Begin typing your search above and press return to search.

ఆ విష‌యంలో జ‌క్క‌న్న కంటే సుకుమార్ ఉత్త‌మంగా!

తెలుగు చలనచిత్ర పరిశ్రమను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడిగా రాజమౌళి స్థానం తిరుగులేనిది. తన ఊహాశక్తితో, విజువల్ వండర్స్‌తో `ఆర్ఆర్ఆర్` మూవీతో ఆస్కార్ వేదిక వరకు బాహుబలిలా జెండా పాతారు.

By:  Srikanth Kontham   |   7 Oct 2026 6:00 AM IST
ఆ విష‌యంలో జ‌క్క‌న్న కంటే సుకుమార్ ఉత్త‌మంగా!
X

తెలుగు చలనచిత్ర పరిశ్రమను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడిగా రాజమౌళి స్థానం తిరుగులేనిది. తన ఊహాశక్తితో, విజువల్ వండర్స్‌తో `ఆర్ఆర్ఆర్` మూవీతో ఆస్కార్ వేదిక వరకు బాహుబలిలా జెండా పాతారు. అయితే దర్శకుడిగా వంద శాతం సక్సెస్ రేట్ ఉన్న రాజమౌళి సమర్పకుడిగా , ప్రొడ్యూసర్‌గా వస్తున్న సినిమాల విషయంలో మాత్రం అనుకున్న స్థాయిలో మ్యాజిక్ రిపీట్ చేయలేకపోతున్నారనే చర్చ సినీ వర్గాల్లో గట్టిగా నడుస్తోంది. తాజాగా ఆయన సమర్పణలో ఫహద్ ఫాసిల్ కథానాయకుడిగా రూపొందిన `డోంట్ ట్రబుల్ ది ట్రబుల్` సైతం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

గతాన్ని పరిశీలిస్తే రాజమౌళి సమర్పణ తోడైన చిత్రాల్లో `విశాఖ ఎక్స్‌ప్రెస్`, `రాజన్న`, `అందాల రాక్షసి`, `బ్రహ్మాస్త్ర` (తెలుగు వెర్షన్) వంటి సినిమాలున్నా? ఇవేవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనాలు నమోదు చేయలేకపోయాయి. రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ వల్ల ప్రారంభ వసూళ్లు ల‌భించినా? కంటెంట్ పరంగా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.

ఇదే కోవలో సొంత బ్యానర్ `సుకుమార్ రైటింగ్స్` ద్వారా సినిమాలను నిర్మిస్తున్న మరో దిగ్గజ దర్శకుడు సుకుమార్ మాత్రం పూర్తి భిన్నమైన వ్యూహంతో దూసుకుపోతున్నారు. సుకుమార్ నిర్మాతగానే కాకుండా శిష్యులకు, యువ దర్శకులకు అవకాశాలు ఇస్తూ కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. `కుమారి 21ఎప్` మొదలైన విజయయాత్ర `ఉప్పెన`, `విరూపాక్ష` వంటి భారీ బ్లాక్‌‌బస్టర్ల వరకు నిరాటంకంగా కొనసాగింది.

స్క్రిప్ట్ ఎంపిక చేయడం, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో సుకుమార్ తీసుకునే జాగ్ర‌త్త‌లే ఆయన బ్యానర్‌ను సక్సెస్ రూట్‌లో ఉంచాయన్న‌ది కాద‌న‌లేని నిజం. దర్శకుడిగా రాజమౌళి శిఖరాగ్రాన ఉన్నా? సమర్పకుడిగా.. నిర్మా తగా కంటెంట్ ఎంపిక, సక్సెస్ రేట్ విషయంలో మాత్రం జక్కన్న కంటే సుకుమారే మెరుగైన స్థానంలో ఉన్నార నడంలో సందేహం లేదు.

ప్ర‌త్యేకించి సుకుమార్ శిష్యులు గొప్ప ద‌ర్శ‌కులుగా ఎదుగుతున్నారు. అత‌డి కాంపౌండ్ నుంచి వ‌చ్చిన వారంతో సోంతంగా సినిమాలు చేస్తున్నారు. వాటికి సుకుమార్ ఏదో రూపంలో స‌హ‌కారం అంది స్తున్నారు. కానీ ఇంత వ‌ర‌కూ రాజ‌మౌళి స్కూల్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి స‌క్సెస్ అయిన ద‌ర్శ‌కులు లేరు. జ‌క్క‌న్న వ‌ద్ద చాలా మంది ప‌నిచేసారు. కానీ వాళ్లెవ్వ‌రు స‌క్సెస్ అవ్వ‌లేదు. త‌న అసిస్టెంట్..అసోసియేట్ ద‌ర్శ‌కుల గురించి రాజ‌మౌళి ఫోక‌స్డ్ గా చెప్పింది కూడా పెద్ద‌గా లేదు.