లాంగ్ గ్యాప్ తర్వాత రాజశేఖర్.. విలన్ గా భారీ హిట్ పడితే..
టాలీవుడ్ లో యాంగ్రీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాజశేఖర్ మరోసారి పవర్ ఫుల్ రోల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారని ప్రచారం జరుగుతోంది.
By: M Prashanth | 1 Jun 2026 7:00 PM ISTటాలీవుడ్ లో యాంగ్రీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాజశేఖర్ మరోసారి పవర్ ఫుల్ రోల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారని ప్రచారం జరుగుతోంది. చాలా కాలం తర్వాత విలన్ పాత్రలో కనిపించబోతున్నారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. విజయ్ దేవరకొండ హీరోగా, రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్ రౌడీ జనార్దన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఆ చిత్రంలో హీరోకు గట్టి పోటీ ఇచ్చే విలన్ పాత్రకు స్పెషల్ ఇంపార్టెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కథలో కీలక మలుపులకు కారణమయ్యే ఆ పాత్ర కోసం మూవీ టీమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం.
ఆ రోల్ కోసం రాజశేఖర్ ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. కథలోని ఆ రోల్ స్కోప్, యాక్టింగ్ కు ఉన్న అవకాశాలు ఆయనను ఆకట్టుకున్నాయని టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఆ వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే రాజశేఖర్ కెరీర్ ను పరిశీలిస్తే ఆయన కేవలం హీరోగానే కాకుండా విభిన్న పాత్రల్లోనూ తనదైన ముద్ర వేశారు. కెరీర్ స్టార్టింగ్ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి ప్రశంసలు అందుకున్నారు.
ఆ తర్వాత హీరోగా వరుస విజయాలు సాధించిన ఆయన, కథ డిమాండ్ చేస్తే భిన్నమైన పాత్రలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారు. అయితే పూర్తి స్థాయి విలన్ పాత్రలో కనిపించి చాలా కాలం కావడంతో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ చర్చకు దారితీస్తోంది. ఇటీవల తెలుగు సినిమాల్లో స్ట్రాంగ్ విలన్ రోల్స్ కు మంచి ఆదరణ లభిస్తోంది. హీరోతో సమానంగా గుర్తుండిపోయే విలన్ పాత్రలు సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రాజశేఖర్ ఎక్స్పీరియన్స్, ఆయన నటనలో కనిపించే ఇంటెన్సిటీ మూవీకి ప్లస్ గా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా సినిమాలో మాస్ రోల్ లో కనిపించనున్నట్లు సమాచారం. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథలో హీరో-విలన్ మధ్య జరిగే ఇంటరాక్షన్ మెయిన్ అట్రాక్షన్ గా నిలవనుందని తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ ఎనర్జీకి రాజశేఖర్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తోడైతే ప్రేక్షకులకు హై వోల్టేజ్ ఎంటర్టైన్మెంట్ అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో సినిమా రిజల్ట్ రాజశేఖర్ కెరీర్ కు కూడా కీలకంగా మారొచ్చు. అనుకున్నట్లుగా రౌడీ జనార్దన భారీ విజయం సాధించి, రాజశేఖర్ పాత్రకు ప్రశంసలు దక్కితే ఆయనకు మరిన్ని పవర్ ఫుల్ విలన్, క్యారెక్టర్ రోల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత కొంతకాలంగా సరైన పాత్ర కోసం ఎదురుచూస్తున్న రాజశేఖర్ కు ఇది కొత్త ఛాన్సులు తీసుకొస్తుందని టాక్ వినిపిస్తోంది.
ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తే రాజశేఖర్ కూడా ఫ్యూచర్ లో ఇలాంటి విభిన్న పాత్రలపై మరింత ఆసక్తి చూపించే అవకాశం ఉంది. ఏదేమైనా ఇప్పుడు అనౌన్స్మెంట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నప్పటికీ.. చాలా కాలం తర్వాత రాజశేఖర్ ఒక స్ట్రాంగ్ విలన్ పాత్రలో కనిపించనుండడం సినిమాపై అంచనాలను పెంచుతోంది. మరి ఆ మూవీ ఆయన కెరీర్ కు కొత్త మలుపు తీసుకువస్తుందా లేదా అనేది విడుదల తర్వాతే తేలనుంది.
