రజినీకాంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారా?
అయితే ఇప్పుడు కమల్ తో సినిమా తర్వాత రజినీకాంత్.. సినిమాలకు రిటైర్మెంట్ ఇవ్వనున్నట్లు కొన్ని గంటలుగా వార్తలు వస్తున్నాయి.
By: M Prashanth | 29 Oct 2025 8:00 AM ISTకోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీని శాసిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అనేక సినిమాలు చేశారు. వాటితో ఎన్నో సూపర్ హిట్స్ ను అందుకున్నారు. తన యాక్టింగ్ తో అలరించారు. తలైవా అంటే ఒక బ్రాండ్ అని అనిపించుకున్నారు. ఏడు పదుల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు.
రీసెంట్ గా కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజినీకాంత్.. ఇప్పుడు జైలర్ 2తో బిజీగా ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన మూవీ జైలర్ కు సీక్వెల్ గా రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రంతో వచ్చే ఏడాది జూన్ 12వ తేదీన సందడి చేయనున్నారు.
అయితే జైలర్-2 తర్వాత రజినీ ఏ మూవీ చేస్తారన్నది ఇంకా క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఎందుకంటే పలువురు డైరెక్టర్స్ పేర్లు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్, సుందర్ సి దర్శకత్వంలో చెరో సినిమా రజినీకాంత్ చేస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. సుందర్ తో కచ్చితంగా వర్క్ చేస్తారని తెలుస్తోంది.
అదే సమయంలో విశ్వనటుడు కమల్ హాసన్ తో కూడా రజినీకాంత్ వర్క్ చేయనున్న సంగతి విదితమే. ఇప్పటికే ఆ విషయంపై పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. కమల్ తో కచ్చితంగా మూవీ చేస్తున్నట్లు వెల్లడించారు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా కమల్- రజినీ సినిమా ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. లోకేష్ కనగరాజ్ లేదా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తారని సమాచారం.
అయితే ఇప్పుడు కమల్ తో సినిమా తర్వాత రజినీకాంత్.. సినిమాలకు రిటైర్మెంట్ ఇవ్వనున్నట్లు కొన్ని గంటలుగా వార్తలు వస్తున్నాయి. కమల్ తో చేసే మల్టీస్టారర్.. తలైవా చివరి మూవీగా నిలుస్తుందని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది. అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు, ఫ్యాన్స్ రెస్పాండ్ అవుతున్నారు.
ఇప్పుడు వైరల్ అవుతున్న వార్తలు నిజం కాకూడదని రజినీకాంత్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇంకా కొన్నాళ్లు సినిమాలు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే రిటైర్మెంట్ ప్రకటిస్తారన్న వార్తల్లో నిజమెంతో తెలియకపోయినా నెట్టింట మాత్రం వైరల్ గా మారాయి. ఏదేమైనా రిటైర్ అవుతారన్న వార్తలపై రజినీకాంత్ క్లారిటీ ఇస్తే గానీ అసలు విషయం తెలియదు. మరి తలైవా రెస్పాండ్ అవుతారేమో చూడాలి.
