Begin typing your search above and press return to search.

'మ‌గాడు' అత‌డు హీరోనా? క్యారెక్ట‌ర్ ఆర్టిస్టా?

యాంగ్రీ స్టార్ రాజ‌శేఖ‌ర్ సెకెండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే. నితిన్ హీరోగా న‌టించిన `ఎక్స్ ట్రాడ‌నరీ మ్యాన్` లో ఐజీ విజ‌య్ చ‌క్ర‌వ‌ర్తి పాత్ర‌తో కొత్త ప్ర‌యాణం మొద‌లు పెట్టారు.

By:  Srikanth Kontham   |   1 April 2026 6:00 PM IST
మ‌గాడు అత‌డు హీరోనా? క్యారెక్ట‌ర్ ఆర్టిస్టా?
X

యాంగ్రీ స్టార్ రాజ‌శేఖ‌ర్ సెకెండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే. నితిన్ హీరోగా న‌టించిన `ఎక్స్ ట్రాడ‌నరీ మ్యాన్` లో ఐజీ విజ‌య్ చ‌క్ర‌వ‌ర్తి పాత్ర‌తో కొత్త ప్ర‌యాణం మొద‌లు పెట్టారు. ఆ సినిమా ప్లాప్ అవ్వ‌డంతో రాజ‌శేఖ‌ర్ పాత్ర పెద్ద‌గా హైలైట్ కాలేదు. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ హీరోగా న‌టిస్తోన్న `బైక‌ర్` చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ప్ర‌చారంలో భాగంగా మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యాన్ని రాజ‌శేఖ‌ర్ రివీల్ చేసారు. `బైక‌ర్` తో పాటు మ‌రో రెండు, మూడు సినిమాల్లో కూడా రాజ‌శేఖ‌ర్ న‌టిస్తున్న‌ట్లు తెలిపారు.

అందులో `మ‌గాడు` అనే చిత్రం ఒక‌టుంది. ఈ చిత్రానికి ప‌వ‌న్ సాదినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే 80 శాతం కూడా పూర్త‌యింద‌ని తెలిపారు. అయితే ఇందులో రాజ‌శేఖ‌ర్ హీరో పాత్ర పోషిస్తున్నారా? కీల‌క పాత్ర పోషిస్తున్నారా? అన్న‌ది మాత్రం క్లారిటీ లేదు. అలాగే ఈ సినిమా వివ‌రాలేవి ఇంత వ‌ర‌కూ అధికారికంగా లేవు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ సాదినేని దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా `ఆకాశంలో ఒక తార` అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా వివ‌రాలే నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. `మ‌గాడు` అనే సినిమా చేస్తున్నారు? అన్న సంగ‌తి రాజ‌శేఖ‌ర్ రివీల్ చేసే వ‌ర‌కూ తెలియ‌దు.

దీంతో ఈసినిమా ఆకాశంలో ఒక తార కంటేముందే క‌మిట్ అయిన చిత్రంగా ఊహాగానాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. బ‌హుశా అనివార్య కార‌ణాల‌తో డిలే అవుతోన్న ప్రాజెక్ట్ గా తెలుస్తోంది. అలాగే `మ‌గాడు` టైటిల్ తో రాజ‌శేఖ‌ర్ హీరోగా ఓ సినిమా కూడా చేసారు . మధు దర్శకత్వం వహించిన మగాడు 1990లో విడుదలైంది. ఇందులో రాజశేఖర్ తోపాటు జీవిత, లిస్సీ, మురళి మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 1988 లో వచ్చిన మలయాళ చిత్రం `మూన్నం మురా` కు రీమేక్. ఇందులో ప‌వ‌ర్ పుల్ పాత్ర‌తో రాజశేఖ‌ర్ ఆద్యంతం అల‌రిస్తారు.

సినిమా మంచి విజ‌యం సాధించింది. ఈ సినిమాతో రాజశేఖర్ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నారు. అలాంటి టైటిల్తో మ‌ళ్లీ రాజశేఖ‌ర్ సినిమా చేస్తున్నారంటే? అంటే అది హీరో రోల్ అయి ఉంటుంద‌ని కొంత మంది భావిస్తున్నారు. మ‌రి హీరో రోలా? లేక కీల‌క పాత్ర‌పోషిస్తున్నారా? అన్న‌ది క్లారిటీ రావ‌డానికి మ‌రింత స‌మ‌యం ప‌డుతుంది. రాజశేఖర్ తిరిగి తన సత్తా చాటడానికి ఎంతో శ్రమిస్తున్నారు. తన కటౌట్‌కు సరిపోయే యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు, నటనకు ఆస్కారం ఉన్న బ‌ల‌మైన పాత్ర‌లు పోషించాల‌ని ఆస‌క్తిగా ఉన్నారు.