Begin typing your search above and press return to search.

కూలీ ట్రైలర్.. కౌంట్‌డౌన్ షూరు!

సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ హైప్ క్రియేట్ చేసే హీరోల్లో రజినీకాంత్ పేరు మొదట ఉంటుంది.

By:  M Prashanth   |   29 July 2025 12:31 AM IST
కూలీ ట్రైలర్.. కౌంట్‌డౌన్ షూరు!
X

సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ హైప్ క్రియేట్ చేసే హీరోల్లో రజినీకాంత్ పేరు మొదట ఉంటుంది. ఇప్పుడు ఆయన ‘కూలీ’ సినిమాతో మరోసారి సెన్సేషన్ సృష్టించబోతున్నారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కాస్టింగ్ పరంగా కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్‌లో రజినీతో పాటు నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్ తదితరులు నటిస్తున్నారు.

ఇలా బడా స్టార్స్ అండ్ టాలెంటెడ్ యాక్టర్స్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం సినీ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచింది. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియోలు కూలీ మీద అద్భుతమైన బజ్‌ను క్రియేట్ చేశాయి. స్పెషల్ గా రజినీకాంత్ మాస్ లుక్, నాగార్జున పవర్‌ఫుల్ ప్రెజెన్స్, ఆమిర్ ఖాన్ విలన్ పాత్ర, అలాగే శ్రుతి హాసన్ ప్రత్యేకతలపై ఫ్యాన్స్‌లో ఆసక్తి మరింత పెరిగింది.

సౌత్ ఇండస్ట్రీలో ఇలా పాన్ ఇండియా స్టైల్‌లో రూపొందుతున్న యాక్షన్ డ్రామా కావడంతో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. ‘కూలీ’ ట్రైలర్ ఆగస్ట్ 2న రిలీజ్ కానుంది. విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో రజినీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్ డైనమిక్ లుక్స్‌లో కనిపించారు. వీళ్లంతా ఒకే పోస్టర్‌లో దుమ్మురేపడంతో ట్రైలర్‌పై ఆసక్తి రెట్టింపు అయింది.

ట్రైలర్‌తో సినిమా గురించి క్లారిటీ వస్తుందన్న నమ్మకంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.లోకేశ్ కనగరాజ్ దర్సకత్వం వహించడంతో కూలీ సినిమాలో యాక్షన్, మాస్ ఎలివేషన్లు హైలైట్‌గా ఉంటాయని టాక్. ఆయన గతంలో చేసిన సినిమాలు ‘కైది’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి చిత్రాలు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు రజినీకాంత్ వంటి సూపర్ స్టార్, నాగార్జున, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ క్యాస్టింగ్‌తో తెరకెక్కుతుండటంతో అంచనాలు ఇంకా పెరిగాయి.

ఇంకా, సంగీత దర్శకుడు అనిరుధ్ ఇప్పటికే విడుదల చేసిన పాటలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాడు. సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంటుందని మేకర్స్ హామీ ఇచ్చారు. పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా అన్ని భాషల్లో విడుదల కాబోతుంది. తెలుగు వెర్షన్‌ను ఆసియన్ మల్టీప్లెక్స్ సంస్థ విడుదల చేస్తోంది. ‘కూలీ’ ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్‌తో పాటు మరిన్ని అప్‌డేట్స్ వస్తాయనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. మరి ట్రైలర్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.