Begin typing your search above and press return to search.

క్లిక్‌ క్లిక్‌ : 'కూలీ' సెట్‌లో ప్రీతి సందడి

కోలీవుడ్‌ సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.

By:  Ramesh Palla   |   1 Sept 2025 12:13 AM IST
క్లిక్‌ క్లిక్‌ : కూలీ సెట్‌లో ప్రీతి సందడి
X

కోలీవుడ్‌ సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. సినిమాకు వచ్చిన టాక్‌ తో సంబంధం లేకుండా వసూళ్లు నమోదు అయ్యాయి. వార్‌ 2 కి పోటీగా విడుదలైన కూలీ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన నేపథ్యంలో రజనీకాంత్‌, లోకేష్‌ కనగరాజ్‌ కాంబోలో మరో సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటున్నారు. కూలీ సినిమా ఇప్పటికీ థియేటర్‌లో కొన్ని చోట్ల ఆడుతూనే ఉంది. మరికొందరు ప్రేక్షకులు కూలీ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. అతి త్వరలోనే కూలీ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది. థియేట్రికల్‌ రిలీజ్‌ లో మంచి వసూళ్లు సాధించిన కూలీ ఓటీటీలో ఎలాంటి టాక్‌ దక్కించుకుంటుంది చూడాలి.


కూలీ సినిమాలో శృతి హాసన్‌..

కూలీ సినిమాలో ప్రీతి పాత్రలో నటించి మెప్పించిన శృతి హాసన్‌ ప్రమోషన్‌ సమయంలో తనవంతు బాధ్యతను నిర్వర్తించింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి స్కిన్‌ షో చేసే సత్తా ఉన్న ముద్దుగుమ్మ శృతి హాసన్‌ ఈ సినిమా కోసం సింపుల్‌ అండ్‌ క్యూట్‌ లుక్‌లో కనిపించింది. ఇలాంటి పాత్రలను శృతి ఎందుకు చేస్తుందని, కమర్షియల్‌ హీరోయిన్‌గా ఈమె నటించాలని చాలా మంది కోరుకుంటున్నారు. కానీ శృతి హాసన్ మాత్రం తనకు వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్‌ను సద్వినియోగం చేసుకునేందుకు గాను ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కేవలం హీరోయిన్‌గా, హీరోలతో రొమాన్స్ చేసే పాత్రలో మాత్రమే కాకుండా అన్ని రకాల పాత్రల్లోనూ శృతి హాసన్‌ నటిస్తూ ఉంటుంది. తాజాగా కూలీ సినిమాలో ప్రీతి పాత్రలో నటించి నటిగా తనను తాను మరోసారి నిరూపించుకునే ప్రయత్నం చేసింది.


రజనీకాంత్‌, లోకేష్ కనగరాజ్ కూలీ సినిమా..

ఆ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌కి కాస్త దూరంగా ఉండాలి అనుకుంటున్నట్లుగా ప్రకటించిన శృతి హాసన్‌ కొన్ని రోజుల్లోనే రీ ఎంట్రీ ఇచ్చింది. తన అందమైన ఫోటోలు మాత్రమే కాకుండా సినిమా అప్‌డేట్స్, రొటీన్‌ లైఫ్‌, ప్రొఫెషనల్‌ లైఫ్‌ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ ఉంటుంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్‌ ఉండే శృతి హాసన్‌ ఈసారి స్కిన్‌ షో ఫోటోలు కాకుండా కూలీ సినిమా షూటింగ్‌ సమయంలో తన చిల్లింగ్ మూమెంట్స్ ను షేర్‌ చేసింది. సినిమా విడుదల అయిన ఇన్ని రోజుల తర్వాత ఆమె ఈ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమాలోని కీ మూమెంట్స్ ఏమైనా లీక్ అయ్యే అవకాశం ఉంది కనుక కూలీ సినిమా ఆన్ లొకేషన్‌ స్టిల్స్‌ను శృతి హాసన్‌ షేర్‌ చేయలేదు. ఇప్పుడు సినిమా థియేటర్ల ఉన్న కారణంగా షేర్‌ చేసినట్లు పలువురు కామెంట్స్ చేస్తున్నారు.


సలార్‌ 2 లో శృతి హాసన్‌

కూలీ సినిమా షూటింగ్‌ నాకు చాలా సరదాగా అనిపించింది, కొన్ని అద్భుతమైన క్షణాలను, మంచి స్నేహితులతో దిగిన జ్ఞాపకాలను ఇక్కడ షేర్‌ చేస్తున్నాను. చాలా మంచి జ్ఞాపకాలను నేను సంపాదించుకున్నాను, ఇలాంటి ఒక సినిమాలో భాగం కావడం చాలా నచ్చింది. మీ యొక్క ప్రేమ, అభిమానం కు అందరికీ ధన్యవాదాలు. శృతి హాసన్‌ సలార్‌ 2 తో పాటు మరికొన్ని సినిమాల్లో నటించాల్సి ఉంది. తెలుగు, తమిళ్‌, హిందీ సినిమాల్లో నటిస్తూ బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో వచ్చే శృతి హాసన్ మరో వైపు రెగ్యులర్‌గా వెబ్‌ సిరీస్‌లను చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నటిగా ఎప్పుడూ తనను తాను నిరూపించుకునేందుకు తాపత్రయ పడే శృతి హాసన్‌ కూలీ లో ప్రీతి పాత్ర పోషించడం ద్వారా నటిగా మరింతగా తన ప్రతిభ చూపించింది. అయితే ఆమె అభిమానులు మాత్రం ఆమె నుంచి లవ్‌ సీన్స్‌, రొమాంటిక్ సాంగ్స్‌, హీరోతో డ్యూయెట్స్ లో చూడాలి అని కోరుకుంటున్నారు.