Begin typing your search above and press return to search.

ప్రీమియర్స్.. నాలుగో ప్లేస్ లో కూలీ మూవీ!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ లీడ్ రోల్ లో నటించిన కూలీ మూవీ ఆగస్టు 14వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   14 Aug 2025 10:19 PM IST
ప్రీమియర్స్.. నాలుగో ప్లేస్ లో కూలీ మూవీ!
X

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ లీడ్ రోల్ లో నటించిన కూలీ మూవీ ఆగస్టు 14వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో రజనీకాంత్ దేవాగా కనిపించారు. గోల్డ్ స్మగ్లర్ పాత్రను పోషించారు. ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. మరోసారి ఆడియెన్స్ ను మెప్పిస్తున్నారు.

రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో కూలీ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. పాజిటివ్ టాక్ తో సందడి చేస్తోంది. అదే సమయంలో నార్త్ అమెరికాలో కూడా సత్తా చాటుతోంది. వాస్తవానికి.. అక్కడ ప్రీమియర్స్ పడగా.. అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరిగాయి. పలు రికార్డులు కూడా నమోదు అయ్యాయి.

నార్త్ అమెరికా రైట్స్ ను ప్రముఖ బ్యానర్ ప్రత్యంగిరా సినిమాస్ బ్యానర్ సొంతం చేసుకుంది. కొద్ది రోజుల క్రితం ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేసింది. దీంతో విడుదలకు రెండు రోజుల ముందే కూలీ చిత్రం అక్కడ రెండు మిలియన్ల క్లబ్‌ లోకి చేరిపోయింది. ప్రీమియర్స్‌ లోనే ఆ రేంజ్ లో వసూళ్లు సాధించిన మొదటి తమిళ సినిమాగా రికార్డు నెలకొల్పింది.

అయితే 2016లో రజనీకాంత్‌ నటించిన కబాలి నార్త్‌ అమెరికాలో రిలీజ్ కు ముందే 60 వేల డాలర్లు వసూళ్లు చేసిన మొదటి తమిళ సినిమాగా అప్పట్లో రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు తొమ్మిదేళ్ల తర్వాత ఆ రికార్డ్ ను కూలీ బ్రేక్ చేసింది. తలైవా మూవీ రికార్డ్ ను ఆయనే సినిమానే బ్రేక్ చేయడం విశేషం.

అదే సమయంలో కూలీ నార్త్ అమెరికా ప్రీమియర్స్ $2.75M మార్క్ కు చేరుకున్నట్లు మేకర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేశారు. నార్త్ అమెరికా ప్రీ సేల్స్ లో మొదటి ఈ ఫీట్ ను చేరుకున్న చిత్రంగా నిలిచినట్లు తెలిపారు. అయితే కూలీ మూవీ ఇప్పుడు ప్రీమియర్స్ కు గాను బాక్సాఫీస్ వద్ద $2.9M+ వసూలు చేసింది. ఇండియన్ చిత్రాల్లో అక్కడ ప్రీమియర్స్ ద్వారా రాబట్టిన వసూళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది.

1. కల్కి 2898AD (తెలుగు) - $3.9M

2. ఆర్ ఆర్ ఆర్ (తెలుగు) - $3.46M

3. బాహుబలి - 2 (తెలుగు) - $3M

4. కూలీ (తమిళం) - $2.9M+

5. సలార్ పార్ట్ - 1 (తెలుగు) - $2.6M

ఇక కూలీ విషయానికొస్తే.. నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్, రెబా మోనికా జాన్, జూనియర్ ఎంజీఆర్ కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు. కళానిధి మారన్ తన సన్ పిక్చర్స్ బ్యానర్‌ పై నిర్మించారు. సంగీతాన్ని అనిరుద్ రవిచందర్ అందించారు. మరి మీరు కూలీ సినిమా చూశారా?