అక్టోబర్‌లో స్టార్ హీరోల మధ్య త్రిముఖ పోరు!
టాలీవుడ్ - కోలీవుడ్ లో ఎన్నడు లేని విధంగా ఓ ఆసక్తికర వాతావరణం నెలకొంటుంది. ఈ అక్టోబర్ నెల సినిమా బాక్సాఫీస్‌కు అత్యంత కీలకమైన సీజీన్ గా మారబోతోంది.
By: Srikanth Kontham | 29 July 2026 7:10 PM ISTటాలీవుడ్ - కోలీవుడ్ లో ఎన్నడు లేని విధంగా ఓ ఆసక్తికర వాతావరణం నెలకొంటుంది. ఈ అక్టోబర్ నెల సినిమా బాక్సాఫీస్‌కు అత్యంత కీలకమైన సీజీన్ గా మారబోతోంది. దసరా పండుగ ను టార్గెట్ చేసుకుని పలువురు అగ్ర హీరోలు భారీ బడ్జెట్ చిత్రాలను బరిలోకి దించడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా అక్టోబర్ మధ్యలో బాక్సాఫీస్ వద్ద ముగ్గురు స్టార్ హీరోల మధ్య త్రిముఖ పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ రేసులో ముందుగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న మోస్ట్ వైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'జైలర్ 2' చిత్రం అక్టోబర్ మధ్యలో విడుదలకు సిద్ధమవుతోంది.
సంచలన విజయం సాధించిన 'జైలర్' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. రజినీకాంత్ స్టైల్, నెల్సన్ దిలీప్‌కుమార్ టేకింగ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమాకు బిజినెస్ పీక్స్‌లో జరుగుతోంది.
రజినీకాంత్‌తో పాటు టాలెంటెడ్ హీరో ధనుష్ నటిస్తోన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ 'ఓం చాప్టర్ వన్ ' కూడా అదే సమయం లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరించే ధనుష్ ఈసారి సరికొత్త యాక్షన్ డ్రామాతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్దమవుతున్నారు. ధనుష్ సినిమాలకు ఉండే ప్రత్యేకమైన యూత్ అప్పీల్, మేకింగ్ స్టైల్ సినిమాను మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. 'జైలర్ 2'తో పాటు 'ఓం' కూడా అదే టైమ్‌లో రిలీజ్ అవుతుండటంతో పోటీ రంజుగా మారుతుంది.
వీటితో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న అత్యంత ప్రతిష్టాత్మక ఫాంటసీ సోషియో-ఫాంటసీ చిత్రం `విశ్వంభర` కూడా అక్టోబర్ నెలలోనే విడుదలవుతుందనే అంచనాలు తెరపైకి వస్తున్నాయి. వశిష్ట దర్శకత్వంలో తెరకె క్కుతున్న భారీ విజువల్ వండర్ పై మెగా అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. సోషియో-ఫాంటసీ జానర్‌లో వస్తున్న సినిమా వీఎఫ్‌ఎక్స్ .. గ్రాండియర్ మేకింగ్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. ఇప్పటికే బాగా ఆలస్యమైన నేపథ్యంలో అక్టోబర్ రేసులో 'విశ్వంభర' దిగితే పోటీ మరింత రసవత్తరంగా మారుతుంది.
ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు ఒకే నెలలో ఒకే సమయంలో బాక్సాఫీస్ వద్ద తలపడితే థియేటర్ల కేటాయింపు .. కలెక్షన్లపై తీవ్రమైన ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఏకకాలంలో మూడు భారీ ప్రాజెక్ట్‌లు విడుదలైతే డిస్ట్రి బ్యూటర్లు, నిర్మాతలు బిజినెస్ వ్యూహాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. పండుగ సీజన్ కావడంతో సినిమా మార్కెట్ భారీగా విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలో ముగ్గురు హీరోలకు బాక్సాఫీస్ వద్ద తగినంత స్పేస్ దొరుకుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
