లోకేష్ కూలీ.. ఆ విషయంలో ఫ్యాన్స్ ఫుల్ సాటిస్ఫై!
థియేటర్లలో ఈ యంగ్ రజిని లుక్ వచ్చిన సన్నివేశాలకు పబ్లిక్ నుండి గట్టిగానే చప్పట్లు, కేకలు వినిపించాయి.
By: M Prashanth | 15 Aug 2025 2:17 PM ISTరజనీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ కూలీ నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కొంతమంది హార్డ్‌కోర్ రజిని ఫ్యాన్స్, లోకేష్ తీసిన ట్రీట్మెంట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ మిక్స్‌డ్ రిసెప్షన్ మధ్య, ఒక అంశంపై మాత్రం అందరి నుంచి పాజిటివ్ టాక్ అందుతోంది.
రజనీకాంత్ ని డీ-ఏజింగ్ లుక్ లో చూపించిన విధానం హైలైట్‌గా నిలిచింది. ఇంతకుముందెప్పుడూ చూడని విధంగా యంగ్ లుక్‌లో రజనీకాంత్‌ను చూపించడం ఫ్యాన్స్‌కి ప్రత్యేక అనుభూతి కలిగించింది. ఈ డీ ఏజింగ్ ఎఫెక్ట్‌ను అందంగా, సహజంగా చూపించేందుకు టెక్నికల్ టీమ్ చాలా కష్టపడి పని చేసినట్లు తెలుస్తోంది. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు వచ్చిన వాటిలో బెస్ట్ డీ ఏజింగ్ లుక్ ఇదే అని చాలా మంది చెబుతున్నారు.
థియేటర్లలో ఈ యంగ్ రజిని లుక్ వచ్చిన సన్నివేశాలకు పబ్లిక్ నుండి గట్టిగానే చప్పట్లు, కేకలు వినిపించాయి. రజనీకాంత్ యంగ్ గెటప్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లు, డైలాగ్ డెలివరీ చూసి ఫ్యాన్స్‌కి పాత రజిని డేస్ గుర్తుకు వచ్చాయని కామెంట్లు చేస్తున్నారు. లోకేష్ ఈ విషయంలో ఫ్యాన్స్‌ని ఫుల్ సాటిస్ఫై చేశారని అందరూ అంటున్నారు.
అయితే డీ ఏజింగ్ సీక్వెన్స్ తప్ప, సినిమా మొత్తానికి మిక్స్‌డ్ ఫీడ్‌బ్యాక్ రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. కథనం పేస్, సెకండ్ హాఫ్ సీన్స్ పట్ల కొందరు సంతృప్తి చెందకపోవడం, అంచనాలకు తగ్గ ఎమోషనల్ హై పాయింట్స్ లేకపోవడం వంటి పాయింట్లు చర్చనీయాంశం అయ్యాయి. కానీ రజనీకాంత్‌తో పాటు అక్కినేని నాగార్జున, ఆమిర్ ఖాన్, సత్యరాజ్, ఉపేంద్ర, సబీర్ షాహర్ తదితరుల పాత్రలు సినిమాలో బలమైన ప్రెజెన్స్ ఇచ్చాయి.
సన్ పిక్చర్స్ నిర్మాణంలో, అనిరుధ్ సంగీతం, టాప్ లెవెల్ టెక్నికల్ వర్క్‌తో వచ్చిన కూలీ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద మంచి స్టార్ట్ తీసుకుంది. హాలిడే వీకెండ్‌లో మరింతగా పెరగడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయినా, మిక్స్‌డ్ టాక్ కారణంగా దీర్ఘకాలం రన్ ఎలా ఉంటుందో చూడాలి. ఏదేమైనా, రజనీకాంత్ డీ ఏజింగ్ లుక్ ఈ మూవీకి గట్టి పాజిటివ్ పాయింట్‌గా మిగిలిపోతుంది. లోకేష్ ఈ విషయంలో అందరి ప్రశంసలు అందుకోవడం, ఫ్యాన్స్‌ని పాత రజిని టైమ్‌కి తీసుకెళ్లడం నిజంగా మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి.
