రాజా సాబ్ మెయిన్ హైలైట్స్ అవేనట!
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభాస్ తన కెరీర్లో మొదటిగా చేస్తున్న మొదటి హార్రర్ కామెడీ థ్రిల్లర్ ఇదే.
By: Sravani Lakshmi Srungarapu | 8 Jan 2026 6:04 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి ఏడాది తర్వాత వస్తున్న సినిమా ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభాస్ తన కెరీర్లో మొదటిగా చేస్తున్న మొదటి హార్రర్ కామెడీ థ్రిల్లర్ ఇదే.
క్రేజీగా ఉండనున్న ప్రభాస్ క్యారెక్టర్
ఆల్రెడీ రాజా సాబ్ నుంచి రిలీజైన పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్, ట్రైలర్లు సినిమాపై అంచనాల్ని పెంచగా, ఇప్పుడీ సినిమా గురించి, అందులోని హైలైట్స్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. రాజా సాబ్ లో ప్రభాస్ యాక్టింగ్, తన స్క్రీన్ ప్రెజెన్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయని, సినిమా మొత్తానికి ప్రభాస్ క్యారెక్టర్ చాలా క్రేజీగా ఉంటుందని, బిగ్గెస్ట్ అస్సెట్ అవుతుందని అంటున్నారు.
ఇండస్ట్రీలోని క్లోజ్ సర్కిల్స్ ప్రకారం, ఈ సినిమాలోని కొన్ని సీన్లు ఆడియన్స్ ను సర్‌ప్రైజ్ చేస్తాయని తెలుస్తోంది. వాటిలో ఎడారిలోని ఫైట్, హీరోయిన్ మాళవికను మొసలి నుంచి కాపాడే సీన్, ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ యాక్టింగ్, సంజయ్ దత్ తో జరిగే భారీ ఫైట్, మార్కెట్ దెయ్యాల సీక్వెన్స్ ప్రేక్షకుల్ని అలరిస్తాయని, ఈ సీన్స్ కు ఆడియన్స్ స్టన్ అవుతారని, సినిమాలోని ఆఖరి 30 నిమిషాలు అదిరిపోతుందని కూడా చెప్తున్నారు.
ప్రభాస్ పాన్ వరల్డ్ స్టార్
ఇదిలా ఉంటే ప్రభాస్ నిజంగా పాన్ ఇండియా స్టారేనా అని బాలీవుడ్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు రీసెంట్ గా జరిగిన ఓ మీడియా ఇంటరాక్షన్ లో మారుతి అతనికి గట్టి ఆన్సరే ఇచ్చరు. ప్రభాస్ కు జపాన్ లో కూడా భారీగా ఫ్యాన్స్ ఉన్నారని, కాబట్టి ఆయన పాన్ ఇండియా స్టార్ కాదని, ప్రభాస్ పాన్ వరల్డ్ స్టార్ అని చెప్పడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆ ఆన్సర్ కు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
