాక్షన్, సస్పెన్స్ తో ట్రైలర్ తో ఆద్యంతం ఆసక్తి క్రియేట్ చేశారు. రజినీ మాస్ షాట్స్ అదిరిపోయాయి. అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎప్పటిలానే గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ట్రైలర్ కు బిగ్ అసెట్ గా మారింది. ఇప్పుడు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. హిట్ బొమ్మ కూలీ అని ఫిక్స్ చేసింది! మరి మీరు ట్రైలర్ ను చూశారా?