యాంగ్రీ స్టార్ ఫ్యామిలీ స్టార్ లా బిజీ అవుతారా?
తాజాగా రిలీజ్ అయిన `బైకర్` విజయం సాధించడంతో రాజశేఖర్ రోల్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.
By: Srikanth Kontham | 6 April 2026 4:00 AM ISTతెలుగు చలన చిత్ర పరిశ్రమలో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ప్రస్తానం గురించి చెప్పాల్సిన పనిలేదు. దశాబ్దాల పాటు హీరోగా ఎన్నో చిత్రాలతో మెప్పించారు. తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఇలా కొంత కాలం పాటు ఆయన జమానా నడించింది. హీరోగా అవకాశాలు తగ్గిన క్రమంలో? సొంత బ్యానర్లో కూడా చాలా సినిమాలు నిర్మించారు. వాటిలో కొన్ని విజయాలతో పాటు వైఫల్యాలున్నాయి. ప్రస్తుతం మాత్రం టాలీవుడ్ లో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. నితిన్ హీరోగా నటించిన `ఎక్స్ ట్రా ఆర్డీనరీ మ్యాన్` తో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినా? ఆ సినిమా వైఫల్యంతో రీచ్ అవ్వలేదు.
తాజాగా రిలీజ్ అయిన `బైకర్` విజయం సాధించడంతో రాజశేఖర్ రోల్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దీంతో అధికారికంగా రాజశేఖర్ సెకెండ్ ఇన్నింగ్స్ షురూ అయింది. నటనలో ఆయన చూపిన పరిణతి, గంభీరమైన ఆహార్యం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.రాజ శేఖర్‌కు ఉన్న ప్రత్యేకమైన వాయిస్ బేస్ , స్క్రీన్ ప్రెజెన్స్ పెద్ద హీరోల సినిమాల్లో పవర్‌ఫుల్ పాత్రలకు సరిగ్గా సరిపోతాయి. ముఖ్యంగా మాస్ సినిమాల్లో తండ్రి పాత్రలు, పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్స్ లేదా ప్రతినాయక ఛాయలున్న పాత్రల్లో ఆయన కనిపిస్తే ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది.
ఒకప్పుడు అగ్ర హీరోగా వెలిగిన నటులు ఇలాంటి మార్పును అంగీకరించడం అంత సులభం కాదు. కానీ రాజశేఖర్ వాస్తవాన్ని గ్రహించి నటుడిగా తన ప్రయాణాన్ని కొనసాగించడానికి సిద్ధపడటం శుభపరిణామం. ఇది కేవలం ఆయనకు మాత్రమే కాకుండా, టాలీవుడ్ పరిశ్రమకు కూడా ఒక మంచి సీనియర్ నటుడు అందుబాటులోకి వచ్చిన ట్లవుతుంది. వైవిధ్యమైన పాత్రలతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను మరింత కలర్‌ఫుల్‌గా మార్చుకునే అవకాశం ఆయన చేతుల్లోనే ఉంది. టాలీవుడ్‌లో హీరోగా ఇమేజ్ తగ్గిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్న నటుడు జగపతి బాబు.
`లెజెండ్` సినిమాతో విలన్‌గా మారి సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా బిజీ అయ్యారు.రాజశేఖర్ క్లిక్ అయితే జగపతి బాబుకు పోటీగానూ మారే అవకాశం ఉంది. జగపతి బాబు తరహాలోనే పరిశ్రమలో బలమైన వర్సటైల్ నటుడిగా స్థిరపడతారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి యాంగ్రీ స్టార్ నుండి వర్సటైల్ స్టార్ గా ఆయన ప్రయాణం ఎలా సాగుతుందో చూడాలి. రాజశేఖర్ కూడా ఇంత కాలం పెదవి దాటని మాటని ఈ మధ్యనే దాటించారు. మంచి పాత్రలు పోషించడానికి తానెప్పుడు ముందుటానని వెల్లడించిన నేపథ్యంలో కొత్త అవకాశాలు ఎంత మంది కల్పిస్తారో చూడాలి. ఇప్పటికే రెండు..మూడు ప్రాజెక్ట్ లు ఉన్నట్లు యాంగ్రీస్టార్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే.
