Begin typing your search above and press return to search.

కూలీ.. అసలు కథ ఇదేనా?

కీలక పాత్ర పోషిస్తున్న శ్రుతి హాసన్ ఇలా అవయవాలు అక్రమంగా రవాణా చేస్తున్న నాగ్ గ్యాంగ్ గుట్టును కనిపెడుతుంది.

By:  M Prashanth   |   8 Aug 2025 2:01 AM IST
కూలీ.. అసలు కథ ఇదేనా?
X

సూపర్ స్టార్ రజనీకాంత్- లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన కూలీ సినిమా కోసం తలైవా ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఈనెల 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానుంది. అంటే ఇంకా సరిగ్గా వారం రోజుల్లో రజనీకాంత్ థియేటర్లలో సందడి చేయనున్నారు.

ఇందులో రజనీకాంత్ తోపాటు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్ లాంటి భారీ తారాగణం నటించింది. దీంతో సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటీవల రిలీజై ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో నాగార్జున పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ లో నటించి అంచనాలు పెంచుతున్నారు.

అయితే సినిమా రిలీజ్ కు వారం రోజులు ఉందనగా.. స్టోరీ రివీల్ అయ్యింది. మానవ అవయవాల అక్రమ రవాణా నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుందని తెలుస్తోంది. ఈ అక్రమ రావాణా ముఠాకు నాగార్జున హెడ్ గా ఉంటారు. ఆయనకు రైట్ హ్యాండ్ గా సౌబిన్ షాహిర్ కనిపిస్తారు. నాగ్ చెప్పినట్లు షాహిర్ చేస్తారు.

అయితే నాగార్జున ఎలాంచి అవాంతరాలు లేకుండా.. అవయవాల అక్రమ రవాణా చేసుకుంటు ఎదుగుతారు. కీలక పాత్ర పోషిస్తున్న శ్రుతి హాసన్ ఇలా అవయవాలు అక్రమంగా రవాణా చేస్తున్న నాగ్ గ్యాంగ్ గుట్టును కనిపెడుతుంది. ఈ క్రమంలోనే ఆమె ప్రమాదంలో పడుతుంది. దీంతో శ్రుతి హాసన్.. రజనీకాంత్ ను ఆశ్రయిస్తుంది. ఆయనకు అవయవాల అక్రమ రవాణా, నాగార్జున గ్యాంగ్ తో ఉన్న ముప్పు గురించి చెబుతుంది.

అప్పుడు కథ రసవత్తరంగా మారుతుంది. రజనీ బరిలోకి దిగి శ్రుతిహాసన్ ను కాపాడడమే కాకుండా అవయవాల అక్రమ రవాణాను కూడా అరికడతారు. ఈ క్రమంలోనే రజనీ- నాగార్జున మధ్య ఆసక్తికర సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ ఉండనున్నాయి. మరి ఈ అక్రమాన్ని రజనీ ఎలా ఎదుర్కొంటారు, నాగ్ ను ఎలా ఓడిస్తారు, ఇందులో ఆమిర్ ఖాన్ అసలు పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ.

కాగా, స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై ఫుల్ బజ్ ఉంది. ఓవర్సీస్ లో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. యూఎస్ఏలో అడ్వాన్స్ సేల్స్ దూసుకుపోతోంది. ఇప్పటికే అక్కడ వన్ మిలియన్ డాలర్ మార్క్ అందుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇక్కడ కూడా ప్రీ బుకింగ్స్ ఓపెన్ అవ్వనున్నాయి.