సూపర్ స్టార్ చిత్రానికి ముహూర్తం ఫిక్స్!
ఈ నేపథ్యంలో 173 గురించి ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది.
By: Srikanth Kontham | 6 May 2026 9:00 PM ISTప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ 172వ చిత్రంగా `జైలర్ 2` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న `జైలర్ 2` పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అతి త్వరలోనే రిలీజ్ తేదీ బయటకు రానుంది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ 173వ చిత్రాన్ని పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో 173 గురించి ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు జులై నెల నుండి ప్రారంభం కానున్నాయని సమాచారం. కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఈ సినిమా దర్శకుడి విషయంలో నిన్నటి వరకూ సందిగ్గదంలో ఉన్నా? తాజాగా క్లారిటీ వచ్చేసింది. సుందర్ .సి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అలాగే శిబి చక్రవర్తి కూడా ప్రాజెక్ట్ లో భాగం కాలేదు. దీంతో ఆ ఛాన్స్ `ఓ మై కడవులే` ఫేమ్ అశ్వత్ మారిముత్తు అయ్యాడు. అశ్వత్ వినిపించిన కథ రజనీకాంత్‌కు బాగా నచ్చడంతో ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జులైలో చిత్రాన్ని పట్టాలెక్కించాలని సన్నాహాలు చేస్తున్నారు.
రజనీకాంత్ కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. అశ్వత్ మారిముత్తు వంటి యువ దర్శకుడితో జతకట్టడంతో ఈ సినిమాలో సరికొత్త మేకోవర్‌లో కనిపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. కమల్ హాసన్ నిర్మాణం, రజనీకాంత్ నటన అంటే బాక్సాఫీస్ వద్ద మరో జైలర్ లాంటి మ్యాజిక్ రిపీట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ కాంబినేషన్ అనౌన్స్‌మెంట్ నుండే ట్రేడ్ వర్గాల్లో భారీ చర్చ మొదలైంది.ఈ చిత్రంలో ఇతర నటీనటులు , సాంకేతిక నిపుణుల గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అయితే అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ టాక్. రజనీకాంత్ నటిస్తోన్న సినిమాలకు ఈ మధ్య కాలంలో వరుసగా అనిరుద్ సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే. `జైలర్`, `కూలీ` తాజా చిత్రం `జైలర్ 2`కి కూడా ఆయనే సంగీతం అందిస్తున్నారు. మ్యూజికల్ గా ఆ సినిమాలు మంచి విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో 173వ చిత్రానికి కూడా అతడినే రిపీట్ చేయాలని రజనీ భావిస్తున్నారు.
ఈ చిత్రాన్ని కూడా ఇదే ఏడాది చివరకల్లా టాకీ పార్ట్ పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి లేదా సమ్మర్ రేసులో దింపాలని మేకర్స్ భావిస్తున్నారు. సూపర్ స్టార్ ఇమేజ్‌కు తగినట్లుగా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా సినిమా ఉండబోతోందని తెలు స్తోంది. అశ్వత్ మారిముత్తు తనదైన శైలిలో యూత్ ,ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించేలా కథను సిద్ధం చేశారట. రజనీకాంత్ మార్క్ మ్యానరిజమ్స్ , అశ్వత్ మేకింగ్ స్టైల్ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
