ఆ ఒక్క హిట్ ముగ్గరు భామలకు మార్గదర్శకం!
భారీ అంచనాల మధ్య పాన్ ఇండియాలో 'ది రాజాసాబ్' మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
By: Srikanth Kontham | 8 Jan 2026 4:13 PM ISTభారీ అంచనాల మధ్య పాన్ ఇండియాలో 'ది రాజాసాబ్' మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రచార చిత్రాలతో హిట్ కొడతామనే ధీమాతో టీమ్ కాన్పిడెంట్ గా ఉంది. అభిమానుల్లోనే అంతే నమ్మకం కనిపిస్తోంది. మరి ఈ సినిమా సక్సెస్ ప్రధానంగా ఎంతమందికి కీలకం అంటే? సినిమాలో ముగ్గురు హీరయిన్లకు ఈ విజయం అత్యంత కీలకమైంది. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత నిధి అగర్వాల్ కి ఒక్క హిట్ పడలేదు. స్టార్స్ చిత్రాల్లో అవకాశాలైతే అందుకుంది గానీ ఆ సినిమాలేవి విజయం సాధించలేదు. దీంతో అమ్మడి చేతిలో బిగ్ ప్రాజెక్ట్ ఇది ఒక్కటే.
ఈ సినిమా విజయం సాధిస్తేనే నిధి అగర్వాల్ కొత్త అవకాశాలతో బిజీ అవుతుంది. లేదంటే మరో ఛాన్స్ కష్టమనే టాక్ వినిపిస్తోంది. ఇదే సినిమాతో మాలీవుడ్ బ్యూటీ మాళవికా మోహనన్ ఎంట్రీ ఇస్తుంది. తొలి ఛాన్స్ ఏకంగా ప్రభాస్ తోనే అందుకుంది. ఈ విషయంలో అమ్మడు ఎంతో లక్కీ. ఎంతో మంది భామలు డార్లింగ్ సరసన నటించాలని కోరుకుంటున్నారు? వాళ్లెవ్వరికీ రాని అవకాశం మాళవికకు తొలి చిత్రమే కల్పించింది. సక్సెస్ అయితే మాళవిక టాలీవుడ్ లో బిజీ అవుతుంది. రాజాసాబ్ క్రేజ్ తో మాత్రం ఇంత వరకూ తెలుగులో కొత్త ప్రాజెక్ట్ లు వేటికి సైన్ చేయలేదు.
అమ్మడి కెరీర్ ని ఈ సక్సెస్ చాలా వరకూ డిసైడ్ చేసే అవకాశం ఉంది. స్టార్ లీగ్ లో చేరడానికి పెద్దగా సమయం పట్టదు. ఈ సినిమా పై మాళవిక కూడా చాలా కాన్పిడెంట్ గా ఉంది. ఇకపై తెలుగు సినిమాలే చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. ప్రస్తుతం కోలీవుడ్ లో 'సర్దార్ 2'లోనూ నటిస్తోంది. ఈ సినిమా కూడా ఇదే ఏడాది రిలీజ్ కానుంది. ముంబై బ్యూటీ రిద్దీ కుమార్ కి మాత్రం అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ ఇది. ఇందులో అమ్మడు పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదని మారుతి హింట్ ఇచ్చేసాడు. ప్రభాస్ తో కొన్ని కాంబినేషన్ సన్నీవేశాలున్నాయి.
రిద్దీకి లిప్ట్ ఇవ్వాలి? అన్న కారణంగా మారుతి కల్పించిన అవకాశం ఇది. 'లవర్', 'అనగనగా ఒక ప్రేమ కథ'లాంటి చిత్రాల్లో నటించినా రిద్దీ టాలీవుడ్ లో సక్సెస్ అవ్వలేకపోయింది. అందం, అభినయం ప్రతిభ ఉన్నా అదృష్టం కలిసి రాక ఛాన్సులు అందువకోవడంలో వెనుకబడింది. వాటితో పని లేకుండా మారుతి ఛాన్స్ ఇచ్చిన నేపథ్యంలో అమ్మడు ఈ విజయంపై చాలా ఆశలు పెట్టుకుంది. సక్సెస్ అయితే కొత్త అవకాశాలకు 'రాజాసాబ్' బాట వేస్తాడని చాలా నమ్మకంగా ఎదురు చూస్తోంది. ఈ సినిమా విజయంతో మారుతి ఇమేజ్ కూడా రెట్టింపు అవుతుంది. మరేం జరుగుతుందన్నది చూడాలి.
