ఒక హిట్ తో ఏకంగా అరడజను లైన్ లో పెట్టేశారా?
By: Sravani Lakshmi Srungarapu | 20 Sept 2025 4:00 AM ISTజీవితంలో ఎవరికెప్పుడు సక్సెస్ వస్తుందో, ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో ఎవరం చేప్పలేం. అందుకే లైఫ్ ఈజ్ అన్‌ప్రెడిక్టబుల్ అంటుంటారు. సినీ ఇండస్ట్రీలో కూడా అంతే. ఎవరెప్పుడు సక్సెస్ అవుతారో, ఎవరికెప్పుడు ఎటు నుంచి అవకాశాలొస్తాయో ఎవరూ చెప్పలేం. కొందరికి కెరీర్ స్టార్టింగ్ నుంచే మంచి అవకాశాలొస్తే, కొందరు వాటి కోసం ఎంతో కాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది.
ఎన్నో సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రల్లో అలరించిన రాజీవ్
ఇంకొందరికైతే కెరీర్ స్టార్టింగ్ లో మంచి అవకాశాలు అందుకుని కొంత కాలంగా టాలెంట్ కు తగ్గ ఛాన్సులు రాక ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. అలాంటి వారికి అనుకోకుండా చేసిన ఓ సినిమా వల్ల తర్వాత ఎన్నో అవకాశాలొస్తాయి. టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు రాజీవ్ కనకాల విషయంలో కూడా ఇంచుమించు అలానే జరిగింది. రాజమౌళి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి నటుడిగా ఎదిగిన రాజీవ్, ఎన్నో సినిమాల్లో గుర్తుండిపోయే క్యారెక్టర్లలో నటించారు.
రీసెంట్ గా లిటిల్ హార్ట్స్ తో సక్సెస్
రాజీవ్ ఇప్పటివరకు దాదాపు 100 సినిమాల్లో నటించి ఆడియన్స్ ను మెప్పించి ఉంటారు. కేవలం సినిమాల్లోనే కాకుండా ఎన్నో సీరియల్స్ లో కూడా రాజీవ్ నటించారు. అయితే రాజీవ్ కు ఈ మధ్య గతంలో లాగా అవకాశాలు రావడం లేదు. అలాంటి టైమ్ లో ఆయన నటించిన లిటిల్ హార్ట్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అందుకుని సూపర్ హిట్ గా నిలిచింది.
సెకండ్ ఇన్నింగ్స్‌లా అనిపిస్తుంది
లిటిల్ హార్ట్స్ విజయం వల్ల తన లైఫ్ తిరిగి బిజీగా మారిందని, గోపాలరావు అంకుల్ గా ఈ సినిమాతో తనకు మరింత గుర్తింపు దక్కిందని రీసెంట్ గా రాజీవ్ కనకాల లిటిల్ హార్ట్స్ సక్సెస్ ఈవెంట్ లో చెప్పారు. లిటిల్ హార్ట్స్ సక్సెస్ తనకు సెకండ్ ఇన్నింగ్స్ లాగా అనిపిస్తుందని, ఈ సినిమాలోని క్యారెక్టర్ వల్ల తాను మరో అరడజనుకి పైగా సినిమాలను ఓకే చేశానని చెప్పారు. మొత్తానికి రాజీవ్ ఒకప్పటిలానే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తిరిగి ఫామ్ లోకి వచ్చి వరుస సినిమాలను లైన్ లో పెట్టారన్నమాట.
