Begin typing your search above and press return to search.

కూలీ టైమ్ ట్రావెల్ కథ: లోకేష్ తేల్చేశాడుగా..

కూలీ ట్రైలర్, ప్రోమోల్లో కనిపించిన వాచ్ దృశ్యాల నేపథ్యంలో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఉంటుందన్న ఊహాగానాలు అభిమానుల్లో గట్టిగానే పెరిగిపోయాయి.

By:  M Prashanth   |   8 Aug 2025 9:49 AM IST
కూలీ టైమ్ ట్రావెల్ కథ: లోకేష్ తేల్చేశాడుగా..
X

రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘కూలీ’ సినిమా కోసం ఫ్యాన్స్ పుల్ హైప్‌లో ఉన్నారు. ట్రైలర్, ప్రమోషన్ ఈవెంట్స్‌తో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండిపెండెన్స్ డే వీకెండ్ స్పెషల్‌గా ఆగస్టు 14న సినిమా విడుదల కానుంది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫ్యాన్ థియరీస్ కూడా మరో లెవెల్ లో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా "టైమ్ ట్రావెల్" కాన్సెప్ట్ చుట్టూ జరుగుతున్న చర్చే ఆసక్తికరంగా మారింది.

ఫ్యాన్ థియరీస్ హైప్.. టైమ్ ట్రావెల్ వీక్

కూలీ ట్రైలర్, ప్రోమోల్లో కనిపించిన వాచ్ దృశ్యాల నేపథ్యంలో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఉంటుందన్న ఊహాగానాలు అభిమానుల్లో గట్టిగానే పెరిగిపోయాయి. ఒక్కసారి ఆ విజువల్ ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. కూలీలో "వాచ్" ప్రాధాన్యత చూసి… ఇదేదో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతుందా? టైమ్ మిషన్ అంటూ డిబేట్లు నడిచాయి. సోషల్ మీడియాలో "కూలీ టైమ్ ట్రావెల్ మూవీయే" అనే వాదనలు జోరుగా సాగాయి. కానీ, ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలుసుకోవడానికే అందరూ ఉత్సాహంగా ఎదురు చూశారు.

బ్యాక్‌గ్రౌండ్ కాస్ట్

ఈసారి లోకేష్ కనగరాజ్ స్టయిల్‌లో రియలిస్టిక్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయంటున్నారు మేకర్స్. నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, శౌబిన్ షాహీర్, శ్రుతి హాసన్ లాంటి స్టార్ క్యాస్ట్ ఉండటం సినిమాకు మరింత రిచ్‌నెస్ తీసుకొచ్చింది. ఇక 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీకి ఇండియా, ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్ గా ఉన్నాయి. హృతిక్ ఎన్టీఆర్ వార్ 2తో పోటీ ఉన్నప్పటికీ ప్రీ రిలీజ్ మార్కెట్‌ ట్రెండ్ చూస్తుంటే ఓపెనింగ్స్ హిట్ ఖాయమనిపిస్తోంది.

టైమ్ ట్రావెల్ రూమర్స్ కు లోకేష్ క్లారిటీ..

ఇటీవల ఇంటర్వ్యూలో లోకేష్ కనగరాజ్ ఈ కాన్సెప్టుపై స్పందించారు. “కూలీలో టైమ్ ట్రావెల్ లేదు. స్టోరీ మొత్తం వాచ్ ఫ్యాక్టరీ నేపథ్యంలో సాగుతుంది. ఆ వాచ్ ఫ్యాక్టరీ ఎలిమెంట్ కథలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ టైమ్ ట్రావెల్ ఎక్కడా లేదు” అని సూటిగా చెప్పేశాడు. ఇలా ఆయన కామెంట్స్ తో సోషల్ మీడియాలో హడావుడి కొంత తగ్గింది. అయితే, టైమ్ ట్రావెల్ లేదన్నప్పటికి ఈ వాచ్ ఫ్యాక్టరీ నేపథ్యంలో కథ ఎలా టర్న్ అవుతుందో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

లోకేష్ మార్క్ ఇంటెన్స్ యాక్షన్

ఇక యాక్షన్ సీక్వెన్స్‌లు స్క్రీన్ మీద పూనకాలు తెప్పించేలా ఉండబోతున్నాయని లోకేష్ స్వయంగా హింట్ ఇవ్వడం, ప్రమోషన తోనే థ్రిల్ మొదలవ్వడంతో థియేటర్లలో ఓ కొత్త అనుభూతికి సిద్ధపడుతున్నారు అభిమానులు. వాచ్ ఫ్యాక్టరీ బ్యాక్‌డ్రాప్‌తో కథలో ఎలాంటి మిస్టరీ, సర్ప్రైజ్ ఎలిమెంట్స్ వస్తాయో తెలుసుకోవాలన్న ఉత్సుకత మరింత పెరిగింది.