Begin typing your search above and press return to search.

సీనియర్ స్టార్.. రిస్క్ అని తెలిసినా సరే..?

ఐతే ఓటీటీలో ఆల్రెడీ అందరు చూసిన లబ్బర్ పందు సినిమాను మళ్లీ తెలుగులో రీమేక్ చేయాలని అనుకోవడం రిస్క్ అనే చెప్పొచ్చు.

By:  Ramesh Boddu   |   18 Nov 2025 12:00 PM IST
సీనియర్ స్టార్.. రిస్క్ అని తెలిసినా సరే..?
X

సీనియర్ స్టార్ హీరో యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లు లేక సతమతమవుతున్నారు. దాదాపు కెరీర్ అయిపోయింది అనుకునే టైం లో ఆయన మళ్లీ కొన్ని స్పెషల్ పాత్రల్లో సర్ ప్రైజ్ చేస్తున్నారు. శర్వానంద్ హీరోగా వస్తున్న బైకర్ సినిమాలో రాజశేఖర్ ఫాదర్ రోల్ లో నటిస్తున్నారని తెలిసిందే. ఈ సినిమాలో ఆయన రోల్ సర్ ప్రైజ్ చేస్తుందని టాక్. ఇదే కాకుండా మరోసారి రాజశేఖర్ సోలో సినిమా ఒకటి చేస్తున్నారు. ఆల్రెడీ తమిళంలో సూపర్ హిట్ అయిన లబ్బర్ పందు సినిమా రీమేక్ తో తెలుగు ఆడియన్స్ ని అలరించాలని చూస్తున్నాడు రాజశేఖర్.

రాజశేఖర్ రమ్యకృష్ణ సూపర్ హిట్ జోడీ..

లబ్బర్ పందు సినిమాలో దినేష్ చేసిన పాత్రలో రాజశేఖర్ నటిస్తున్నారు. లబ్బర్ పందు సినిమా విలేజ్ క్రికెట్ నేపథ్యంతో తెరకెక్కిన సినిమా. ఐతే ఈ సినిమా తెలుగు వెర్షన్ లో రాజశేఖర్ తో పాటు విశ్వదేవ్ కూడా నటించనున్నాడు. సినిమాలో ఫిమేల్ లీడ్ గా కూడా రాజశేఖర్ డాటర్ చేస్తున్నారు. ఐతే సినిమాలో రాజశేఖర్ కి జోడీగా శివగామి రమ్యకృష్ణ నటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

రాజశేఖర్ రమ్యకృష్ణ ఇద్దరిదీ సూపర్ హిట్ జోడీ. అల్లరి ప్రియుడు నుంచి దాదాపు వీళ్లు చేసిన అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఐతే దాదాపు 30 ఏళ్ల క్రితం కలిసి నటించిన ఈ ఇద్దరు మళ్లీ కలిసి సినిమా చేస్తున్నారు. లబ్బర్ పందు తెలుగులో రాజశేఖర్ ఫ్యామిలీ రీమేక్ చేస్తున్నారు. డైరెక్షన్ బాధ్యతలను కూడా జీవిత రాజశేఖర్ చేస్తారన్న టాక్ ఉంది. ఐతే ఆ విషయంపై అఫీషియల్ కన్ ఫర్మేషన్ రావాలి.

రిస్క్ లేనిదే కెరీర్ ముందుకు సాగదని..

ఐతే ఓటీటీలో ఆల్రెడీ అందరు చూసిన లబ్బర్ పందు సినిమాను మళ్లీ తెలుగులో రీమేక్ చేయాలని అనుకోవడం రిస్క్ అనే చెప్పొచ్చు. కానీ తెలుగులో ఇలాంటి కథలను మంచి డిమాండ్ ఉంటుంది. తన కంబ్యాక్ కి ఇది మంచి సినిమా అని భావిస్తున్నారు రాజశేఖర్. ఐతే సినిమాలో నటించడమే కాదు దినేష్ క్రికెట్ లో కూడా తన పర్ఫెక్షన్ చూపిస్తాడు మరి ఈ సినిమా కోసం రాజశేఖర్ క్రికెట్ ప్రాక్టీస్ కూడా చేసేందుకు రెడీ అయ్యారట.

మొత్తానికి రిస్క్ లేనిదే కెరీర్ ముందుకు సాగదని ఈ టైం లో కూడా రీమేక్ సినిమాతో మెప్పించాలని చూస్తున్నారు రాజశేఖర్. సినిమాలో రమ్యకృష్ణ నటించడం కలిసి వచ్చే అంశమే అవుతుంది. ఇక లబ్బర్ పందు తెలుగు రీమేక్ డైరెక్టర్ ఇంకా మిగతా డీటైల్స్ త్వరలో తెలియనున్నాయి. సినిమా కోసం రాజశేఖర్ మాత్రం చాలా ఫోకస్ తో పనిచేస్తున్నారని తెలుస్తుంది.

ఒకప్పుడు తన యాక్షన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రాజశేఖర్ ఇప్పుడు పూర్తిగా ఫాం కోల్పోయారు. ఐతే విలన్ గానో, సపోర్టింగ్ రోల్స్ తోనే తిరిగి ఛాన్స్ లు అందుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నా కూడా అవి కూడా పెద్దగా రావట్లేదు. ఐతే ప్రస్తుతం శర్వానంద్ బైకర్ లో మంచి రోల్ చేస్తున్నట్టు తెలుస్తుండగా ఇప్పుడు మరో రీమేక్ తో రాజశేఖర్ ఆడియన్స్ ని అలరించేందుకు వస్తున్నారు.