Begin typing your search above and press return to search.

యాక్టింగ్ ఇష్ట‌మని చెప్తే ఎగ‌తాళి చేస్తార‌ని చెప్ప‌లేదు

తెలుగు సినీ పరిశ్రమలో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజ‌శేఖ‌ర్ తాజాగా చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   10 April 2026 5:00 AM IST
యాక్టింగ్ ఇష్ట‌మని చెప్తే ఎగ‌తాళి చేస్తార‌ని చెప్ప‌లేదు
X

తెలుగు సినీ పరిశ్రమలో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజ‌శేఖ‌ర్ తాజాగా చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన కెరీర్‌ ప్రారంభం గురించి, ముఖ్యంగా తనలో ఉన్న ఒక వ్యక్తిగత సమస్య గురించి ఆయన వెల్లడించిన విషయాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజశేఖర్, చిన్నప్పటి నుంచే తాను నటుడిగా మారాలని కలగన్నానని చెప్పారు. అయితే ఆ కలను ఎప్పుడూ బయట పెట్టలేదని, కారణం తనకు ఉన్న నత్తి సమస్య అని వెల్లడించారు.

ఎవ‌రికీ చెప్ప‌లేదు

త‌న‌కు యాక్ట‌ర్ కావాలనే కోరిక చాలా చిన్నప్పటి నుంచే ఉంద‌ని, కానీ తాను ఆ విష‌యాన్ని ఎవరికీ చెప్పేవాడిని కాద‌ని, ఎందుకంటే నాకు నత్తి ఉండేది. ఈ నత్తితో నేను యాక్టర్ అవుతానని చెప్తే, సరిగ్గా మాట్లాడలేని నువ్వు యాక్టింగ్ ఎలా చేస్తావ్? అని ఎగతాళి చేస్తారని భయపడ్డాన‌ని ఆయన స్పష్టం చేశారు. ఈ మాటలు వినగానే, ఒక స్టార్ హీరోగా ఎదిగిన ఆయన వెనుక ఉన్న క‌ష్టాల గురించి తెలుస్తోంది. సాధారణంగా ఒక నటుడికి స్పష్టమైన మాటతీరు ఎంత ముఖ్యమో తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో నత్తి సమస్యతో బాధపడుతూ కూడా నటుడిగా ఎదగాలని టార్గెట్ ను పెట్టుకుని, దాన్ని అఛీవ్ చేయ‌డం నిజంగా ఇన్సిపిరేష‌న‌ల్ విషయం.

మ‌న‌సులోనే పెట్టుకున్నా

తన సమస్యను ఎవరికీ చెప్పకుండా, లోప‌లే దాచుకొని, సరైన సమయం కోసం ఎదురుచూసిన రాజశేఖర్ చివరకు సినీ రంగంలో అడుగుపెట్టి, తన ప్రతిభతో ప్రేక్షకులను మెప్పించారు. యాక్టింగ్ లోకి వ‌చ్చేవ‌ర‌కు కూడా త‌న మ‌న‌సులోని కోరిక‌ను తానెవ్వ‌రికీ చెప్ప‌లేద‌ని ఆయ‌న తెలిపారు. అంకుశం, ఆహుతి, మగాడు లాంటి సినిమాలతో ఆయన స్టార్‌డమ్‌ను అందుకున్నారు. ముఖ్యంగా యాక్షన్ పాత్రల్లో ఆయన చూపిన తీవ్రత, ఆవేశం ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అభిమానాన్ని సంపాదించాయి.

బైక‌ర్ తో సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు

కేవలం హీరోగా మాత్రమే కాకుండా, వైవిధ్యమైన పాత్రలను ఎంచుకోవడంలో కూడా ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. కొంతకాలం విరామం తర్వాత, ఇటీవల విడుదలైన బైకర్ సినిమాలో కీలక పాత్రలో నటించి, తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఈ సినిమాలో ఆయన నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఇప్పటికే ఈ సినిమా తర్వాత ఆయనకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సపోర్టింగ్ రోల్స్‌లో ఆయనకు కొత్త అవకాశాలు దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.