Begin typing your search above and press return to search.

'కూలీ' ప్రమోషన్స్.. ఇది నెవ్వర్ బిఫోర్ బాసూ!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో కూలీ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   1 Aug 2025 2:00 AM IST
కూలీ ప్రమోషన్స్.. ఇది నెవ్వర్ బిఫోర్ బాసూ!
X

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో కూలీ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అగ్రతారలతో ప్రేక్షకుల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్న కూలీ మూవీ.. ఆగస్టు 14వ తేదీన థియేటర్స్ లోకి రానుంది. దీంతో ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. వినూత్నంగా సందడి చేస్తున్నారు.

అయితే కూలీ మూవీ రిలీజ్ కు మరో 14 రోజులే టైమ్ ఉంది. దీంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఇప్పుడు అమెజాన్ ఇండియా భాగస్వామ్యంతో స్పెషల్ ప్రమోషన్ ను స్టార్ట్ చేశారు. అమెజాన్ డెలివరీ చేస్తున్న పార్శిల్స్ పై కూలీ పోస్టర్స్ కనిపిస్తున్నాయి. అలా జరగడం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇదే తొలిసారి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

సినిమా పబ్లిసిటీ కోసం ఈ-కామర్స్ డెలివరీని ఉపయోగించడం ఇదే ఫస్ట్ టైమ్. అదే సమయంలో రాష్ట్రాల బట్టి కూడా పోస్టర్స్ కనిపిస్తున్నాయి. తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లో పార్శిళ్లపై రజనీకాంత్, నాగార్జున ఉన్న పోస్టర్ ఉంటుంది. హిందీ మాట్లాడే ప్రాంతాల్లో రజనీకాంత్ తో అమీర్ ఖాన్‌ కనిపిస్తారు. కర్ణాటక అంతటా ఉపేంద్ర పోస్టర్‌ లు ఉంటున్నాయి.

కేరళలో డెలివరీ చేస్తున్న పార్శిళ్లపై సాబిన్ షాహిర్ ఉన్నారు. మొత్తానికి పార్సిల్స్ పై ప్రాంతీయ నటులను హైలైట్ చేయడం ద్వారా మేకర్స్ ఆకర్షిస్తున్నారనే చెప్పాలి. అయితే సినిమాలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సాబిన్ షాహిర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే వారికి సంబంధించిన లుక్స్ ను మేకర్స్ రిలీజ్ మంచి బజ్ క్రియేట్ చేశారు.

మూవీలో శ్రుతి హాసన్, పూజా హెగ్డే, సత్యరాజ్ కూడా ముఖ్యమైన రోల్స్ లో సందడి చేయనున్నారు. యువ సంచలనం అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. కాగా.. సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

వరుసగా అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే టీజర్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన మేకర్స్.. మరో రెండు రోజుల్లో ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటి వరకు మూడు పాటలు రిలీజ్ చేశారు. ఇప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా అమెజాన్ తో జత కట్టారు. విభిన్న భాషల ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి ఇది ఫుల్ గా సహాయపడుతుందని చెప్పాలి.