Begin typing your search above and press return to search.

అసలేమవుతోంది రాజేంద్ర? మళ్లీ బహ్మీపై ఎందుకలా?

టాలీవుడ్ సీనియర్ నటుడు, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కొంతకాలంగా తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   30 Nov 2025 10:25 AM IST
అసలేమవుతోంది రాజేంద్ర? మళ్లీ బహ్మీపై ఎందుకలా?
X

టాలీవుడ్ సీనియర్ నటుడు, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కొంతకాలంగా తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. పలు సినీ ఈవెంట్స్ లో చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. మాట్లాడే తీరు, అసభ్య పదజాలంతో ట్రోలింగ్ బారినపడుతున్నారు. తాజాగా మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది.

స:కుటుంభానాం మూవీ ఈవెంట్ రీసెంట్ గా జరగ్గా.. ఆ కార్యక్రమానికి రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు. ఆయనతోపాటు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కూడా విచ్చేశారు. అయితే ముందుగా బ్రహ్మీ మాట్లాడాక.. రాజేంద్రప్రసాద్ మైక్ అందుకున్నారు. ఆ సమయంలో మళ్లీ నోరు జారారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత తాను మాట్లాడుతున్నట్లు చెప్పారు.

అప్పుడు బ్రహ్మానందం.. ఏం మాట్లాడినా మీ శిష్యులమే కదా.. ఎంతవారైనా మీ శిష్యులమే కదా అన్నారు. దీంతో వెంటనే రాజేంద్రప్రసాద్.. నువ్వు ముసలి ము** కొడుకు అంటూ ఒక్కసారిగా నోరు జారారు. అప్పుడు బ్రహ్మీ ఎవరని అంటున్నారని అడగ్గా.. నేనే అంటూ రాజేంద్రప్రసాద్ కవర్ చేశారు. కానీ ఆ వీడియో.. సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.

దీంతో ఇప్పుడు నెటిజన్లు, సినీ ప్రియుల్లో కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకిలా రాజేంద్రా.. అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఒకప్పుడు ఎంతో పరిణితితో మాట్లాడే వ్యక్తి.. ఇప్పుడు ఎందుకలా వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. సహచర సీనియర్ నటుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగునా అని అడుగుతున్నారు.

అయితే రాజేంద్రప్రసాద్.. ఇప్పటికే ఓ ఇంటర్వూలో అసభ్య పదజాలం మాట్లాడటం పై స్పందించిన విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో మరోసారి నోరు జారకుండా జాగ్రత్తలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు మళ్లీ బహ్మానందంపై నోరు జారడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు రాజేంద్ర ప్రసాద్.

ఇక రాజేంద్రప్రసాద్ కెరీర్ విషయానికొస్తే.. కొన్నేళ్లుగా ఆయన ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కొన్ని వందల చిత్రాల్లో భాగమయ్యారు. తన యాక్టింగ్ తో ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. వివిధ సినిమాల్లో ప్రస్తుతం యాక్ట్ చేస్తున్నారు. కానీ కెరీర్ పరంగా కాకుండా.. ఎప్పటికప్పుడు తన వ్యాఖ్యలతోనే వార్తల్లో నిలుస్తున్నారు.