డ్రీమ్ అయినా..లైవ్ అయినా ముద్దొద్దు సామీ!
రాజశేఖర్ ప్రధాన పాత్రలో సముద్ర దర్శకత్వంలో తెరకెక్కిన `సింహరాశి` అప్పట్లో పెద్ద విజయం సాధించిన చిత్రం.
By: Srikanth Kontham | 28 Aug 2025 7:00 AM ISTరాజశేఖర్ ప్రధాన పాత్రలో సముద్ర దర్శకత్వంలో తెరకెక్కిన 'సింహరాశి' అప్పట్లో పెద్ద విజయం సాధించిన చిత్రం. మోహన్ బాబుకు 'పెదరాయుడు', చిరంజీవికి 'హిట్లర్' విజయాల తరహాలో రాజశేఖర్ కెరీర్ సింహారాశి అలాంటి ఐకానిక్ హిట్ గా నిలిచింది. రాజశేఖర్ సినిమాలో స్థానికంగా 'పెద రాయుడు' పాత్ర పోషిస్తాడు. ఇందులో హీరో పాత్ర స్త్రీ అంటే గొప్ప గౌరవమర్యాదలతో కూడి ఉంటుంది. తన జీవితంలో తల్లి, సమాజంపై తప్ప ఇంకెలాంటి ప్రేమలుండవ్ అనే స్ట్రాంగ్ రోల్. ఓ రకంగా చెప్పాలంటే అదో సన్యా పాత్ర.
హీరోయిన్ సాక్షి శివానంద్ లవ్ ప్రపోజల్ పెట్టినా? రాణి రాణి అంటూ నర్తకి లొంగ దీసుకోవాలని చూసినా? కరగని శిల్పంలాంటి రోల్ అది. అయితే ఓ పాటలో కొరియోగ్రాఫర్ హీరోయిన్ ని ముద్దు పెట్టాలని సజ్జెస్ట్ చేస్తాడుట. అందుకు రాజశేఖర్ కూడా సిద్దంగానే ఉన్నాడుట. సన్నివేశాల్లో హీరోయిన్ తో ఎలాంటి రొమాంటిక్ సీన్స్ లేవు. కనీసం పాటలో నైనా ఉంటుందని ఆశించారుట. కానీ అందుకు దర్శకుడు సముద్ర ఎంత మాత్రం ఒప్పుకోలేదుట. లైవ్ అయినా డ్రీమ్ లో వచ్చే పాట అయినా? సరే హీరోయిన్ తో రొమాంటిక్ సీన్ ఉంది? అంటే కథ మారి పోతుందని...సినిమా విలువ తగ్గిపోతుందని ఒప్పుకోలేదుట
హీరో పాత్ర అంతే స్వచ్ఛంగా ఉండాలని కోరారుట. దీంతో రాజశేఖర్ అప్పుడే అలా ఉంటే తన ఫ్యాన్స్ ఒప్పుకోరని ఓ లాజిక్ ప్లే చేసారుట. ఎలాగైనా ముద్దు సీన్ లో నటిస్తానని పట్టుబట్టారుట. కానీ రాజశేఖర్ దండం పెట్టి వద్దు వదిలేయండి విసింగించొద్దు అని కాస్త సీరియస్ అయ్యారుట. ఆ సమయంలో జీవిత కూడా సముద్రకు మద్దతుగా నిలిచారట. చాలా సినిమాల్లో నటించారు కదా. డైరెక్టర్ ఏదో కూతుహల పడుతున్నాడు. ఈసారికి ఆయన మాట వినండని బుజ్జగించారుట.
దీంతో డైరెక్టర్ ఇబ్బందిని గ్రహించి రాజ శేఖర్ కూడా ఛాన్స్ తీసుకోలేదని రివీల్ చేసారు. దీంతో ఆ పాటను హీరోయిన్ తో ఎలాంటి టచ్చింగ్ సీన్స్ లేకుండానే పూర్తి చేసినట్లు తెలిపారు. అదీ సంగతి. ఇక రాజశేఖర్ రెండేళ్లగా సినిమాలు చేయని సంగతి తెలిసిందే. ఎక్స్ ట్రా ఆర్డీనరీ మ్యాన్ తో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినా తదుపరి కొనసాగించలేదు. అవకాశాలు వస్తున్నా? నచ్చిన రోల్స్ కాకపోవడంతో నో చెబుతున్నారు.
