ఆ కాంబినేషన్స్ కలిస్తే వరల్డే ఊగిపోదు!
దర్శక శిఖరం రాజమౌళి టాలీవుడ్ హీరోలతోనే పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్, రామ్ చరణ్,ఎన్టీఆర్ లతో ఇప్పటికే పని చేసారు.
By: Srikanth Kontham | 31 Dec 2025 12:00 PM ISTదర్శక శిఖరం రాజమౌళి టాలీవుడ్ హీరోలతోనే పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్, రామ్ చరణ్,ఎన్టీఆర్ లతో ఇప్పటికే పని చేసారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో `వారణాసి` తెరకెక్కిస్తున్నారు.
ఆ తర్వాత జక్కన్న మైండ్ లో ఉండే హీరో ఎవరు? అంటే బన్నీకి ఆ ఛాన్స్ ఉంది. బన్నీతోనూ పనిచేస్తే టాప్ స్టార్ లైన్ క్లియర్ అయినట్లే. మరి ఆ తర్వాత రాజమౌళి పనిచేసే హీరోలు ఎవరు? అంటే వెళ్తే బాలీవుడ్ కి వెళ్లాలి. లేదం టే పాత హీరోల్నే మళ్లీ రిపీట్ చేయాలి. ఆ రెండు కాకపోతే సీనియర్ స్టార్ చిరంజీవి సహా ఇతర స్టార్లతో ఛాన్స్ తీసుకోవాలి.
అందుకు ఆస్కారం ఉంటుందా? అంటే రాజమౌళి తలుచుకుంటే అదేం జరగనిది కాదు. జక్కన్నతో పని చేయాలని అమీర్ ఖాన్ క్యూలో ఉన్నా? రాజమౌళి ఛాన్స్ తీసుకోవడం లేదంటే? అందుకు ఎన్నో సమీకర ణాలున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్..విశ్వనటుడు కమల్ హాసన్ పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. రజనీకాంత్ ఇప్పటికే పాన్ వరల్డ్ స్టార్. ఆ ఇద్దరు చేతులు కలిపితే? ఎలా ఉంటుంది? అన్నది ఊహకి కూడా అందదు. ఆ కాంబినేషనే ఊహకి అందని విధంగా ఉంటుంది. పాన్ వరల్డ్ నే షేక్ చేయగల సమర్దులు.
మరి అందుకు ఆస్కారం ఉందా? అంటే అక్కడా రకరకాల ఈక్వెషన్స్ అడ్డొస్తుంటాయి. రజనీ ...జక్కన్న తో సినిమా చేయాలంటే? రాజమౌళికి బాండ్ అవ్వాలి. సంవత్సరాలు సమయం కేటాయించాలి. కానీ అందుకు రజనీ సహకరించడం కష్టం. శంకర్ తో `రోబో` తీసిన సమయంలోనే పూర్తి చేయగలనా? లేదా? అన్న సందేహాన్నని వ్యక్తం చేసారు. శంకర్ తో లాంగ్ జర్నీ తన వల్ల కాదనేసారు. ప్రస్తుతం రజనీకాంత్ వయసు కూడా 70 ఏళ్లు దాటింది. ఇలాంటివన్నీ ఆ కాంబినేషన్ ని వెనక్కి లాగే అవకాశం ఉంటుంది.
అలాగే కమల్ హాసన్ లాంటి స్టార్ తో రాజమౌళి కలిస్తే ఎలా ఉంటుంది? అంటే మరో అద్బుతానికే అవకాశం ఉంటుంది. ఏజ్ అన్నది కమల్ కి ఓ నెంబర్ మాత్రమే. 71 ఏళ్ల వయసులోనూ ఎంతో ఎనర్జిటిక్ గా పనిచేయడం కమల్ ప్రత్యేకత. రాజమౌళి కమల్ తో ఓ గొప్ప ప్రయోగాత్మక కాన్సెప్ట్ ని తీయోచ్చు. అందుకు అన్ని రకాలుగా కమల్ సహకరిస్తారు. ఆ విషయంలో ఛాన్స్ తీసుకోవాల్సింది మాత్రం జక్కన్నే. మరి రాజమౌళి భవిష్యత్ ప్రణాళికలో ఈ స్టార్లు అంతా ఉన్నారా? లేదా? అన్నది చూడాలి.
