Begin typing your search above and press return to search.

లోకేష్ సినిమాకు తొలిసారి ఇలా.. ఇక థియేటర్లు బద్దలే

సూపర్ స్టార్ రజనీకాంత్ లీడ్ రోల్ లో సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన సినిమా కూలీ.

By:  M Prashanth   |   2 Aug 2025 4:00 AM IST
లోకేష్ సినిమాకు తొలిసారి ఇలా.. ఇక థియేటర్లు బద్దలే
X

సూపర్ స్టార్ రజనీకాంత్ లీడ్ రోల్ లో సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన సినిమా కూలీ. భారీ బడ్జెట్ తో గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ఈ సినిమాను లోకేష్ తెరకెక్కించారు. ఆగస్టు 14న ఇది గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో అభిమానులు అంచనాలు హై లెవెల్ లో ఉన్నాయి. ఈ క్రమంలోనే సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది.

అయితే ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే.. ఈ సినిమాకు A సర్టిఫికేట్ లభించింది. లోకేశ్ కనగరాజ్ చిత్రాల్లో ఏ సర్టిఫికేట్ లభించడం ఇదే తొలిసారి. అంటే హింస, యాక్షన్, అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటే ఏ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ లెక్కన కూలీకి ఏ లభించడంతో ఫ్యాన్స్ లో అంచనాలు మరింత పెరిగాయి. రజినీ యాక్షన్ ఏ లెవెల్ లో ఉంటుందో అని ఇప్పుడే హై ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు.

కానీ రజనీ కెరీర్ లో 30-40 సంవత్సరాల సనీ ప్రయాణంలో ఎక్కువగా అడల్ట్ కంటెంట్ సినిమాలు లేవు. ఒకసారి గమనించినట్లైతే గ్యాంగ్ స్టార్, యాక్షన్ వైలెంట్ నేపథ్యంలో కబాలి, కాలా, జైలర్ లాంటి సినిమాలే ఉన్నాయి. ఈ సినిమాలు U/A రేటింగ్‌ పొందాయి.

మరోవైపు, ఖైదీ లాంటి చిత్రాలు తెరకెక్కించిన లోకేష్ నుంచి ఫ్యాన్స్ హై- యాక్షన్ చిత్రాలే ఆశిస్తున్నారు. కూలీలోనూ అలాంటి ఎలిమెంట్స ఉంటాయని అంటున్నారు. ఇటీవల డైరెక్టర్ లోకేష్ కూడా ఓ ఇంటర్వ్యూలో కూలీలో వైలెన్స్ లో కాంప్రమైజ్ ఉండదని అన్నారు. కానీ ఈ చిత్రం డ్రగ్స్ నేపథ్యంలో ఉండదని కూడా ఆయన చెప్పారు. కానీ తాజాగా సెన్సార్ రేటింగ్ చూస్తే, సినిమాలో హింస తీవ్రత ఎక్కువగా ఉంటుందని అర్థమవుతోంది.

ఓవైపు లోకేష్ కనగరాజ్ కు కూలీ మొదటి A సర్టిఫికేట్ చిత్రం కావడం, మరోవైపు రజినీకి కూడా ఇలాంటి వైలెన్స్ సినిమాలు రెగ్యులర్ గా లేకపోవడం ఇంకా ఆసక్తి పెంచుతుంది. ఇక రిలీజ్ దగ్గరపడుతుండడంతో మేకర్స్ రేపు గ్రాండ్ గా ఈవెంట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చిత్ర బృందంలోని ఎవరెవరు వస్తారోనని సస్పెన్స్ ఉంది. ఎందుకంటే ఇందులో రజనీకాంత్ తో పాటు.. అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషించారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్ నటించారు. కాాగా, ట్రైలర్ కూడా ఈ ఈవెంట్ లోనే రిలీజ్ చేయనున్నారు.