Begin typing your search above and press return to search.

ఓటీటీలో అందరూ చూశాక రీమేక్ ఎందుకు?

ఓటీటీలు క్రేజ్ సంపాదించుకున్నాక సినీ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   21 Sept 2025 3:00 PM IST
ఓటీటీలో అందరూ చూశాక రీమేక్ ఎందుకు?
X

ఓటీటీలు క్రేజ్ సంపాదించుకున్నాక సినీ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఓటీటీలు.. అన్ని భాషలకు సంబంధించిన కంటెంట్ ను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. దీంతో ఓటీటీ లవర్స్.. అన్ని లాంగ్వేజెస్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంట్లోనే చక్కగా.. తమకు నచ్చిన కంటెంట్ ను చూస్తూ చిల్ అవుతున్నారు.

అయితే ఓటీటీలో అందరూ చూసేసిన ఓ మూవీ.. ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. అది కూడా టాలీవుడ్ యాంగ్రీ స్టార్ రాజశేఖర్.. రీమేక్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కొంతకాలంగా సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మంచి స్కోప్ ఉన్న పాత్రలతో పాటు హీరోగాను పర్ఫెక్ట్ కథ కోసం వెయిట్ చేస్తున్నారు.

అదే సమయంలో రీసెంట్ గా తమిళంలో గత ఏడాది రిలీజ్ అయిన లబ్బర్ పందు మూవీ రీమేక్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా.. మంచి విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్ తో కూడిన స్పోర్ట్స్ డ్రామా.. 2024లో ఉత్తమ చిత్రాల జాబితాలో నిలిచింది.

ఇప్పుడు ఆ సినిమా రీమేక్ రైట్స్‌ ను దక్కించుకున్న రాజశేఖర్.. మూవీలో కీలక పాత్రలో నటిస్తారని సమాచారం. జీతూ పాత్రలో రాజశేఖర్ నటించాలని చూస్తున్నారట. యంగ్ హీరో కోసం ఆయన అన్వేషణ సాగిస్తున్నట్లు టాక్ వినిపించగా.. 35 ఫేమ్ విశ్వ హీరోగా యాక్ట్ చేస్తున్నట్లు ఇప్పుడు తెలుస్తోంది. హీరోయిన్ గా రాజశేఖర్ కుమార్తె కనిపించనున్నట్లు వినికిడి.

శివాత్మిక, శివానీ.. ఇద్దరిలో ఎవరూ ఒకరు హీరోయిన్ గా కనిపించనున్నారన్న మాట. ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేసే డైరెక్టర్ కోసం కూడా రాజశేఖర్ వెతుకుతున్నట్లు సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో ఇప్పుడు ఆ మూవీ కోసం సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే తమిళ వెర్షన్ జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉందన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే చాలా మంది ఆ సినిమాను చూశారు. తెలుగు ఆడియెన్స్ కూడా సబ్ టైటిల్స్ తో చిత్రాన్ని చూశారు. ఇప్పటికే చాలా మంది రివ్యూస్ కూడా ఇచ్చారు. దీంతో తెలుగులో మెజారిటీ సినీ లవర్స్ చూసేశారు.. అందరూ చూశాక మరి రీమేక్ ఎందుకని క్వశ్చన్ చేస్తున్నారు. దీంతో రీమేక్ చేసి థియేటర్లలో రిలీజ్ చేస్తే ప్రేక్షకులు ఎంతమేర ఆదరిస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్కే.