Begin typing your search above and press return to search.

IFFI రజనీ, బాలయ్య 50 ఏళ్ల సినీ పండగ..!

ఐతే బాలయ్యతో పాటు ఇండియన్ సినీ పరిశ్రమకు 50 ఏళ్లుగా నిరంతరాయంగా కృషి చేస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ కి కూడా ఘన సత్కారాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

By:  Ramesh Boddu   |   17 Nov 2025 1:00 PM IST
IFFI రజనీ, బాలయ్య 50 ఏళ్ల సినీ పండగ..!
X

సూపర్ స్టార్ రజనీకాంత్, నందమూరి నట సింహం బాలకృష్ణ. ఇద్దరు కూడా తమ నట జీవితంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. నందమూరి వారసుడిగా బాలకృష్ణ తెరంగేట్రం చేసినప్పటి నుంచి ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పిస్తూ వచ్చారు. 50 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు.. అవార్డులు.. రివార్డులు అందుకున్నారు. బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తుగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI ) లో సత్కరించనున్నారు.

IFFI బాలయ్య 50 ఏళ్ల సినీ జర్నీ..

త్వరలో గోవాలో జరగబోతున్న ఈ సినీ వేడుకలో బాలయ్య 50 ఏళ్ల సినీ జర్నీకి జ్ఞాపకంగా IFFI ఘనంగా సత్కరించబోతుంది. ఐతే బాలయ్యతో పాటు ఇండియన్ సినీ పరిశ్రమకు 50 ఏళ్లుగా నిరంతరాయంగా కృషి చేస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ కి కూడా ఘన సత్కారాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

ఐ.ఎఫ్.ఎఫ్.ఐ వేడుక మీద ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ రజనీ, బాలకృష్ణలకు వారి 50 ఏళ్ల సినీ నట ప్రస్థానానికి గుర్తుగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ద్వారా ఘన సత్కారాన్ని చేయనున్నారు. తెలుగు సినిమాల్లో గత 50 ఏళ్లుగా బాలకృష్ణ తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. నందమూరి నట వారసుడిగా బాలయ్య ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చే సినిమాలతో అదరగొట్టేస్తున్నారు.

మరోపక్క సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా స్టైల్ కి కేరాఫ్ అడ్రస్ గా ఒక సాధారణ బస్ కండక్టర్ నుంచి వెండితెర మీద సూపర్ స్టార్ గా ఆయన ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శనీయం. సూపర్ స్టార్ రజనీ 50 ఏళ్ల సినీ జర్నీలో ఎన్నో బ్లాక్ బస్టర్స్, ఎన్నో సూపర్ హిట్లు, ఎన్నో ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసిన సినిమాలు ఉన్నాయి.

కెరీర్ అప్ అండ్ డౌన్స్ ని ఎదుర్కొని..

ఈ ఇద్దరు హీరోలు రజనీ 74 ఇయర్స్, బాలకృష్ణ 65 ఏళ్లలో యువ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా వీరు పోటీ పడుతున్నారు. సినిమాల సక్సెస్ లు ఫెయిల్యూర్స్ ని తట్టుకుని.. కెరీర్ అప్ అండ్ డౌన్స్ ని ఎదుర్కొని సినీ పరిశ్రమలో 50 ఏళ్లుగా తమ సినీ జర్నీ కొనసాగిస్తున్న రజనీ, బాలయ్య ఇద్దరికీ IFFI లో సత్కారం సినీ ప్రియులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు.

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 56వ ప్రధానోత్సవం నవంబర్ 20 నుంచి 28 వరకు జరగనున్నాయి. గోవాలో సినీ ప్రముఖుల సమక్షంలో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. IFFI ఫెస్ట్ లో భాగంగా అవార్డులు పొందిన వారితో పాటు ఈసారి సూపర్ స్టార్ రజనీకాంత్, నందమూరి బాలకృష్ణలకు కూడా భారీ స్థాయిలో ఫెలిసిటేషన్ ప్రోగ్రాం జరగబోతుంది.