Begin typing your search above and press return to search.

అప్పట్లో రజినీ కమల్ ఇలా.. స్టన్నింగ్ వీడియో

సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా మొత్తం విషెస్ తో నిండిపోయింది.

By:  M Prashanth   |   12 Dec 2025 3:04 PM IST
అప్పట్లో రజినీ కమల్ ఇలా.. స్టన్నింగ్ వీడియో
X

సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా మొత్తం విషెస్ తో నిండిపోయింది. సామాన్య అభిమానుల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే వీటన్నింటిలో ఒక వీడియో మాత్రం చాలా స్పెషల్ గా నిలిచింది. రజినీకాంత్ ప్రాణ స్నేహితుడు లోకనాయకుడు కమల్ హాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ RKFI రిలీజ్ చేసిన ఒక స్పెషల్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. ఇది పూర్తిగా ఏఐ టెక్నాలజీతో రూపొందించింది. ఇందులో రజినీకాంత్, కమల్ హాసన్ ల సినీ ప్రయాణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి రోజుల నుంచి, ఇప్పటి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ వరకు వీరిద్దరూ కలిసి నడిచిన విధానాన్ని చాలా గొప్పగా డిజైన్ చేశారు. స్టూడియోలో లైట్ల మధ్య, షూటింగ్ స్పాట్లలో వీరిద్దరూ చేతిలో చెయ్యి వేసి నడుస్తున్న విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.

అయితే ఈ వీడియోకి ప్రాణం పోసింది మాత్రం వెనక వినిపించే లిరిక్స్ అని చెప్పాలి. "నన్బనే.. నన్బనే.." (స్నేహితుడా) అంటూ సాగే ఆ పాట, వీరి 50 ఏళ్ల స్నేహబంధానికి అద్దం పడుతోంది. సినిమా ఇండస్ట్రీలో ఎంత పోటీ ఉన్నా, ఇన్నేళ్లుగా వీరిద్దరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఎలా ఎదిగారో చెప్పడానికి ఈ ఒక్క వీడియో చాలు. సాధారణంగా ఏఐ వీడియోలు కొంచెం కృత్రిమంగా, ఎమోషన్ లేకుండా ఉంటాయి. కానీ ఈ వీడియోలో మాత్రం ఆ మ్యాజిక్ వర్కవుట్ అయ్యిందనే చెప్పాలి.

ఈ వీడియో చూస్తుంటే ఫ్యాన్స్ కు పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. 'అపూర్వ రాగంగల్' టైమ్ లో ఎలా ఉండేవారో, ఇప్పుడు ఎలా లెజెండ్స్ గా మారారో చూసి మురిసిపోతున్నారు. టెక్నాలజీని వాడుకుని కమల్ తన మిత్రుడికి ఇచ్చిన ఈ ట్రిబ్యూట్ నిజంగా ఆలోచింపజేసేలా ఉంది. రాజ్ కమల్ బ్యానర్ నుంచి వచ్చిన ఈ వీడియో వెనుక మరో ఆసక్తికరమైన కోణం కూడా ఉంది. అదే వీరి కాంబినేషన్ లో రాబోయే సినిమా.

వాస్తవానికి రాజ్ కమల్ బ్యానర్ లో రజినీకాంత్ హీరోగా ఒక సినిమా రానుంది. దీనికి మొదట కమర్షియల్ డైరెక్టర్ సుందర్ సీ ని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ కాంబినేషన్ సెట్ అవ్వలేదని టాక్. దీంతో ఇప్పుడు రజినీ కోసం మరో దర్శకుడిని వెతికే పనిలో పడ్డారు. ఆ ప్రాజెక్ట్ త్వరగా పట్టాలెక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఏదేమైనా, ఒక పక్క సినిమాలు, మరోపక్క రాజకీయాలు, ఇంకోపక్క బాక్సాఫీస్ పోటీ.. ఇవేవీ వీరి స్నేహాన్ని విడదీయలేకపోయాయి. 75 ఏళ్ల జీవితం, 50 ఏళ్ల సినిమా ప్రయాణం.. రజినీ ప్రస్థానం నిజంగా గ్రేట్.