ఛాన్స్ ఇక చిరంజీవి చేతుల్లోనే!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దశాబ్దాల క్రితం పోటాపోటీగా సినిమాలు చేసి బాక్సాఫీస్ వద్ద తమకంటూ ప్రత్యేక సామ్రా జ్యాన్ని నిర్మించుకున్న హీరోలు మెగాస్టార్ చిరంజీవి - యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్.
By: Srikanth Kontham | 16 April 2026 1:17 PM ISTతెలుగు చలన చిత్ర పరిశ్రమలో దశాబ్దాల క్రితం పోటాపోటీగా సినిమాలు చేసి బాక్సాఫీస్ వద్ద తమకంటూ ప్రత్యేక సామ్రా జ్యాన్ని నిర్మించుకున్న హీరోలు మెగాస్టార్ చిరంజీవి - యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్. అయితే కాలక్రమంలో చిరంజీవి తన ఇమేజ్ ను మరింత రెట్టింపు చేసుకోగా..రాజశేఖర్ మాత్రం రేసులో వెనుకబడ్డారు. అయినా చాలా కాలం పాటు సోలోగానే పరిశ్రమలో కొనసాగారు. ఈ మధ్య కాలంలో కెరీర్ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. హీరో పాత్రలను వదిలేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా..ప్రతి నాయకుడిగా నటించడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో అవకాశం వస్తే విలన్ గా నటించాలని ఉందని రాజశేఖర్ ఓపెన్ అయ్యారు.
వాస్తవానికి వీరిద్దర్నీ ఒకే తెరపై చూడాలని అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి సినిమాలో రాజశేఖర్ పోషించేది సమానమైన హీరో పాత్ర? మరో పాత్ర అన్నది పక్కనబెడితే? ఆ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తే బాగుంటుని తెలుగు ప్రేక్షకులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. కానీ ఆ కోరిక ఇంత వరకూ నెర వేరవేరలేదు.
తాజాగా రాజశేఖర్ ప్రకటన అభిమానులందరిలో సంతోషాన్ని నింపింది. చిరంజీవి సినిమాలో సరైన ప్రాధాన్యత ఉన్న విలన్ పాత్ర దొరికితే నటించడానికి తాను సిద్ధమని మనసులో మాట బయటపెట్టారు.
సాధారణంగా హీరోగా రాణించిన వారు విలన్ పాత్రలు చేయడానికి కొంత సంకోచిస్తుంటారు. కానీ ప్రస్తుత ట్రెండ్ మారింది. జగపతిబాబు, అరవింద్ స్వామి వంటి వారు విలన్లుగా మారి సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్నారు. రాజశేఖర్ కూడా తన ఇమేజ్‌కు భిన్నంగా కొత్త తరహా పాత్రలు చేయాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా చిరంజీవి వంటి అగ్ర హీరో సినిమాలో శక్తివంతమైన ప్రతినాయకుడిగా కనిపిస్తే అది తన కెరీర్‌కు సరికొత్త మలుపు అవుతుందని ఆయన భావిస్తున్నారు. ఇక చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటున్నారు.
ఆయన సినిమాలో విలన్ పాత్ర ఎంత బలంగా ఉంటే? హీరో ఎలివేషన్ అంత బాగా వస్తుందని దర్శకులు నమ్ము తుంటారు. ఇప్పటికే చిరంజీవి సినిమాల్లో ఇతర భాషల నటులు విలన్లుగా కనిపిస్తున్నారు. అయితే రాజశేఖర్ వంటి సీనియర్ హీరో ఆ పాత్ర పోషిస్తే వచ్చే ఇంపాక్ట్ , క్రేజ్ మామూలుగా ఉండదు. వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ పోటీ సినిమా స్థాయిని పెంచుతుందనడంలో సందేహం లేదు. అయితే ఆ బాధ్యత దర్శకులపైనే ఉంది. రాజశేఖర్ సిద్ధంగా ఉన్నా? ఆయన వ్యక్తిత్వానికి , నటనకు తగినట్లుగా పవర్‌ఫుల్ పాత్రను డిజైన్ చేయడం అంత ఈజీ కాదు.
పేరు కోసం కాకుండా, కథలో విలన్ పాత్రకు సరైన ప్రాధాన్యత ఉంటేనే కాంబినేషన్ వర్కవుట్ అవుతుంది. మెగాస్టార్‌ను డీకొట్టే స్థాయిలో మొండితనం ఉన్న పాత్రను రాజశేఖర్ కోసం సృష్టిస్తే? అది వెండితెరపై ఒక అద్భుతం అవుతుంది. రాజశేఖర్ కు అవకాశం ఇవ్వడంలో చిరంజీవి ఎంత మాత్రం సంశయించరు.
